కొత్త బైక్ కొంటున్నారా??.. రూ. లక్ష లోపు ధరలో అధిక మైలేజ్‌ ఇచ్చే ఈ బైక్‌లపై ఓ లుక్కేయండి.!!

భారత మార్కెట్లో చాలా రకాల బైక్‌లు అందుబాటులో ఉన్నాయి. సాధారణ బైక్‌ల నుంచి స్పోర్ట్స్‌ బైక్‌ల వరకూ లెక్కలేనన్ని టూ వీలర్లు.. రైడర్ల మనసును దోచుకుంటున్నాయి. అయితే వాటిలో దేన్ని సెలెక్ట్‌ చేసుకోవాలనే దానిపై చాలా మందికి కన్ఫ్యూజన్‌ ఉంటుంది. ఒకవేళ మీరు 125సీసీ కేటగిరీలో మంచి బైక్‌ కొనాలనుకుంటే ఐదు ది బెస్ట్‌ బైక్‌ల వివరాలు ఇక్కడ అందిస్తున్నాం..

బజాజ్‌ CT125X: భారత మార్కెట్లో అత్యంత సరసమైన ధరలో అందుబాటులో ఉన్న బైక్‌ Bajaj CT125X. ఈ బైక్‌ డ్రమ్‌ బ్రేక్‌ మరియు డిస్క్ బ్రేక్‌ రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంది. ధరలు వరుసగా.. రూ. 74,016, రూ. 77,216 (ఎక్స్-షోరూమ్).

Bajaj-CT-125X

సింపుల్‌ డిజైన్‌తో తక్కువ ధరలో ఉన్న ఈ బైక్‌.. ఇండికేటర్లు, LED DRLతో రౌండ్ బల్బ్ హెడ్‌లైట్‌ను కలిగి ఉంటాయి. ఇక ఇంజిన్‌ విషయానికొస్తే.. ఇది 124.4cc సింగిల్-సిలిండర్ ఎయిర్-కూల్డ్ మోటార్‌తో పనిచేస్తుంది. 10.7 bhp మరియు 11 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

హోండా షైన్ 125సీసీ: కమ్యూటర్ బైక్ మార్కెట్‌లో ప్రసిద్ధి చెందిన మరో బైక్‌ Honda Shine 125CC. షైన్‌ కూడా డ్రమ్‌ మరియు డిస్క్‌ బ్రేక్‌ వేరియంట్లలో లభ్యమవుతోంది. డ్రమ్‌ వేరియంట్‌ ధర రూ. 79,800 కాగా.. డిస్క్‌ బ్రేక్‌ వేరియంట్‌ ధర రూ. 83,800. ఇవన్నీ ఎక్స్-షోరూమ్ ధరలు.

Honda-Shine-125

ఐదు ఆకర్షణీయమైన కలర్స్‌.. బ్లాక్, రెబెల్ రెడ్ మెటాలిక్, మ్యాట్ యాక్సిస్ గ్రే, జెన్నీ గ్రే మెటాలిక్ మరియు డీసెంట్ బ్లూ మెటాలిక్‌లలో అందుబాటులో ఉంది. హోండా షైన్ సింగిల్-సిలిండర్ 123.94cc ఇంజన్‌తో పనిచేస్తుంది. 10.59 bhp మరియు 11 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 5-స్పీడ్ గేర్‌బాక్స్‌తో అనుసంధానించబడి ఉంటుంది.

హీరో సూపర్‌ స్ప్లెండర్‌: మార్కెట్లో 125 సీసీ కేటగిరీలో అత్యంత ఎక్కువగా అమ్ముడవుతున్న బైక్‌లలో టాప్‌లో ఉన్న మోడల్‌ Hero Super Splendor Xtec. ఈ మోడల్‌ డ్రమ్ వేరియంట్ ధర రూ. 80,848 కాగా డిస్క్ బ్రేక్ మోడల్ ధర రూ. 84,748 (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ).

Hero-Super-Splendor-Xtec

హీరో సూపర్‌ స్ప్లెండర్‌ 124.7cc ఎయిర్-కూల్డ్ సింగిల్-సిలిండర్ ఇంజన్‌ను కలిగి ఉంటుంది. 10.72 bhp మరియు 10.6 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 5-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జత చేయబడి ఉంటుంది. టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్స్ మరియు డ్యూయల్ రియర్ షాక్‌లతో కూడిన డైమండ్ ఛాసిస్‌తో వస్తుంది. మంచి మైలేజ్‌తో మన్నికైన మోటార్‌సైకిల్‌ను కొనాలనుకునేవారికి ఈ బైక్‌ మంచి ఆప్షన్‌.

హోండా SP 125: హోండా నుంచి కస్టమర్ల ఫేవరెట్‌గా ఉన్న మరో బైక్‌ Honda SP 125. హోండా SP 125 డ్రమ్, డిస్క్ మరియు స్పోర్ట్స్ ఎడిషన్ అనే మూడు వేరియంట్‌లలో అందుబాటులో ఉంది. బేస్ మోడల్ ధర రూ. 86,017 కాగా.. డిస్క్ మరియు స్పోర్ట్స్ వేరియంట్ల ధర రూ. 90,017, రూ. 90,567 (ఎక్స్-షోరూమ్)గా ఉంది.

Honda-SP-125

హోండా SP 125 124cc మోటార్‌తో పనిచేస్తుంది. 10.72 bhp మరియు 10.9 Nm గరిష్ఠ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 5-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది. బ్లాక్, మ్యాట్ మార్వెల్ బ్లూ మెటాలిక్, డీసెంట్ బ్లూ మెటాలిక్, హెవీ గ్రే మెటాలిక్, ఇంపీరియల్ రెడ్ మెటాలిక్, మ్యాట్ యాక్సిస్ గ్రే మెటాలిక్, పర్ల్ సైరన్ బ్లూ వంటి ఆకర్షణీయమైన కలర్స్‌లో అందుబాటులో ఉంది.

బజాజ్ పల్సర్ 125: 125 సీసీ కమ్యూటర్‌ విభాగంలో సరసమైన ధరలో అందుబాటులో ఉన్న మరో బైక్ Bajaj Pulsar 125. ఈ బైక్‌ బేస్‌ మోడల్‌ రూ. 80,416 గా ఉంది. సింగిల్-పీస్ సీట్ కార్బన్-ఫైబర్ వేరియంట్ ధర రూ. 89,984 కాగా.. స్ప్లిట్ సీట్ మోడల్ ధర రూ. 94,138 గా ఉంది. ఇవన్నీ ఎక్స్‌-షోరూమ్‌ ధరలు.

గత కొన్నేళ్లుగా టైర్‌ 2, టైర్‌ 3 మరియు గ్రామీణ ప్రాంతాల్లో ఈ బైక్‌ కస్టమర్ల ఆదరణ పొందుతోంది. మెరుగైన పనితీరుతో పాటు అధిక మైలేజ్‌ను అందిస్తుంది. బజాజ్‌ పల్సర్‌ 125.. 125cc సింగిల్-సిలిండర్ మోటార్‌తో పనిచేస్తుంది. 11.64 bhp మరియు 10.8 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 5-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది.

More from DriveSpark

Article Published On: Saturday, February 24, 2024, 12:24 [IST]
English summary
Top five most affordable bikes in 125cc segment from bajaj honda hero models
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+