భారతీయుల మనసు దోచే బెస్ట్ బైకులు ఇవే!.. ధరలు కూడా చాలా తక్కువే..

భారతీయ మార్కెట్లో ఎన్ని కొత్త బైక్ మోడల్స్ లాంచ్ అయినప్పటికీ.. ఎక్కువ మంది సరసమైన ధర వద్ద లభించే ఉత్తమ బైకులు కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతారు. ఈ కథనంలో తక్కువ ధరకే లభించే ఐదు బెస్ట్ బైక్స్ గురించి తెలుసుకుందాం.

5. బజాజ్ ప్లాటినా 100 (Bajaj Platina 100)

దేశీయ విఫణిలో అత్యంత ప్రజాదరణ పొందిన బజాజ్ కంపెనీకి చెందిన బజాజ్ ఆటో ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్న ఉత్తమ మరియు సరసమైన బైక్. దీని ధర రూ. 67808 (ఎక్స్ షోరూమ్). మంచి డిజైన్ కలిగిన ఈ బైక్ బెస్ట్ ఫీచర్స్ పొందుతుంది. ఇందులోని 102 సీసీ ఇంజిన్ 7500 rpm వద్ద 7.9 పీఎస్ పవర్ మరియు 5500 rpm వద్ద 8.3 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది.

Honda Shine 100

4. హోండా షైన్ 100 (Honda Shine 100)

మన జాబితాలో మరో సరసమైన బైక్ హోండా మోటార్‌సైకిల్ కంపెనీకి చెందిన షైన్ 100. ఎక్కువగా రోజు వారీ వినియోగానికి ఈ బైకును కొనుగోలు చేస్తూ ఉంటారు. దీని ధర రూ. 64900 (ఎక్స్ షోరూమ్). ఈ బైకులో 99.7 సీసీ ఇంజిన్ ఉంటుంది. ఇది 7.61 హార్స్ పవర్ మరియు 8.05 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.

3. టీవీఎస్ స్పోర్ట్ (TVS Sport)

టీవీఎస్ కంపెనీకి చెందిన ఫేమస్ బైక్ ఈ స్పోర్ట్. ప్రస్తుతం ఇండియన్ మార్కెట్లో సరసమైన ధర వద్ద లభిస్తున్న ఈ బైక్ ధర రూ. 61500 నుంచి రూ. 69873 (ఎక్స్ షోరూమ్) మధ్యలో ఉంది. మంచి డిజైన్ మరియు ఫీచర్స్ కలిగిన ఈ బైక్ 109.7 సీసీ ఇంజిన్ కలిగి ఉంటుంది. ఇది 8.3 హార్స్ పవర్ మరియు 8.7 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.

Hero HF Deluxe

2. హీరో హెచ్ఎఫ్ డీలక్స్ (Hero HF Deluxe)

రూ. 59998 నుంచి రూ. 68768 (ఎక్స్ షోరూమ్) మధ్య లభించే ఈ హెచ్ఎఫ్ డీలక్స్ హీరో మోటోకార్ప్ కంపెనీకి చెందిన అత్యంత పాపులర్ బైక్. ఇందులో 97 సీసీ ఇంజిన్ ఉంటుంది. డిజైన్ మరియు ఫీచర్స్ పరంగా అద్భుతంగా ఉండే ఈ బైక్ పనితీరు పరంగా కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. ఈ కారణంగానే ఈ బైకును ఎక్కువమంది కొనుగోలు చేస్తుంటారు.

1. హీరో హెచ్ఎఫ్ 100 (Hero HF 100)

మన జాబితాలో సరసమైన మరియు చెప్పుకోదగ్గ బైక్ హీరో మోటోకార్ప్ యొక్క హెచ్ఎఫ్ 100. దీని ధర రూ. 59068 (ఎక్స్ షోరూమ్). ఈ బైక్ 97 సీసీ ఇంజిన్ కలిగి 8 హార్స్ పవర్ మరియు 8.05 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. డిజైన్ మరియు ఫీచర్స్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు.

Hero HF 100

ఇక ఈ జాబితాలో దేశంలో ఎక్కువమందికి ఇష్టమైన హీరో స్ప్లెండర్ మిస్ అయిపోయిందే అనుకోవచ్చు. కానీ ప్రస్తుతం దీని ధర రూ. 75141 నుంచి రూ. 79991 మధ్య ఉన్నాయి. దీన్ని బట్టి చూస్తే ఇది 100 సీసీ విభాగంలో లభించే ఖరీదైన బైక్ అని తెలుస్తోంది. ఇక పైన వెల్లడించిన ధరలు కూడా కేవలం ఎక్స్-షోరూమ్ ధరలే. ఆఫ్-రోడ్ ధరలు నగరాన్ని బట్టి మారుతూ ఉంటాయి.

ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథనాలు తెలుసుకోవడంతో పాటు, దేశీయ మార్కెట్లో లాంచ్ అయ్యే కొత్త కార్లు మరియు బైకుల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి 'తెలుగు డ్రైవ్‌స్పార్క్' చూస్తూ ఉండండి. ఈ కథనంపై మీ అభిప్రాయాలను మరియు సందేహాలను తప్పకుండా మాతో పంచుకోండి. లేటెస్ట్ ఆటోమొబైల్ వార్తలు కోసం ఫేస్‌బుక్ (Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) మరియు యూట్యూబ్ (YouTube) ఛానల్స్ ఫాలో అవ్వండి.

More from DriveSpark

Article Published On: Friday, February 23, 2024, 10:22 [IST]
English summary
Top five most affordable best bikes in india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+