డిసెంబర్‌లో వచ్చిన బెస్ట్ మైలేజ్, బడ్జెట్ ధరలో లభించే మోడల్స్‌పై ఓ లుక్కేయండి

భారత్‌లో ఈ ఏడాది అధునాతన ఫీచర్లతో కూడిన టూవీలర్లు విడుదల అయ్యాయి. 2024 జనవరి నుంచి మొదలుకుని డిసెంబర్ వరకు కూడా ప్రతినెలా మార్కెట్లోకి కొత్త టూవీలర్లు లాంచ్ అవుతూనే ఉన్నాయి. కొత్త ఏడాది మరికొద్ది రోజుల్లో ముగుస్తుంది అనగా, కూడా వాహన తయారీ కంపెనీలు ఆకర్షణీయమైన డిజైన్‌లతో, మంచి పెర్ఫామెన్స్ ఇచ్చే టూవీలర్లను విడుదల చేశాయి. వీటిలో ప్రధానంగా 125 cc నుంచి 650 cc వరకు కెపాసిటీ కలిగిన టూవీలర్లు ఉన్నాయి. హోండా (Honda), కేటీఎమ్ (KTM), కవాసకి(kawasaki) వంటి దిగ్గజ టూవీలర్ తయారీ కంపెనీల నుంచి పలు మోడళ్లు 2024 డిసెంబర్ నెలలో లాంచ్ అయ్యాయి. ఇవి అధునాతన ఫీచర్లు, లేటెస్ట్ టెక్నాలజీ, మంచి డిజైన్‌లో వినియోగదారులను ఆకట్టుకుంటున్నాయి. ఈ మూడు కంపెనీల నుంచి 5 మోడళ్లు మంచి డిమాండ్‌‌ను సాధిస్తున్నాయి. డిసెంబర్‌లో వచ్చిన ఈ ఐదు మోడళ్ల గురించి క్రింది కథనంలో తెలుసుకుందాం..

kawasaki Z650RS: కవాసకి జెడ్‌650ఆర్‌ఎస్ బైక్ 2025 ఏడాది కోసం లాంచ్ అయింది. ఇది మార్కెట్లో రూ.7.20 లక్షల (ఎక్స్-షోరూమ్) ధరకు అందుబాటులో ఉంది. ఇది 649 cc సమాంతర-ట్విన్ ఇంజిన్‌తో రన్ అవుతుంది. ఈ ఇంజిన్ 67 bhp పవర్, 64 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ బైక్ చూడటానికి పాత కాలపు రెట్రో స్టైలింగ్ కనిపిస్తుంది. లేటెస్ట్ ఫీచర్లకు మాత్రం ఎలాంటి కొదవ లేదు.

Kawasak Two Wheeler Launched In December

Kawasaki KLX 230 Dual Sport: కవాసకి కేఎల్‌ఎక్స్ 230 డ్యూయల్ స్పోర్ట్ ఆఫ్-రోడ్ అడ్వెంచర్‌లను కోరుకునే వినియోగదారులకు అత్యంత అనువైన మోడల్. ఇది 233 cc సింగిల్-సిలిండర్ ఇంజన్ ద్వారా రన్ అవుతుంది. 18.1 bhp పవర్, 18.3 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీని ధర రూ.3.30 లక్షల ధర (ఎక్స్-షోరూమ్). కఠినమైన ఏరియాల్లో ఈజీ రైడింగ్ కోసం అధునాతన సస్పెన్షన్ సెటప్ కూడా ఉంది.

KTM RC 125: కేటీఎమ్ ఆర్‌సీ 125 మోడల్ ధర రూ.1,81,913 (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ). ఇది 124.7 cc ఇంజిన్ కెపాసిటీతో లాంచ్ అయింది. 14.5 ps పవర్, 12 Nm గరిష్ట టార్కును ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజిన్‌కు 6 స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌ను జోడించారు. మైలేజ్ 37 కిమీ వరకు వస్తుంది. అడ్జెస్ట్ హ్యాండిల్‌బార్‌, మెరుగైన బ్రేక్‌లు, LCD ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ వంటి వాటిని కలిగి ఉంది.

Ktm rc 125 two Wheeler Launched In December

Honda Activa 125: హోండా యాక్టివా 125 ఇండియాలో మంచి డిమాండ్ ఉన్న స్కూటర్. దీనిలో పాత మోడల్‌కు చాలా మంది కస్టమర్లు ఉన్నారు. ఈ నేపథ్యంలో మరింత వినియోగదారులకు తన స్కూటర్‌ను అందించడానికి సరికొత్తగా 2025 యాక్టివా 125ను తెచ్చింది. ముఖ్యంగా కాలుష్య కారక ఉద్గారాలను తక్కువ స్థాయిలో విడుదల చేయడానికి ఇంజిన్ OBD2B ప్రమాణాలకు అనుగుణంగా ఉంటుంది. ఇది పలు కలర్ వేరియంట్లలో అందుబాటులో ఉంది.

2025 హోండా యాక్టివా 125 మోడల్ 123.92 cc ఇంజిన్‌ను కలిగి ఉంది. ఇది 8.3 bhp పవర్‌ను ఉత్పత్తి చేస్తుంది. పాత దానితో పోలిస్తే దీనిలో అధునాతన ఫీచర్లు ఉన్నాయి. బ్లూటూత్ కనెక్టివిటీ వంటి స్మార్ట్ ఆప్షన్లు, USB టైప్-C ఛార్జింగ్ పోర్ట్, 4.2-అంగుళాల TFT డాష్‌బోర్డ్‌, నావిగేషన్, కాల్, మెసేజ్ అలర్ట్‌లు, హోండా రోడ్‌సింక్ యాప్‌ కనెక్టివిటీ వంటివి ఉన్నాయి. దీని ధర రూ. 94,922గా ఉంది.

Top 5 Two Wheelers In December

Honda Unicorn 160: హోండా యునికార్న్ 160 రూ.1.19 లక్షలు (ఎక్స్ షోరూమ్). రోజువారి అవసరాలకు ఇది సరైన ఆప్షన్. ఈ బైక్ పూర్తిగా డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ డిస్‌ప్లేతో వచ్చింది. 162.7 సిసి సింగిల్ సిలిండర్, ఎయిర్ కూల్డ్ ఇంజిన్‌ను కలిగి ఉంది. ఇది 13 bhp పవర్, 14.5 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజిన్ తక్కువ కాలుష్యానికి కారణమయ్యే OBD2B ప్రమాణాలకు అనుగుణంగా ఉంటుంది.

More from DriveSpark

Article Published On: Friday, December 27, 2024, 16:00 [IST]
English summary
Top 5 two wheelers launched in december 2024 here the details
Read more on: #auto #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+