త్వరలో లాంచ్ అయ్యే బైక్స్ ఇవే! కొత్త బైక్ కొనాలనుకునే వారికి పండగే..

భారతీయ మార్కెట్లో కొత్త వాహనాలకు పెరుగుతున్న డిమాండ్ కారణంగా కంపెనీలు కూడా దేశీయ విఫణిలో ఎప్పటికప్పుడు ఆధునిక ఉత్పతులను (కార్లు, బైకులు) లాంచ్ చేయడానికి సిద్ధమవుతున్నాయి. ఈ కథనంలో త్వరలో భారతదేశంలో అరంగేట్రం చేయనున్న కొత్త బైకుల గురించి వివరాలు తెలుసుకుందాం.

కేటీఎం 125 డ్యూక్ 2024 (KTM 125 Duke 2024)

యువతకు ఇష్టమైన బైకులలో ఒక్కటైన కెటిఎమ్ బ్రాండ్ '125 డ్యూక్' 2024 కొత్త మోడల్ దేశీయ మార్కెట్లో ఈ నెలలో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ఈ బైక్ ధర రూ. 1.75 లక్షల నుంచి రూ. 1.80 లక్షల (ఎక్స్ షోరూమ్) మధ్య ఉండవచ్చని అంచనా. ఇది లాంచ్ అయిన తరువాత బజాజ్ డామినర్ 250 మరియు రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ 350 బైకులకు ప్రత్యర్గిగా ఉంటుంది.

KTM 125 Duke

బజాజ్ పల్సర్ 400 (Bajaj Pulsar 400)

బజాజ్ ఆటో (Bajaj Auto) యొక్క అత్యంత ప్రజాదరణ పొందిన బైకులతో పల్సర్ ఒకటి. గత కొన్ని సంవత్సరాలుగా దేశీయ మార్కెట్లో ఎంతోమంది కస్టమర్ల మనసుదోచిన ఈ బైక్ ఇప్పుడు పల్సర్ 400 (Pulsar 400) రూపంలో లాంచ్ అవ్వడానికి సిద్ధంగా ఉంది. ఈ బైక్ కూడా ఈ నెలలో (మార్చి 2024) లాంచ్ అవుతుందని సమాచారం.

భారతీయ మార్కెట్లో త్వరలో లాంచ్ కానున్న కొత్త బజాజ్ పల్సర్ 400 బైక్.. డామినర్ మాదిరిగానే 400 సీసీ ఇంజిన్ కలిగి ఉంటుందని సమాచారం. ఇది తప్పకుండా మంచి పర్ఫమెన్స్ అందిస్తుందని భావిస్తున్నాము. పల్సర్ 400 బైక్, డామినర్ బైక్ కంటే కొంత తేలికగా ఉండవచ్చని సమాచారం. దీని ధర రూ. 2 లక్షల నుంచి రూ. 2.2 లక్షల మధ్య ఉండవచ్చని అంచనా.

Royal Enfield Bobber 350

రాయల్ ఎన్‌ఫీల్డ్ బాబర్ 350 (Royal Enfield Bobber 350)

భారతదేశంలో యువకుల నుంచి పెద్దవారి వరకు అందరూ ఇష్టపడే బైకులలో రాయల్ ఎన్‌ఫీల్డ్ (Royal Enfield) ఒకటి. దీనిని దృష్టిలో ఉంచుకుని కంపెనీ ఎప్పటికప్పుడు తన విభాగంలో కొత్త కొత్త బైకులను లాంచ్ చేస్తూ ఉంటుంది. ఇందులో భాగంగానే కంపెనీ ఈ నెలలో 'బాబర్ 350' బైక్ లాంచ్ చేయడానికి సన్నద్ధమవుతోంది. ఈ బైక్ మంచి డిజైన్ మరియు ఫీచర్స్ కలిగి ఉంటుందని తెలుస్తోంది.

త్వరలో లాంచ్ కానున్న రాయల్ ఎన్‌ఫీల్డ్ బాబర్ 350 బైక్ ధర రూ. 2 లక్షల నుంచి రూ. 2.10 లక్షల వరకు ఉండవచ్చని సమాచారం. ధరలు అధికారికంగా లాంచ్ సమయంలో వెల్లడవుతాయి. కొత్త బాబర్ 350 బైక్ అదే జే-ప్లాట్‌ఫామ్ ఇంజిన్ పొందుతుందని తెలుస్తోంది. ఈ ప్లాట్‌ఫామ్ ఇంజిన్స్ ఇప్పటికే మీటియోర్ 350, హంటర్ 350 మరియు క్లాసిక్ 350 వంటివి పొందాయి.

Kawasaki Versys X 300

కవాసకి వెర్సిస్ ఎక్స్-300 (Kawasaki Versys X-300)

భారతదేశంలో అధిక ప్రజాదరణ పొందిన జపాన్ బ్రాండ్ కవాసకి తీవ్రాలోనే వెర్సిస్ ఎక్స్-300 బైక్ లాంచ్ చేయడానికి సిద్ధమవుతోంది. ఈ బైక్ ధరలు 4.8 లక్షల నుంచి రూ. 5.2 లక్షల మధ్య ఉండవచ్చు. ఈ బైక్ సింగిల్ పాడ్ హెడ్‌లైట్, సైడ్ స్లంగ్ ఎగ్జాస్ట్, హాలోజన్ హెడ్‌లైట్ మరియు సెమీ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ వంటి వాటిని పొందుతుంది.

లెక్ట్రిక్స్ ఈసిటీ జిప్ (Lectrix ECity Zip)

ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ పెరుగుతున్న తరుణంలో త్వరలోనే లెక్ట్రిక్స్ ఈసిటీ జిప్ దేశీయ మార్కెట్లో అడుగుపెట్టనుంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ధర రూ. 80000 నుంచి రూ. 90000 వరకు ఉండవచ్చు. ఇది మార్కెట్లో కైనెటిక్ ఈ లూనా, టీవీఎస్ ఎక్స్ఎల్ 100 కంఫర్ట్ మరియు టీవీఎస్ ఎక్స్ఎల్ 100 హెవీ డ్యూటీ వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది.

ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథనాలు తెలుసుకోవడంతో పాటు, దేశీయ మార్కెట్లో లాంచ్ అయ్యే కొత్త కార్లు మరియు బైకుల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి 'తెలుగు డ్రైవ్‌స్పార్క్' చూస్తూ ఉండండి. ఈ కథనంపై మీ అభిప్రాయాలను మరియు సందేహాలను తప్పకుండా మాతో పంచుకోండి. లేటెస్ట్ ఆటోమొబైల్ వార్తలు కోసం ఫేస్‌బుక్ (Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) మరియు యూట్యూబ్ (YouTube) ఛానల్స్ ఫాలో అవ్వండి.

More from DriveSpark

Article Published On: Saturday, March 2, 2024, 11:19 [IST]
English summary
Top 5 upcoming bikes in india 2024 ktm to kawasaki
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+