మైలేజీలో వీటిని కొట్టే బైక్స్ ఇంకా పుట్టలేదు మామ.. ఫుల్ ట్యాంక్‌పై 792 కి.మీ రైడ్ చేయవచ్చు!
దేశంలో మధ్య తరగతి ప్రజలకు టూవీలర్స్ ప్రధాన రవాణా వనరుగా ఉన్నాయి. నేడు ప్రతీ ఇంట్లో కచ్చితంగా టూవీలర్ అనేది కామన్ అయిపోయింది. చేతిలో బండి లేకపోతే బయటకు వెళ్లేందుకు కూడా జనాలు ఆలోచిస్తున్నారు. నిత్యం టీవీలర్స్‌పై వందల కిలోమీటర్లు ప్రయాణిస్తూ రోజువారి వినియోగంలో ఇవి కీలక పాత్ర పోషిస్తున్నాయి. కానీ వీటి మెయింటైనెన్స్, ఇంధన ఖర్చుల వల్ల సామాన్యూలకు ఇవి భారంగా అయిపోతున్నాయి. పెట్రోల్ ధర, నిర్వహణ వ్యయం దృష్ట్యా వినియోగదారులు ఎక్కువ మైలేజీ ఇచ్చే మోటార్ సైకిళ్లను కొనేందుకే ఆసక్తి చూపిస్తున్నారు. అలాంటి కస్టమర్ల కోసమే ప్రముఖ కంపెనీలు అత్యధిక మైలేజీ అందించే బైకులను అందిస్తున్నాయి. ప్రస్తుతం భారతదేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న, భారీ మైలేజీ ఇచ్చే రెండు మోటార్‌సైకిళ్ల వివరాలు ఈ కథనంలో..
ఎక్కువ మైలేజీ ఇచ్చే బైక్స్ సాధారణంగా తేలికైనవిగా ఉంటాయి. సన్నగా ఉండే టైర్ల కారణంగా ఇంజిన్‌పై ఒత్తిడి తగ్గి మోటార్ సైకిల్ భారీ మైలేజీ ఇవ్వడానికి సహాయపడుతుంది. ప్రస్తుతం ఇతర మోటారు సైకిళ్లతో పోలిస్తే మేము చెప్పబోయే ఈ రెండు బైక్స్ ప్రతి నెలా మీకు ఇంధన ఖర్చును భారీగా తగ్గిస్తుంది. తద్వారా వినియోగదారులకు భారం తప్పుతుంది. ఈ రెండు బైక్స్ మంచి ఫర్ఫమెన్స్‌ని కూడా అందిస్తాయి.

బజాజ్ ప్లాటినా 100: ఈ జాబితాలోని తొలి బైక్ బజాజ్ ప్లాటినా. దీని ధర రూ.68,685 (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరతో కొనుగోలుకి అందుబాటులో ఉంది. ఇది లీటర్‌కి 72 కి.మీ మైలేజీని అందిస్తుంది. ఈ బైక్ 11 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీని కలిగి ఉంది. దీని ఫుల్ ట్యాంక్‌పై 792 కిలోమీటర్ల దూరం ప్రయాణించవచ్చు. చాలామందికి ఈ బైక్ ఫేవరెట్‌గా ఉంది. ఇప్పటికీ దీనిని వేల సంఖ్యలో కొంటున్నారు.
ఇక ఈ బైక్‌లోని 102 సీసీ సింగిల్ సిలిండర్ DTS-i ఇంజిన్ 7.79 bhp పవర్, 8.34 nm టార్క్‌ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ బైక్ ముందు, వెనుక భాగంలో డ్రమ్ బ్రేక్స్‌తో వస్తుంది. అలాగే 4-స్పీడ్ గేర్ బాక్స్ తో జతచేయబడి ఉంటుంది. ఇది ఫ్లాట్ సీట్‌ని కలిగి ఉండటం వల్ల సులభంగా ఇద్దరు ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రయాణించవచ్చు.

టీవీఎస్ స్పోర్ట్: ఇది ఆ కంపెనీ లైనప్స్‌లోనే అత్యధికంగా అమ్ముడవుతున్న మోటార్ సైకిళ్లలో ఒకటిగా ఉంది. ఈ సరికొత్త టీవీఎస్ స్పోర్ట్ ఎక్స్ షోరూమ్ ప్రారంభ ధర రూ.65,625గా ఉంది. ఇది లీటర్ పెట్రోల్ లీటరుకు 70-80 కిలోమీటర్ల భారీ మైలేజీని అందిస్తుంది. ఇందులో 10 లీటర్ల సామర్థ్యం గల ఫ్యూయల్ ట్యాంక్ ఉంది. ధర తక్కువగా ఉండటం వల్ల జనాలు దీనిని ఎక్కువగా కొంటున్నారు.
ఈ బైక్ ఫ్యూయల్ ట్యాంక్‌ని ఫుల్ చేస్తే 700-750 కి.మీ దూరం వరకు ప్రయాణించవచ్చు. ఈ బైక్ 109.7 సీసీ సింగిల్ సిలిండర్, ఎయిర్-కూల్డ్ BS-6 ఇంజిన్‌తో పనిచేస్తుంది. ఇది 4-స్పీడ్ గేర్‌బాక్స్‌తో వస్తుంది. దీని ఇంజిన్ 8.07 ps శక్తిని, 8.4 nm టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ముందు, వెనుక భాగంలో డ్రమ్ బ్రేక్స్ అందించారు.

బజాజ్ ప్లాటినా, టీవీఎస్ స్పోర్ట్ ప్రస్తుతం భారతదేశంలో అత్యంత సరసమైన మోటార్ సైకిళ్లలో ఒకటిగా ఉన్నాయి. వీటితో పాటు స్ప్లెండర్ ప్లస్, బజాజ్ సీఎన్‌జీ బైక్, హోండా షైన్ 100 వంటి ఇంకా మరెన్నో బైక్స్ అందుబాటులో ఉన్నాయి. మంచి మైలేజీ కోసం ఈ బైక్స్‌ని రిఫరెన్స్‌గా తీసుకోవచ్చు. అలాగే ఇతర బైక్స్ ఇన్ఫర్మేషన్ కోసం మా డ్రైవ్స్‌పార్క్ వెబ్‌సైట్‌ని సందర్శించవచ్చు.


Click it and Unblock the Notifications








