మంచి మైలేజ్.. బడ్జెట్ ధరతో.. సేల్స్‌లో దూసుకుపోతున్న టాప్ టూవీలర్స్‌పై ఓ లుక్కేయండి..
భారత్‌లో టూవీలర్ల వాడకం ఓ రేంజ్‌లో పెరిగింది. ప్రతి ఏటా కొత్త మోడళ్లు విడుదల అవుతున్న కొద్ది టూవీలర్స్ సేల్స్ విపరీతంగా పెరుగుతూనే ఉన్నాయి. అయితే ఇలా మార్కెట్లోకి విడుదలైన వాటిలో కొన్ని మాత్రం మిగతా వాటికంటే మరింత ఎక్కువ ఆదరణ సాధిస్తుంటాయి. భారత్‌లో మధ్య తరగతి జనాభా ఎక్కువగా ఉండటం వలన ఎక్కువ మైలేజ్, తక్కువ ధరలో లభించే టూవీలర్లకు డిమాండ్ ఎక్కువగా ఉండి, అమ్మకాల పరంగా దూసుకుపోతుంటాయి. ముఖ్యంగా టూవీలర్ తయారీ దారులు ఈ ఏడాది మంచి సేల్స్‌ను సాధించారు. దసరా, దీపావళి సమయంలో అయితే అంచనాలకు మించి ఎక్కువ టూవీలర్లు అమ్ముడుపోయాయి. ఇదిలా ఉంటే, నవంబర్ నెలలో కూడా దిగ్గజ కంపెనీలకు చెందిన టాప్ టూవీలర్ మోడళ్లు మెరుగైన సేల్స్ సాధించాయి. వీటిలో హోండా, హీరో, బజాజ్, టీవీఎస్ వంటి వాటితో పాటు ఇతర కంపెనీలకు చెందిన మోడళ్లు ఉన్నాయి.
నవంబర్ 2024 నెలలో హీరో (Hero) కంపెనీకి చెందిన దేశంలోనే అత్యంత డిమాండ్ ఉన్న మోడల్ స్పెండర్ (Splendor)ను 2,93,828 మంది కొనుగోలు చేశారు. ఇది ఏడాది ప్రాతిపదికన చూసినట్లయితే దాదాపు 17.16 శాతం వృద్ధిని సాధించింది. అంతకుముందు 2023 ఏడాది నవంబర్ నెలలో ఈ మోడల్ సేల్స్ దాదాపు 2,20,786 యూనిట్లుగా నమోదైంది. ఇండియాలో నవంబర్ నెల టూవీలర్ సేల్స్‌లో స్పెండర్ టాప్ మోడల్‌గా ఉంది.

తరువాత రెండో స్థానంలో దిగ్గజ కంపెనీ హోండా (Honda)కు చెందిన యాక్టివా (Activa) స్కూటర్ 2,06,844 యూనిట్ల సేల్స్‌ను సాధించింది. ఇది ఏడాది ప్రాతిపదికన చూసినట్లయితే దాదాపు 5.50 శాతం వృద్ధి. ఈ మోడల్‌కు దేశంలోని పట్టణ ప్రాంతాలతో పాటు, గ్రామీణ ఏరియాల్లో కూడా మంచి డిమాండ్ ఉంది. 2023 నవంబర్ నెలలో యాక్టివా సేల్స్ 1,96,055 యూనిట్లుగా నమోదయ్యాయి. స్కూటర్ విభాగంలో ఇది అత్యంత డిమాండ్ ఉన్న మోడల్.
దీని తరువాత 2024 నవంబర్ సేల్స్‌లో మూడో స్థానంలో హోండా షైన్ ఉంది. బైకుల విభాగంలో స్పెండ్లర్‌తో పోటీ పడుతూ మంచి సేల్స్‌ను సాధిస్తున్న ఈ మోడల్ తక్కువ ధరలో ఎక్కువ మైలేజ్‌ను ఇస్తుంది. సేల్స్ పరంగా చూసినట్లయితే సమీక్షలో షైన్ 1,45,530 యూనిట్ల అమ్మకాలను సాధించింది. అదే 2023 నవంబర్‌లో సేల్స్ 1,55,943 యూనిట్లుగా ఉంది. ఏడాది ప్రాతిపదికన 6.7 శాతం స్వల్పంగా తగ్గినప్పటికీ మూడో స్థానం పొందింది.

నాలుగో స్థానం గురించి చూసినట్లయితే బజాజ్ పల్సర్ దేశంలో చాలా మంది ఆప్షన్‌గా ఉంది. నవంబర్‌లో ఈ బైకును 1,14,467 మంది కొనుగోలు చేశారు. ఇది ఏడాది ప్రాతిపదికన ఇదే నెలతో పోల్చినట్లయితే సేల్స్ 12.22 శాతం తగ్గాయి. 2023 నవంబర్‌లో పల్సర్‌ను 1,30,403 మంది కొనుగోలు చేశారు. ఐదో స్థానంలో టీవీఎస్ కంపెనీకి చెందిన జూపిటర్ ఉంది. ఇది మొత్తం 99,710 యూనిట్ల సేల్స్‌ను సాధించింది.
టీవీఎస్ జూపిటర్ 2023 ఏడాది నవంబర్ నెలలో 72,859 యూనిట్ల సేల్స్ సాధించింది. ఏడాది ప్రాతిపదికన ఇది ఏకంగా 36.85 శాతం వృద్ధి చెందింది. స్కూటర్ల విభాగంలో యాక్టివా తరువాత ఈ మోడల్ అత్యంత డిమాండ్ ఉన్న స్కూటర్‌గా అవతరించింది. ఈ టాప్ 5 టూవీలర్లను ఇండియాలో చాలా మంది ఆదరించారు.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








