ఎంచుకో ఓ మంచి బైక్ - ధర రూ.3 లక్షల కన్నా తక్కువే..
బైకులకు మార్కెట్లో డిమాండ్ పెరుగుతున్న తరుణంలో కొత్త మోడల్స్ లాంచ్ అవుతూనే ఉన్నాయి. ఈ కథనంలో రూ.3 లక్షల కంటే తక్కువ ధర వద్ద లభించే ఐదు అద్భుతమైన బైకుల గురించి, వాటికి సంబంధించిన ఇతర వివరాలను గురించి వివరంగా తెలుసుకుందాం.
హోండా సీబీ300ఆర్ (Honda CB300R)
దేశీయ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన మరియు రైడర్లకు ఇష్టమైన బైకులలో ఒకటి హోండా కంపెనీకి చెందిన 'సీబీ300ఆర్'. ఈ బైక్ ధర రూ. 2.40 లక్షలు (ఎక్స్ షోరూమ్, ఢిల్లీ). మంచి డిజైన్, ఫీచర్స్ కలిగిన ఈ బైక్ 286సీసీ సింగిల్ సిలిండర్ లిక్విడ్-కూల్డ్ ఇంజిన్ పొందుతుంది. ఇంజిన్ 9000 rpm వద్ద 31 హార్స్ పవర్, 7500 rpm వద్ద 27.5 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.

టీవీఎస్ అపాచీ ఆర్‌టిఆర్ 310 (TVS Apache RTR 310)
రూ. 3 లక్షల కంటే తక్కువ ధర వద్ద లభించే బెస్ట్ బైకులలో ఒకటి టీవీఎస్ కంపెనీకి చెందిన 'అపాచీ ఆర్‌టిఆర్ 310'. ఈ బైక్ ధర రూ. 2.43 లక్షలు (ఎక్స్ షోరూమ్, ఢిల్లీ). అద్భుతమైన డిజైన్ కలిగిన బైక్ 312.12సీసీ సింగిల్ సిలిండర్ లిక్విడ్-కూల్డ్ ఇంజిన్ కలిగి 9700 rpm వద్ద 35.6 హార్స్ పవర్ మరియు 6650 rpm వద్ద 28.7 ఎన్ఎమ్ 2టార్క్ అందిస్తుంది.
ట్రయంఫ్ స్క్రాంబ్లర్ 400 ఎక్స్ (Triumph Scrambler 400 X)
రూ. 2.63 లక్షల (ఎక్స్ షోరూమ్, ఢిల్లీ) ధర వద్ద లభించే మరో ఉత్తమైన బైక్ ట్రయంఫ్ కంపెనీ యొక్క 'స్క్రాంబ్లర్ 400 ఎక్స్'. బజాజ్ మరియు ట్రయంఫ్ భాగస్వామ్యంతో దేశీయ మార్కెట్లో అడుగుపెట్టిన ఈ బైక్ దానిట్రయంఫ్ స్పీడ్ 400 కంటే రూ. 30000 ఎక్కువ. అయినప్పటికీ పనితీరు పరంగా దాని ప్రత్యర్థుల కంటే ఉన్నతంగా ఉంటుంది, కాబట్టి రైడర్ మంచి రైడింగ్ అనుభూతిని పొందవచ్చు.

కెటిఎమ్ 390 అడ్వెంచర్ ఎక్స్ (KTM 390 Adventure X)
నిజానికి భారతీయ మార్కెట్లో కెటిఎమ్ బైకులపై యువతకు విపరీతమైన క్రేజ్ ఉంది. ఈ కారణంగానే చాలా మంది యువ రైడర్స్ కెటిఎమ్ కొనుగోలు చేయడానికే ఆసక్తి చూపుతారు. రూ. 3 లక్షల కంటే తక్కువ ధర వద్ద లభించే ఉత్తమ బైకులలో ఒకటి కెటిఎమ్ యొక్క 390 అడ్వెంచర్. దీని ధర రూ. 2.80 లక్షలు (ఎక్స్ షోరూమ్, ఢిల్లీ).
కెటిఎమ్ 390 అడ్వెంచర్ ఎక్స్ బైక్ చూడగానే ఆకర్శించే డిజైన్ కలిగి, ఉత్తమ ఫీచర్స్ పొందుతుంది. ఇందులోని 373 సీసీ ఇంజిన్ 9000 rpm వద్ద 43.5 హార్స్ పవర్ మరియు 7000 rpm వద్ద 37 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. రూ. 3 లక్షల కంటే తక్కువ ధర వద్ద కెటిఎమ్ బైక్ కావాలనుకునే యువ రైడర్లకు '390 అడ్వెంచర్ ఎక్స్' ఓ ఉత్తమమైన ఎంపిక.

హస్క్‌వర్నా స్వర్ట్‌పిలెన్ 401 (Husqvarna Svartpilen 401)
హస్క్‌వర్నా కంపెనీకి చెందిన బైకులకు భారతదేశంలో పెద్దగా డిమాండ్ లేనప్పటికీ.. మన జాబితాలో రూ. 3 లక్షల కంటే తక్కువ ధర వద్ద లభించే బైకులలో చెప్పుకోదగ్గ బైక్ 'స్వర్ట్‌పిలెన్ 401'. దీని ధర రూ. 2.92 లక్షలు (ఎక్స్ షోరూమ్, ఢిల్లీ). 399 సీసీ ఇంజిన్ కలిగిన ఈ బైక్ పనితీరు పరంగా చాలా ఉత్తమంగా ఉంటుంది. కావున రైడర్ మంచి రైడింగ్ అనుభూతిని పొందవచ్చు.


Click it and Unblock the Notifications








