2024లో యూత్‌కు నిద్రపట్టకుండా చేసిన టాప్ 5 బైక్‌లు ఇవే! లిస్ట్‌లో మీ ఫేవరెట్ మోడల్ కూడా ఉండవచ్చు..
మరికొద్ది రోజుల్లో 2024 ఏడాది పూర్తవుతుంది. ఎప్పటిలాగే ఈ సంవత్సరంలో కూడా ఎన్నో గుర్తుండిపోయే జ్ఞాపకాలు ఉంటాయి. వాటిలో సంతోషాలు, బాధలు ఉంటాయి. ముఖ్యంగా ఈ ఏడాదిలో చాలా మంది కొత్త కార్లు, బైకులను కొనుగోలు చేశారు. ఆటోమొబైల్ రంగానికి సంబంధించి కొత్త లాంచ్‌లు, వాటి విక్రయాలు చాలా కీలకం. ప్రతి సంవత్సరం లాగే, ఈ ఏడాదిలో కూడా దిగ్గజ వాహనాల కంపెనీల నుంచి మొదలుకుని కొత్తగా మార్కెట్లోకి అడుగుపెట్టిన కంపెనీలు వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా అధునాతన ఫీచర్లతో బైకులు, కార్లను లాంచ్ చేశాయి. బైకుల విషయానికి వస్తే, టూవీలర్ తయారీ కంపెనీలు ఈ ఏడాదిలో సరికొత్త డిజైన్లతో రెట్రో-శైలి బైక్‌లను లాంచ్ చేశాయి. ఇవి చూడటానికి ఎక్కువగా యూత్‌ను అట్రాక్ట్ చేసే విధంగా ఉన్నాయి. కొన్ని అన్ని వయస్సుల వారికి నచ్చే విధంగా ఉన్నాయి. 2024లో అలరించిన 5 రెట్రో-శైలి బైక్‌ల గురించి క్రింది కథనంలో చూద్దాం,
Royal Enfield Bear 650: రాయల్ ఎన్‌ఫీల్ట్ నుంచి విడుదలైన బైకులకు భారీ క్రేజ్ ఉంటుంది. దశాబ్ద కాలంగా ఇది ఇతర కంపెనీలకు బైకుల విక్రయాల్లో గట్టి పోటీ ఇస్తోంది. ఇదిలా ఉంటే రాయల్ ఎన్‌ఫీల్డ్ బేర్ 650 మోడల్ ఈ ఏడాదిలో విడుదల అయింది. ఇది 1960 నాటి బైక్‌ల డిజైన్‌ను పోలి ఉంటుంది. ముఖ్యంగా బేర్‌ను 1960లలో యూఎస్‌లో జరిగిన బేర్ రన్ పేరు నుండి తీసుకున్నారు.

Triumph Speed T4: ట్రయంఫ్ కంపెనీ చాలా కాలంగా ఇండియాలో తన మార్కెట్‌ను పెంచుకోడానికి ఇతర కంపెనీలతో పోటీ పడుతూ కొత్త బైకులను విడుదల చేస్తుంది. ఈ ఏడాది కూడా ట్రయంఫ్ స్పీడ్ T4ను తెచ్చింది. అలాగే, 2024లో స్పీడ్ D4 బైక్, స్పీడ్ 400 బైక్‌ను విడుదల చేసింది. ఇవి దేశీయంగా మంచి అమ్మకాలను సాధిస్తున్నాయి. పండగల సమయంలో ట్రయంఫ్ బైకులు ఎక్కువగానే అమ్ముడుపోయాయి.
Royal Enfield Goan Classic 350: రాయల్ ఎన్‌ఫీల్డ్ బైకుల్లో గోవాన్ క్లాసిక్ 350 మోడల్ ఇటీవల కాలంలో బాగా క్లిక్ అవుతుంది. దీన్ని క్లాసిక్ 350 ఆధారంగా తయారు చేశారు. కొద్ది నెలల క్రితమే ఈ మోడల్‌ను మార్కెట్లోకి విడుదల చేశారు. ఇది 349సీసీ J-సిరీస్ ఇంజిన్‌తో రన్ అవుతుంది. సింగిల్ సీటు వెర్షన్‌లో ఉంది. ఈ బైక్ రూ. 2.35 లక్షల(ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరతో విడుదల అయింది.

BSA Gold Star 650: బ్రిటిష్‌కు చెందిన బైకుల తయారీ కంపెనీ BSA చాలా సంవత్సరాల గ్యాప్ తర్వాత గోల్డ్ స్టార్ 650ను విడుదల చేసింది. ఇప్పటికే దీనిలో పాత గోల్డ్ స్టార్ 650 ఉండగా, ఈ ఏడాది భారత మార్కెట్లో అధునాతన ఫీచర్లతో గోల్డ్ స్టార్‌ను మార్కెట్లోకి తీసుకువచ్చింది.ఇవి చూడటానికి ఒకే విధంగా ఉన్నప్పటి ఫీచర్ల పరంగా తేడాలు ఉన్నాయి. ఇది సింగిల్-సిలిండర్ 650cc ఇంజిన్‌తో రన్ అవుతుంది.
Java 42 fj: జావా కంపెనీ బైకులు చాలా స్టైలీష్‌గా ఉంటాయి. అంతర్జాతీయంగా బాగా డిమాండ్ ఉండే లగ్జరీ బైకుల లుక్‌ను ఇవి కలిగి ఉంటాయి. రాయల్ ఎన్‌ఫీల్డ్ కంపెనీకి పోటీగా చాలా మోడళ్లను భారత మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ ఏడాది మోడ్రన్ లుక్‌తో జావా 42 ఎఫ్‌జెను తీసుకొచ్చింది. ఇది 334సీసీ, సింగిల్ సిలిండర్, ఆల్ఫా-2 సిరీస్ లిక్విడ్ కూల్డ్ ఇంజిన్‌ను కలిగి ఉంది.

ఇవే కాకుండా ఇతర కంపెనీలు కూడా భారత మార్కెట్లో ఈ ఏడాదిలో రెట్రో-శైలి బైక్‌లను విడుదల చేశాయి. మారుతున్న కాలానికి అనుగుణంగా పాత బైకులనే అధునాతనంగా లేటెస్ట్ ట్రెండ్‌కు అనుగుణంగా మార్పులు చేసి లాంచ్ చేస్తుండగా, దాదాపు ఇలాంటి మోడళ్లన్నీ కూడా బాగా క్లిక్ అవుతున్నాయి.


Click it and Unblock the Notifications








