విదేశీ రోడ్లపై భారత్ బైక్‌లు.. ఎగుమతుల్లో టాప్ 5 ఇవే.!!
భారత్‌లో ఆటోమోటివ్ రంగం గణనీయంగా అభివృద్ధి చెందుతోంది. దేశీయంగా కాకుండానే విదేశాలకు ఎగుమతుల పరంగా కూడా సహాయసహకారాలు అందిస్తూ.. ప్రపంచవ్యాప్తంగా తన ఉనికిని చాటుకుంటోంది. ఈ క్రమంలో గత నెల ఫిబ్రవరిలో భారత్ నుంచి విదేశాలకు టూ వీలర్లు ఎక్కువగానే ఎగుమతి అయ్యాయి. ఆ వివరాలు ఈ కథనంలో..
భారతీయ ఆటోమొబైల్ రంగంలో వాహన విక్రయాల్లో ద్విచక్ర వాహన విభాగానిదే(February 2024 Two Wheelers Exports Sales) కీలక పాత్ర. వాహన తయారీదారులు ప్రతి నెలా స్థిరమైన వృద్ధిని పొందుతున్నారు. దేశీయంగానే కాకుండా విదేశాలకు ఎగుమతుల్లో కూడా కీలకపాత్ర పోషిస్తున్నాయి. భారత్ నుంచి కొన్ని బ్రాండ్‌లు విదేశాల్లో ఎక్కువగా అమ్ముడవుతున్నాయి. ఫిబ్రవరి 2024 లో విదేశాలకు ఎగుమతి అయిన టాప్ 5 టూ వీలర్ల బ్రాండ్లు ఇవే..

బజాజ్(Bajaj Motor India): ఎగుమతుల పరంగా బజాజ్ మోటార్స్ ఇండియా ఈ ఏడాది ఫిబ్రవరిలో అగ్రస్థానంలో ఉంది. విదేశాల్లో బజాజ్ మోటార్‌సైకిళ్లకు భారీ డిమాండ్ ఉంది. బజాజ్ పల్సర్ సిరీస్ బ్రాండ్లు ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలకు ఎగుమతి అవుతున్నాయి. కాగా ఫిబ్రవరి 2024లో, బజాజ్ 1,24,157 యూనిట్లను ఎగుమతి చేసింది. గతేడాది ఫిబ్రవరితో పోలిస్తే 7.9 శాతం వృద్ధిని నమోదు చేసింది.
టీవీఎస్(TVS Motors): ప్రపంచవ్యాప్తంగా టీవీఎస్ మోటార్‌సైకిళ్లు భారీ హిట్‌ను సాధించి.. గ్లోబల్ ఫేవరెట్‌గా నిలుస్తున్నాయి. ఈ సక్సెస్ దేశీయ బ్యాంకింగ్ రంగంపై కూడా సానుకూల ప్రభావాన్ని చూపుతోంది. హౌసూర్ ఆధారిత టీవీఎస్ మోటార్స్.. ఫిబ్రవరి 2024 లో 90,308 టూవీలర్లను ఎగుమతి చేయడంతో రెండో స్థానాన్ని కైవసం చేసుకుంది.

దీంతో టీవీఎస్ మోటార్స్ గతేడాది ఇదే నెలతో పోలిస్తే.. 97.90 శాతం వృద్ధిని నమోదు చేసింది. కాగా ఫిబ్రవరి 2023 లో 45,624 యూనిట్లను ఎగుమతి చేసింది. టీవీఎస్ ఎలక్ట్రిక్ సెగ్మెంట్‌లో కూడా సత్తా చాటుతోంది. TVS iQube పేరుతో ఎలక్ట్రిక్ స్కూటర్‌ను విక్రయిస్తోంది. త్వరలో టీవీఎస్ ఎక్స్‌ఎల్ 100 ను కూడా ఎలక్ట్రిక్ వెర్షన్‌లో విడుదల చేయనుంది.

హోండా(Honda Motorcycles And India): భారత మార్కెట్లో విక్రయాల పరంగా దూకుడు ప్రదర్శించడానికి హోండా కష్టపడుతుంగా.. ఎగుమతుల పరంగా మాత్రం హీరో మోటోకార్ప్‌కు గట్టిపోటీనిస్తోంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో హోండా ఏకంగా 44,744 యూనిట్లను ఎగుమతి చేసి మూడో స్థానంలో నిలిచింది. 2023 ఫిబ్రవరితో పోలిస్తే 100 శాతానికి మించి అంటే 122 శాతం వృద్ధిని నమోదు చేసింది.
హీరో(Hero Motocorp): భారత మార్కెట్లో టాప్ మోస్ట్ టూ వీలర్ సెల్లింగ్ బ్రాండ్.. హీరో మోటోకార్ప్. ఎగుమతుల పరంగా హీరో మోటోకార్ప్.. ఈ ఏడాది ఫిబ్రవరిలో నాలుగో స్థానంలో నిలిచింది. ఈ దిగ్గజ సంస్థ.. అనేక కమ్యూటర్ మోటార్ సైకిళ్లను విదేశాలకు ఎగుమతి చేసింది.

గత నెలలో 23,148 యూనిట్ల ఎగుమతితో హీరో మోటోకార్ప్ నాలుగో స్థానం దక్కించుకుంది. కాగా గతేడాది ఇదే నెలతో పోలిస్తే ఈ సారి హీరో మోటోకార్ప్ గణనీయమైన వృద్ధిని సాధించింది. ఏకంగా 90.6 శాతం వృద్ధిని నమోదు చేయడంతో.. మార్కెట్లో హీరో మోటోకార్ప్ సాధించిన అభివృద్ధి స్పష్టమవుతోంది.

యమహా(Yamaha Motors): మార్కెట్లో ప్రముఖ టూ వీలర్ బ్రాండ్ యమహా మోటార్స్‌పై యువతలో పిచ్చ క్రేజ్ ఉంటుంది. ఫిబ్రవరి 2024లో యమహా 21,873 యూనిట్లను ఎగుమతి చేయడంతో ఐదో స్థానంలో నిలిచింది. జపాన్‌కు చెందిన సంస్థ.. ఇతర దేశాల్లో తయారైన CBUలను భారత్‌లో విక్రయిస్తుండగా.. భారత్‌లో తయారైన CBUలను విదేశాలకు ఎగుమతి చేస్తోంది. గతేడాది ఫిబ్రవరితో పోలిస్తే ఈ సారి 39.3 శాతం వృద్ధిని సాధించింది.


Click it and Unblock the Notifications








