ఈ ఐదు విషయాలు తెలుసుకోకుండా 'Kawasaki Ninja 500' కొంటున్నారా..
ఇటీవల 'కవాసకి' (Kawasaki) కంపెనీ మార్కెట్లో తన కొత్త 'నింజా 500' (Ninja 500) బైక్ లాంచ్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ బైక్ కొనాలనుకునే వారు తప్పకుండా ఇందులో తెలుసుకోవాల్సిన ఐదు విషయాలను ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.
ధర మరియు వేరియంట్స్
కవాసకి లాంచ్ చేసిన నింజా 500 బైక్ ధర రూ. 5.24 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఇది చూడతనికి నింజా 400 బైక్ మాదిరిగా ఉంటుంది. కానీ కొన్ని సూక్షమైన అప్డేట్స్ గమనించవచ్చు. ఈ బైక్ కేవలం ఒకే వేరియంట్‌లో అందుబాటులో ఉంటుంది. అంతే కాకుండా. ఇది మెటాలిక్ స్పార్క్ బ్లాక్ అనే సింగిల్ కలర్ ఆప్షన్ మాత్రమే పొందుతుంది.

డిజైన్
పైన చెప్పుకున్నటుగా కొత్త కవాసకి నింజా 500 బైక్ చూడటానికి నింజా 400 మాదిరిగా కనిపించినప్పటికీ.. ఇందులో కట్స్ మరియు క్రీజులు, వెంట్స్ వంటి వాటిని గమనించవచ్చు. సీటు కూడా చాలా అనుకూలంగా ఉంది. ఫ్యూయెల్ ట్యాంక్ మీద కవాసకి, దానికి కింద నింజా 500 అని ఉండటం గమనించవచ్చు. ఇవన్నీ కూడా ఈ బైకుని మరింత ఆకర్షణీయంగా కనిపించేలా చేస్తాయి.
ఫీచర్స్
కొత్త నింజా 500 బైకులో కవాసకి TFT డిస్‌ప్లేకి బదులుగా LCD ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ అందించింది. అయితే ఇందులో బ్లూటూత్ కనెక్టివిటీ అనేది ప్రామాణికంగా లభిస్తుంది. కాబట్టి స్మార్ట్ ఫోన్ కనెక్ట్ చేసుకోవచ్చు, తద్వారా కాల్స్ రిసీన్ లేదా ఎస్ఎమ్ఎస్ వంటి వాటిని స్వీకరించవచ్చు లేదా రిజెక్ట్ చేయవచ్చు. ఇవన్నీ వాహన వినియోగదారునికి చాలా అనుకూలంగా ఉండటమే కాకుండా.. రైడింగ్ సమయంలో చాలా ఉపయోగకరంగా ఉంటాయి.

ఇంజిన్
కొత్త కవాసకి నింజా 500 బైక్ 451 సీసీ ప్యారలల్ ఇంజిన్ కలిగి 9000 rpm వద్ద 45 bhp పవర్ మరియు 6000 rpm వద్ద 42.6 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది స్లిప్ అండ్ అసిస్ట్ ఫంక్షన్ కలిగి 6 స్పీడ్ గేర్‌బాక్స్‌తో జత చేయబడి ఉత్తమ పనితీరుని అందించేలా రూపొందించబడి ఉంటుంది.
బుకింగ్స్ అండ్ డైమెన్షన్స్
మార్కెట్లో అడుగుపెట్టిన కొత్త కవాసకి నింజా 500 బైక్ బుకింగ్స్ ప్రారంభమయ్యాయి, కాబట్టి డెలివరీలు మార్చిలో ప్రారంభమయ్యే అవకాశం ఉంటుంది. పరిమాణం పరంగా ఉత్తమంగా ఉండే ఈ బైక్ పొడవు 1995 మిమీ, 730 మిమీ వెడల్పు, 1120 మిమీ ఎత్తు, 1375 మిమీ వీల్‌బేస్ కలిగి 171 కేజీల బరువును కలిగి ఉంటుంది. ఇది కేటిఎమ్ RC390 కంటే 1 కేజీ తక్కువ బరువును కలిగి ఉంటుంది.

కవాసకి నింజా 500 హార్డ్‌వేర్ విషయానికి వస్తే.. ఈ బైక్ ముందు భాగంలో 41 మిమీ టెలిస్కోపిక్ సస్పెన్షన్, వెనుక వైపు మోనోశాక్ సస్పెన్షన్ పొందుతుంది. బ్రేకింగ్ విషయానికి వస్తే.. ముందు భాగంలో సెమీ ప్లోటింగ్ 310 మీమీ డిస్క్, వెనుక భాగంలో 220 మిమీ సింగిల్ డిస్క్ ఉన్నాయి. ఇవన్నీ చాలా షార్ప్ పర్ఫామెన్స్ కలిగి ఉంటాయి.
ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథనాలు తెలుసుకోవడంతో పాటు, దేశీయ మార్కెట్లో లాంచ్ అయ్యే కొత్త కార్లు మరియు బైకుల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి 'తెలుగు డ్రైవ్‌స్పార్క్' చూస్తూ ఉండండి. ఈ కథనంపై మీ అభిప్రాయాలను మరియు సందేహాలను తప్పకుండా మాతో పంచుకోండి. లేటెస్ట్ ఆటోమొబైల్ వార్తలు కోసం ఫేస్‌బుక్ (Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) మరియు యూట్యూబ్ (YouTube) ఛానల్స్ ఫాలో అవ్వండి.


Click it and Unblock the Notifications








