Hero Mavrick 440 కొంటున్నారా.. ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయాలు ఇవే!
ఇటీవల భారతీయ మార్కెట్లో హీరో మోటోకార్ప్ ఓ కొత్త బైకును 'మావ్రిక్ 440' (Mavrick 440) పేరుతో లాంచ్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ కథనంలో ఈ లేటెస్ట్ బైకులో కస్టమర్ తప్పకుండా తెలుసుకోవాల్సిన విషయాలను గురించి వివరంగా పరిశీలిద్దాం..
వేరియంట్స్, ధర & బుకింగ్స్
హీరో మావ్రిక్ 440 బైక్ మొత్తం మూడు వేరియంట్లలో లాంచ్ అయింది. అవి బేస్, మిడ్ మరియు టాప్ స్పెక్స్. వీటి ధరలు వరుసగా రూ. 1.99 లక్షలు, రూ. 2.14 లక్షలు, రూ. 2.24 లక్షలు (అన్ని ధరలు ఎక్స్ షోరూమ్, ఇండియా). ఈ బైకుని కొనాలనుకునే కస్టమర్ ఇప్పుడే రూ. 5000 టోకెన్ మొత్తంతో బుక్ చేసుకోవచ్చు. డెలివరీలు ఏప్రిల్ 15న ప్రారంభమవుతాయి.

డిజైన్ & ఫీచర్స్
హీరో మ్యాప్రిక్ 440 చూడటానికి కొంత హార్లే డేవిడ్‌సన్ ఎక్స్440 మాదిరిగా ఉన్నప్పటికీ నిశితంగా పరిశీలిస్తే.. డిజైన్ పరంగా భిన్నంగా ఉండటం గమనించవచ్చు. ఫీచర్స్ విషయానికి వస్తే.. ఇందులో డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ ఉంటుంది. దీని ద్వారా టర్న్ బై టర్న్ న్యావిగేషన్, కాల్ అలర్స్, మెసేజ్ అలర్ట్ వంటి మరెన్నో ఫీచర్స్ పొందవచ్చు. ఛార్జింగ్ పోర్ట్ కూడా ఇందులో లభిస్తుంది.
కలర్ ఆప్షన్స్
హీరో మావ్రిక్ 440 బైక్ యొక్క బేస్ వేరియంట్ ఆర్కిటిక్ వైట్ కలర్ పొందుతుంది. ఇది స్పోక్ వీల్స్‌తో వస్తుంది. మిడ్ వేరియంట్ అల్లాయ్ వీల్స్ కలిగి సెలెస్టియల్ బ్లూ మరియు ఫియర్‌లెస్ రెడ్ అనే రెండు కలర్ ఆప్షన్స్ పొందుతుంది. ఇక టాప్ వేరియంట్ మెషిన్డ్అల్లాయ్ వీల్స్ కలిగి ఫాంటమ్ బ్లాక్ మరియు ఎనిగ్మా బ్లాక్ కలర్ ఆప్షన్స్ పొందుతాయి. ఇవన్నీ కూడా చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉంటాయి.

ఇంజిన్
కొత్త హీరో మావ్రిక్ 440 బైక్ 440 సీసీ సింగిల్ సిలినార్ ఎయిర్ అండ్ ఆయిల్ కూల్డ్ ఇంజిన్ కలిగి ఉంటుంది. ఈ ఇంజిన్ 6000 rpm వద్ద 26 Bhp పవర్ మరియు 4000 rpm వద్ద 36 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది స్లిప్ అండ్ అసిస్ట్ క్లచ్ సిస్టమ్‌తో 6 స్పీడ్ గేర్‌బాక్స్‌తో జత చేయబడి ఉంటుంది.
సస్పెషన్ అండ్ బ్రేకింగ్ సిస్టం
మావ్రిక్ 440 బైక్ ముందు భాగంలో 43మిమీ టెలిస్కోపిక్ సస్పెన్షన్, వెనుక భాగంలో ట్విన్-షాక్ సెటప్ ఉంటుంది. ఈ బైకులోని 17 ఇంచెస్ వీల్స్ 110/70 ఆర్17 ఫ్రంట్ అండ్ 150/60 ఆర్17 రియర్ టైర్లను పొందుతాయి. బ్రేకింగ్ విషయానికి వస్తే.. ఈ బైక్ ముందు భాగంలో 320మిమీ డిస్క్ బ్రేక్ మరియు వెనుక భాగంలో 240మీమీ డిస్క్ బ్రేక్ ఉంటుంది. ఇందులో డ్యూయెల్ ఛానల్ ఏబీఎస్ కూడా ఉంటుంది.

ప్రత్యర్థులు
దేశీయ విఫణిలో లాంచ్ అయిన కొత్త హీరో మావ్రిక్ 440 బైక్ ఇప్పటికే మార్కెట్లో అమ్మకానికి ఉన్న రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350, హోండా సీబీ350, జావా 350, ట్రయంఫ్ స్పీడ్ 400 బైకులకు ప్రత్యర్థిగా ఉంటుంది. కావున అమ్మకాల పరంగా గట్టి పోటీని ఎదుర్కోవాల్సి ఉంటుందని భావిస్తున్నాము. ధర పరంగా ఖరీదైన హీరో మోటార్‌సైకిల్ అయినప్పటికీ హార్లీ డేవిడ్‌సన్ 440 కంటే తక్కవే కావడం గమనించదగ్గ విషయం.
ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథనాలు తెలుసుకోవడంతో పాటు, దేశీయ మార్కెట్లో లాంచ్ అయ్యే కొత్త కార్లు మరియు బైకుల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి 'తెలుగు డ్రైవ్‌స్పార్క్' చూస్తూ ఉండండి. ఈ కథనంపై మీ అభిప్రాయాలను మరియు సందేహాలను తప్పకుండా మాతో పంచుకోండి. లేటెస్ట్ ఆటోమొబైల్ వార్తలు కోసం ఫేస్‌బుక్ (Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) మరియు యూట్యూబ్ (YouTube) ఛానల్స్ ఫాలో అవ్వండి.


Click it and Unblock the Notifications








