చేతిలో రూ.10 లక్షలుంటే చాలు.. ఇలాంటి బైక్స్ కొనేయొచ్చు
దేశీయ మార్కెట్లో రూ. లక్ష కంటే తక్కువ ధర వద్ద లభించే టూ వీలర్లను కొనుగోలు చేసే వారి సంఖ్య, వినియోగించే వారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది. అయితే కొంత మంది రూ. 10 లక్షలు అంతకంటే ఎక్కువ ధర వద్ద లభించే బైకులను కొనుగోలు చేయడానికి వెనుకాడరు. ఖరీదైన బైకులు కొనేవారి సంఖ్య తక్కువగానే ఉంటుంది. ఈ కథనంలో రూ. 10 లక్షలలోపు అందుబాటులో ఉన్న అత్యంత శక్తివంతమైన టాప్ 5 బైకులు ఏవి? వాటి వివరాలు ఏంటి అనే సమాచారం వివరంగా తెలుసుకుందాం.
ట్రయంఫ్ స్పీడ్ ట్విన్ 900
భారతీయ విఫణిలో అత్యంత ప్రజాదరణ పొందిన బైకులలో 'ట్రయంఫ్ స్పీడ్ ట్విన్ 900' బైక్ ఒకటి. దీని ప్రారంభ ధర రూ.8.49 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఒక రిలాక్స్డ్ నియో రెట్రో రోడ్‌స్టర్ మాదిరిగా అనిపించే ఈ బైక్.. 64.1 Bhp పవర్ మరియు 80 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. డిజైన్ మరియు ఫీచర్స్ పరంగా ఇది చాలా ఉత్తమంగా ఉంటుంది. పనితీరు గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు.

కవాసకి జెడ్650
కవాసకి కంపెనీకి చెందిన జెడ్650 మన జాబితాలో చెప్పుకోదగ్గ మరియు రూ. 10 లక్షల కంటే తక్కువ ధర వద్ద లభించే మరో ఉత్తమమైన మోడల్. 191 కేజీల బరువున్న ఈ బైక్ లిక్విడ్ కోల్డ్ 649 సీసీ ప్యారలల్ ట్విన్ ఇంజిన్ పొందుతుంది. ఇంజిన్ 67.7 Bhp పవర్ మరియు 64 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. అద్భుతమైన డిజైన్ కలిగిన ఈ బైక్.. అత్యుత్తమ ఫీచర్స్ పొందుతుంది.
కవాసకి జెడ్ఎక్స్-4ఆర్
కవాసకి కంపెనీకి చెందిన మరో బైక్ జెడ్ఎక్స్-4ఆర్. దీని ధర రూ. 8.49 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఇది దాని జెడ్ఎక్స్-4ఆర్ఆర్ బైక్ కంటే రూ. 61000 ఎక్కువ ధర వద్ద లభిస్తుంది. కవాసకి జెడ్ఎక్స్-4ఆర్ యొక్క ఇన్‌లైన్ ఫోర్ సిలిండర్ ఇంజిన్ 76 Bhp పవర్ ప్రొడ్యూస్ చేస్తుంది. మంచి డిజైన్ మరియు ఫీచర్స్ కలిగిన ఈ బైక్ రైడర్లకు ఉత్తమ రైడింగ్ అనుభూతిని అందిస్తుంది.

ట్రయంఫ్ ట్రైడెంట్ 660
ట్రయంఫ్ కంపెనీకి చెందిన ట్రైడెంట్ 660 కూడా మన జాబితాలో చెప్పుకోదగ్గ బైక్. ఈ బైక్ ధర రూ. 8.12 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఈ బైక్ 660 సీసీ ఇంజిన్ పొందుతుంది. తద్వారా ఉత్తమ పనితీరును అందిస్తుంది. కవాసకి ట్రైడెంట్ 660 బైక్ కేవలం 4.11 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతం అవుతుంది. డిజైన్ మరియు ఫీచర్స్ పరంగా ఉత్తమంగా ఉంటుంది.
కవాసకి జెడ్900
రూ. 9.29 లక్షల ధర వద్ద లభించే ఈ కవాసకి జెడ్900 మన జాబితాలో ఖరీదైన బైక్. ఇది అత్యంత వేగవంతమైన బైకులలో కూడా ఒకటిగా ఉంది. ఇందులో 948 సీసీ ఇంజిన్ 123 Bhp పవర్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇందులో పవర్ మోడ్‌లు, మల్టిపుల్ రైడింగ్ మోడ్‌లు మరియు ట్రాక్షన్ కంట్రోల్ వంటి అధునాతన ఫీచర్స్ ఉన్నాయి. ఇవన్నీ బైక్ రైడర్లకు ఉత్తమ రైడింగ్ అనుభూతిని అందిస్తాయి.

మార్కెట్లో రూ. 10 లక్షల ధర వద్ద లభించే బైకులు మాత్రమే కాకుండా అంతకంటే ఎక్కువ ధర వద్ద లభించే బైకులు అందుబాటులో ఉన్నాయి. అయితే ఇలాంటి బైకులను సాధారణ ప్రజలు కొనుగోలు చేయడానికి ఇష్టపడరు. దీనికి కారణం ధర మరియు మెయింటెనెన్స్. అయితే ఇలాంటి బైకులను సినీ ప్రముఖులు లేదా ఇతర సెలబ్రిటీలు ఎక్కువగా కొనుగోలు చేసి అరుదుగా ఉపయోగిస్తుంటారు.
ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథనాలు తెలుసుకోవడంతో పాటు, దేశీయ మార్కెట్లో లాంచ్ అయ్యే కొత్త కార్లు మరియు బైకుల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి 'తెలుగు డ్రైవ్‌స్పార్క్' చూస్తూ ఉండండి. ఈ కథనంపై మీ అభిప్రాయాలను మరియు సందేహాలను తప్పకుండా మాతో పంచుకోండి. లేటెస్ట్ ఆటోమొబైల్ వార్తలు కోసం ఫేస్‌బుక్ (Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) మరియు యూట్యూబ్ (YouTube) ఛానల్స్ ఫాలో అవ్వండి.


Click it and Unblock the Notifications








