సింగిల్ ఛార్జ్ 100 కిమీ కంటే ఎక్కువ రేంజ్ - ఇదిగో టాప్ 5 ఎలక్ట్రిక్ స్కూటర్స్
దేశంలో ఎన్నెన్ని కొత్త వాహనాలు వచ్చినా.. చాలామంది ఎక్కువ మైలేజ్ లేదా రేంజ్ ఇచ్చే వాహనాలను కొనుగోలు చేయడానికే ఆసక్తి చూపుతారు. ఈ కారణంగానే ఇతర వాహనాలతో పోల్చితే.. ఎక్కువ రేంజ్ ఇచ్చే వాహనాలకే డిమాండ్ ఎక్కువ అని తెలుస్తోంది. దీనిని దృష్టిలో ఉంచుకుని ప్రముఖ దిగ్గజ కంపెనీలు కూడా ఎక్కువ రేంజ్ ఇచ్చే వాహనాలను లాంచ్ చేస్తున్నాయి. ఈ కథనంలో ఒక సింగిల్ ఛార్జ్‌తో 100 కిమీ కంటే ఎక్కువ రేంజ్ అందించే ఎలక్ట్రిక్ స్కూటర్లు ఏవి? వాటి ధర ఎంత అనే మరిన్ని వివరాలు వివరంగా తెలుసుకుందాం..
ఓలా ఎస్1 ఎక్స్
ప్రారంభం నుంచి భారతీయ మార్కెట్లో అధిక అమ్మకాలు పొందుతున్న ఓలా ఎలక్ట్రిక్ ఇప్పటికే వివిధ ధరల్లో ఎలక్ట్రిక్ స్కూటర్లను లాంచ్ చేసింది. ఇందులో ఒకటి ఓలా ఎస్1 ఎక్స్. దీని ధర రూ. 99999 (ఎక్స్ షోరూమ్). ఇది 4 కిలోవాట్ బ్యాటరీ కలిగి హబ్ మౌంటెడ్ ఎలక్ట్రిక్ మోటారును కలిగి ఉంటుంది. ఇది ఒక సింగిల్ చార్జితో ఏకంగా 190 కిమీ రేంజ్ అందిస్తుందని ARAI ధ్రువీకరించింది.

ఎక్కువ మంది ఇష్టపడి మరీ కొనుగోలు చేసిన ఈ స్కూటర్ సింపుల్ డిజైన్ కలిగి ఉన్నప్పటికీ.. ఆధునిక కాలంలో ఉపయోగించడానికి కావలసిన లేటెస్ట్ ఫీచర్స్ అన్ని పొంది ఉంటుంది. ఇది కేవలం 5.5 సెకన్లలో గంటకు 0 నుంచి 60 కిమీ / గం వరకు వేగవంతం అవుతుంది. దీని టాప్ సుపీడ 90 కిమీ / గం. ఇది రైడర్లకు మంచి రైడింగ్ అనుభూతిని అందిస్తుంది.
ఆంపియర్ నెక్సస్
దేశీయ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన మరియు ఎక్కువ రేంజ్ అందించే ఎలక్ట్రిక్ స్కూటర్లలో ఒకటి ఆంపియర్ నెక్సస్. 3 కిలోవాట్ బ్యాటరీ కలిగిన ఈ స్కూటర్.. ఒక సింగిల్ చార్జితో 136 కిమీ కంటే ఎక్కువ రేంజ్ అందిస్తుందని ధృవీకరించబడింది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ధర రూ. 119900 (ఎక్స్ షోరూమ్). ఇది ఫుల్ ఛార్జ్ కావడానికి పట్టే సమయం కేవలం 3 గంటలు మాత్రమే.

బజాజ్ చేతక్
ఇండియన్ మార్కెట్లో అత్యధిక ప్రజాదరణ పొందిన ఎలక్ట్రిక్ స్కూటర్లలో ఒకటైన బజాజ్ కంపెనీ యొక్క చేతక్ 2901 కూడా ఎక్కువ రేంజ్ అందించే ఎలక్ట్రిక్ స్కూటర్ల జాబితాలో ఒకటి. సింగిల్ చార్జితో 123 కిమీ రేంజ్ అందించే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ధర రూ. 95998 (ఎక్స్ షోరూమ్, బెంగళూరు). ఇది డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్, బ్లూటూత్ కనెక్టివిటీ మరియు జియో ఫెన్సింగ్ వంటి అనేక ఫీచర్స్ పొందుతుంది.
ఏథర్ రిజ్టా ఎస్
ఏథర్ ఎనర్జీ ఇటీవల లాంచ్ చేసిన కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ 'రిజ్టా ఎస్' కూడా ఎక్కువ రేంజ్ అందించే ఎలక్ట్రిక్ స్కూటర్ల జాబితాలో ఒకటి. ఇది 2.4-కిలోవాట్ బ్యాటరీ కలిగి హబ్ మౌంటెడ్ బీఎల్డీసీ మోటారును పొందుతుంది. ఇది ఒక సింగిల్ చార్జితో 123కిమీ రేంజ్ అందిస్తుంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ టాప్ స్పీడ్ గంటకు 72 కిమీ కావడం గమనార్హం. ఇది మంచి డిజైన్ మరియు ఫీచర్స్ పొందుతుంది.

టీవీఎస్ ఐక్యూబ్
మార్కెట్లో ఎక్కువ అమ్మకాలు పొందుతున్న ఎలక్ట్రిక్ స్కూటర్లలో ఒకటి టీవీఎస్ కంపెనీకి చెందిన ఐక్యూబ్. ఇది అద్భుతమైన డిజైన్ కలిగి.. అధునాతన ఫీచర్స్ పొందుతుంది. 3.4 కిలోవాట్ బ్యాటరీ ఆప్షన్ కలిగిన ఐక్యూబ్ ఒక సింగిల్ చార్జితో 100 కిమీ కంటే ఎక్కువ రేంజ్ అందిస్తుందని తెలుస్తోంది. దీని ప్రారంభ ధర రూ. 1.37 లక్షలు (ఎక్స్ షోరూమ్, బెంగళూరు).
ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథనాలు తెలుసుకోవడంతో పాటు, దేశీయ మార్కెట్లో లాంచ్ అయ్యే కొత్త కార్లు మరియు బైకుల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి 'తెలుగు డ్రైవ్‌స్పార్క్' చూస్తూ ఉండండి. ఈ కథనంపై మీ అభిప్రాయాలను మరియు సందేహాలను తప్పకుండా మాతో పంచుకోండి. లేటెస్ట్ ఆటోమొబైల్ వార్తలు కోసం ఫేస్‌బుక్ (Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) మరియు యూట్యూబ్ (YouTube) ఛానల్స్ ఫాలో అవ్వండి.


Click it and Unblock the Notifications








