గత నెలలో ఎక్కువమంది మనసుదోచిన బైక్ బ్రాండ్స్ ఇవే.. మీకు తెలుసా?

భారతదేశంలో టూ వీలర్స్ సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ప్రతి నెలలోనూ టూ వీలర్స్ అమ్మకాలు పరుగులు పెడుతున్నాయి. ఈ కథనంలో గత నెలలో ద్విచక్ర వాహనాల సేల్స్ ఎలా ఉన్నాయి. టాప్-6 మోటార్‌సైకిల్ బ్రాండ్స్ ఏవి అనే మరిన్ని వివరాలు తెలుసుకుందాం.

మార్చి 2024 ముగిసింది, ఏప్రిల్ నెల కూడా వచ్చేసింది. దీంతో వాహన తయారీ సంస్థలు తమ అమ్మకాల గణాంకాలను విడుదల చేస్తున్నాయి. గత నెల మార్కెట్లో టాప్ 6 మోటార్‌సైకిల్ బ్రాండ్స్ సేల్స్ 12,26,262 యూనిట్లుగా నమోదైంది. ఈ అమ్మకాలు 2023 మార్చి కంటే 15.24 శాతం లేదా 14,13,152 యూనిట్లు ఎక్కువ. ఇందులో హీరో మోటోకార్ప్ అగ్రస్థానం పొందగా.. రాయల్ ఎన్‌ఫీల్డ్ ఆరవ స్థానంలో నిలిచింది.

Hero Splendor Plus Canvas

హీరో మోటోకార్ప్ (Hero MotoCorp)

భారతీయ విఫణిలో అత్యంత ప్రజాదరణ పొందిన టూ వీలర్ కంపెనీ హీరో మోటోకార్ప్.. గత నెలలో (మార్చి 2024) ఏకంగా 4,59,257 యూనిట్ల వాహనాలను విక్రయించి టాప్ 6 జాబితాలో ప్రధమ స్థానం పొందింది. మొత్తం అమ్మకాల్లో హీరో మోటోకార్ప్ వాటా 32.50 శాతం. అయితే గత ఏడాది ఇదే నెలలో కంపెనీ సేల్స్ 502730 యూనిట్లు. అంటే మార్చి 2024 అమ్మకాలు 8.65 శాతం తక్కువని స్పష్టమవుతోంది.

హోండా మోటార్‌సైకిల్ (Honda Motorcycles)

హోండా మోటార్‌సైకిల్ కంపెనీ ఏకంగా 358151 యూనిట్ల అమ్మకాలను గత నెలలో నమోదు చేసింది. దీంతో అమ్మకాల పరంగా రెండో స్థానంలో నిలిచింది. 2023 మార్చిలో కంపెనీ 197512 యూనిట్లను మాత్రమే విక్రయించినట్లు గణాంకాలు చెబుతున్నాయి. అంటే గత ఏడాది మార్చి నెలకంటే 2024 మార్చి అమ్మకాలు 81.33 శాతం ఎక్కువ. మొత్తం అమ్మకాల్లో కంపెనీ వాటా 25.34 శాతంగా ఉంది.

Bajaj Platina 100

బజాజ్ ఆటో (Bajaj Auto)

బజాజ్ ఆటో దేశీయ మార్కెట్లో ఎప్పటికప్పుడు కొత్త బైకులు, స్కూటర్లు లాంచ్ చేస్తూ.. ఎక్కువమంది కస్టమర్లను ఆకర్శించడమే కాకుండా.. మంచి అమ్మకాలను పొందగలుగుతోంది. గత నెల కంపెనీ అమ్మకాలు మొత్తం 1,83,004 యూనిట్లు. దీంతో మొత్తం అమ్మకాల్లో కంపెనీ వాటా 12.95 శాతంగా ఉంది. ఇదే నెల గత ఏడాది కంపెనీ సేల్స్ 1,52,287 యూనిట్లు. సేల్స్ పరంగా 2023 మార్చి కంటే 2024 మార్చి నెలలో 20.17% ఎక్కువ.

Rank Brand Mar-24 Mar-23 Growth (%) YoY
1 Hero 4,59,257 5,02,730 -8.65
2 Honda 3,58,151 1,97,512 81.33
3 TVS 2,60,532 2,40,780 8.20
4 Bajaj 1,83,004 1,52,287 20.17
5 Suzuki 86,164 73,069 17.92
6 Royal Enfield 66,044 59,884 10.29

సుజుకి మోటార్‌సైకిల్ (Suzuki Motorcycle)

ఇక తరువాత జాబితాలో లేదా ఐదవ స్థానంలో ఉన్న కంపెనీ సుజుకి మోటార్‌సైకిల్. ఈ కంపెనీ గత నెలలో 89164 యూనిట్ల అమాంకాలను నమోదు చేసింది. 2023 మార్చి నెలలో కంపెనీ సేల్స్ 73069 యూనిట్లు మాత్రమే. దీన్నిబట్టి కంపెనీ అమ్మకాలు 2023 కంటే 2024 మార్చిలో 17.92 శాతం వృద్ధిని నమోదు చేసినట్లు తెలుస్తోంది. 2024 మార్చి మొత్తం అమ్మకాల్లో కంపెనీ వాటా 6.10 శాతం.

Royal Enfield Classic 350

రాయల్ ఎన్‌ఫీల్డ్ (Royal Enfield)

మన జాబితాలో చివరి కంపెనీ లేదా 6వ స్థానం పొందిన కంపెనీ రాయల్ ఎన్‌ఫీల్డ్. ఈ కంపెనీ గత నెలలో 66,044 యూనిట్ల అమ్మకాలను పొందగలిగింది. దీంతో మొత్తం అమ్మకాల్లో కంపెనీ వాటా 4.67 శాతంగా నమోదైంది. ఇదే నెల 2023 కంపెనీ అమ్మకాలు తగ్గినట్లు గణాంకాలు చెబుతున్నాయి. మొత్తం మీద రాయల్ ఎన్‌ఫీల్డ్ కూడా ఎక్కువ అమ్మకాలు పొందిన కంపెనీల జాబితాలో స్థానం పొందింది.

ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథనాలు తెలుసుకోవడంతో పాటు, దేశీయ మార్కెట్లో లాంచ్ అయ్యే కొత్త కార్లు మరియు బైకుల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి 'తెలుగు డ్రైవ్‌స్పార్క్' చూస్తూ ఉండండి. ఈ కథనంపై మీ అభిప్రాయాలను మరియు సందేహాలను తప్పకుండా మాతో పంచుకోండి. లేటెస్ట్ ఆటోమొబైల్ వార్తలు కోసం ఫేస్‌బుక్ (Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) మరియు యూట్యూబ్ (YouTube) ఛానల్స్ ఫాలో అవ్వండి.

More from DriveSpark

Article Published On: Friday, April 5, 2024, 12:00 [IST]
English summary
Top motorcycle brand sales in march 2024 details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+