ఇండియాలో లభించే ది బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్స్.. మంచి స్కూటీ ఎన్నుకోండి డబ్బు ఆదా చేసుకోండి
దేశంలో ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ పెరుగుతుంది. ప్రస్తుతం టూ-వీలర్ విభాగంలో ఎక్కువగా ఎలక్ట్రిక్ స్కూటర్లను కొనుగోలు చేస్తున్నారు. కస్టమర్ల నుంచి వస్తున్న డిమాండ్‌కి తగినట్లుగా పలు కొత్త కంపెనీలు ఎక్కువ రేంజ్ అందించే స్కూటర్లను ప్రవేశపెడుతున్నాయి. ఎక్కువ రేంజ్, బ్యాటరీ కెపాసిటీ, టాప్ స్పీడ్ అందించే స్కూటర్లు అందుబాటులో ఉన్నాయి. ఎలక్ట్రిక్ స్కూటర్లపై డిస్కౌంట్ కూడా లభిస్తోంది. దీంతో వీటిని కొనేందుకు జనాలు ఆసక్తి కనబరుస్తున్నారు. ప్రస్తుతం భారతదేశంలో అమ్ముడవుతున్న టాప్ 5 ఎలక్ట్రిక్ స్కూటర్ల జాబితా మీ కోసం..
ఏథర్ రిజ్టా: ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్ మూడు వేరియంట్లలో లభిస్తుంది. ఇది బెస్ట్ ఆల్ రౌండర్ స్కూటర్‌గా చెప్పవచ్చు. ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్ ధర రూ .1.10 లక్షలు (ఎక్స్-షోరూమ్) నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ మోడల్ 2.9 మరియు 3.7 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్ ఆప్షన్‌తో లభిస్తుంది. టాప్-స్పెక్ వేరియంట్ 160 కిలోమీటర్ల సర్టిఫైడ్ పరిధిని కలిగి ఉంది.

ఓలా ఎస్1 ప్రో జెన్ 2: ఓలా ఎస్ 1 ప్రో అత్యతం ప్రాచుర్యం పొందిన ఎలక్ట్రిక్ స్కూటర్. ఇది పూర్తి స్మార్ట్ టెక్నాలజీతో లోడ్ చేయబడి ఉంది. ఓలా ఎస్ 1 ప్రో ఎలక్ట్రిక్ స్కూటర్ 4 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్‌తో వస్తుంది. ఫుల్ ఛార్జ్‌పై ఈ స్కూటర్ 195 కిలోమీటర్ల రేంజ్‌ని అందిస్తుంది. ఈ స్కూటర్ ధర రూ. 1,29,999 గా ఉంది.
ఏథర్ 450X: ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ మంటి డిజైన్, ఫర్ఫామెన్స్‌ని అందిస్తుంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ 2.9 మరియు 3.7 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్‌తో వస్తుంది. 3.7 బ్యాటరీ ప్యాక్ 150 కి.మీ, 2.9 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్ 111 కి.మీ రేంజ్‌ని అందిస్తాయి. ఈ స్కూటర్ ఎక్స్-షోరూమ్ ధరలు 1.46 నుంచి 1.82 లక్షలుగా ఉన్నాయి.

టీవీఎస్ ఐక్యూబ్ ST: టీవీఎస్ ఐక్యూబ్‌లో ఇంది టాప్-స్పెక్ వేరియంట్‌గా ఉంది. తాజాగా విడుదలైన ఈ స్కూటర్ డెలివరీలు ప్రారంభమయ్యాయి. ఈ మోడల్ 5.1 కిలోవాట్ల వద్ద అతిపెద్ద బ్యాటరీ ప్యాక్‌తో వస్తుంది. దేశంలోని ఇది అతిపెద్ద బ్యాటరీ ప్యాక్ కలిగిన స్కూటర్‌గా ఉంది. ఫుల్ ఛార్జ్‌పై ఈ స్కూటర్ 145 కిలోమీటర్ల పరిధితో వస్తుంది. టీవీఎస్ ఐక్యూబ్ ST ధర రూ .1.84 లక్షలుగా ఉంది.
సింపుల్ వన్: ఈ స్కూటర్ 211 కిలోమీటర్ల రేంజ్ అందించనుంది. దేశంలోనే ఎక్కువ రేంజ్ అందించే స్కూటర్ ఇదే. సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ ధర రూ .1.66 లక్షలు (ఎక్స్-షోరూమ్) నుంచి ప్రారంభమవుతుంది. యువకులను ఆకర్శించే విధంగా దీనిని స్పోర్టీ డిజైన్‌లో ఈ స్కూటర్‌ని సంస్థ తీసుకువచ్చింది. ప్రస్తుతం ఈ స్కూటర్ సేల్స్‌లో దూసుకువెళ్తుంది.

డ్రైవ్స్‌పార్క్ వ్యాఖ్య: పైన పేర్కొన్న ఎలక్ట్రిక్ స్కూటర్లు ఎలక్ట్రిక్ స్కూటర్లు అందించే ఉత్తమమైనవిగా ఉన్నాయి. అధిక రేంజ్, ఎక్కువ బూట్ స్పేస్ బ్యాటరీ ప్యాక్ ఆప్షన్‌తో అందుబాటులో ఉన్నాయి. మరింత సమచారం కోసం దగ్గర్లోని షోరూమ్‌ని సంప్రదించి వాటికి సంబంధించిన స్పెసిఫికేషన్స్‌తో పాటు సబ్సిడీపై వివరాలను అడిగి తెలుసుకోవచ్చు.
డ్రైవ్స్‌పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








