బైక్ లవర్స్‌కు 2025లో పండగే.. థ్రిల్లింగ్ రైడ్ ఇచ్చే కొత్త బైకులు ఇవే.. అవెంటో ఒకసారి చూసేయండి..

స్టైలిష్ డిజైన్‌తో కూడిన బైకులకు ఇండియాలో డిమాండ్ బాగా పెరుగుతుంది. ముఖ్యంగా యువత ఎక్కువగా ఇలాంటి వాటిని కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. 2024 ఏడాదిలో టూవీలర్ తయారీ కంపెనీలు అధునాతన ఫీచర్లతో కూడిన బైకులను విడుదల చేయగా, ఇవన్నీ కూడా అమ్మకాల్లో దూసుకుపోతున్నాయి. మరికొద్ది రోజుల్లో ప్రస్తుత ఏడాది ముగియనుంది. దీంతో వీటి అమ్మకాలకు సంబంధించిన డేటాను వరుసగా కంపెనీలు విడుదల చేస్తున్నాయి. ఇదిలా ఉంటే 2024 ఏడాదిలో ఏ విధంగా కొత్త బైకులు టూవీలర్ లవర్స్‌ను అలరించాయో, వచ్చే ఏడాది 2025లో కూడా అలరించడానికి రాబోతున్నాయి. తయారీ కంపెనీలు అధునాతన ఫీచర్లతో సరికొత్త లుక్‌తో కూడిన బైకులను లాంచ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాయి.

వీటిలో రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి క్లాసిక్ 650 మోడల్, KTM 390 అడ్వెంచర్ ఎస్, హోండా నుంచి CB750 హార్నెట్, BSA నుంచి B65 స్క్రాంబ్లర్, సుజుకీ SV 650 బైకులు 2025లో మార్కెట్లో సందడి చేయడానికి రాబోతున్నాయి. ఇవి కఠినమైన బాడీని కలిగి ఉంటాయి. అన్ని రకాల వాతావరణ పరిస్థితులను తట్టుకునే విధంగా, స్టైలిష్ డిజైన్‌తో వస్తున్నాయి. మోడళ్ల వారీగా వీటి గురించిన వివరాలు క్రింది కథనంలో చూద్దాం..

royal enfield classic 650 Launch In 2025

Royal Enfield Classic 650: రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 650 మోడల్ వచ్చే ఏడాది జనవరి ప్రారంభంలో విడుదల కాబోతుంది. అంచనాల ప్రకారం దీని ధర దాదాపు రూ. 3.50 లక్షల నుంచి మొదలుకుని రూ.4 లక్షల వరకు ఉంటుందని తెలుస్తుంది. ఇది చూడటానికి క్లాసిక్ 350 డిజైన్‌ను పోలీ ఉంటుంది. దీని ఇంజిన్ కెపాసిటీ 647.95 ccగా ఉంది. దీనికి 6 స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ సెటప్‌ను అందించారు.

KTM 390 Adventure S: KTM 390 అడ్వెంచర్ ఎస్ బైక్ ఆఫ్-రోడ్ ప్రయాణాలకు అనుగుణంగా ఉండటంతో పాటు లాంగ్-ట్రావెల్ చేయడానికి చాలా కంఫర్ట్‌ బైక్. 2025 జనవరి నెలలో విడుదల కాబోతుంది. అంచనా ధర రూ. 3.80 లక్షలుగా ఉంది. ఇది 373.27 cc ఇంజిన్ కెపాసిటీతో వస్తుంది. మైలేజ్ 32.7 కి.మీల వరకు వస్తుందని కంపెనీ పేర్కొంటుంది. ఇంజిన్‌కు 6 స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ జత చేశారు.

Bsa b65 Scrambler Upcoming New Bike In 2025

BSA B65 Scrambler: BSA B65 స్క్రాంబ్లర్ 2025 ఏడాది మధ్య భాగంలో మార్కెట్లోకి విడుదల అయ్యే అవకాశం ఉంది. దీని ధర దాదాపు రూ.3 లక్షల (ఎక్స్ షోరూమ్) ధర వరకు ఉంటుంది. ఇది 650cc సింగిల్-సిలిండర్‌తో రన్ అవుతుంది. ఈ ఇంజిన్‌కు 5 -స్పీడ్ గేర్‌బాక్స్‌ను జత చేశారు. అన్ని రకాల రోడ్తపై కూడా దూసుకుపోతుంది. గోల్డ్‌స్టార్ 650 ఆధారంగా దీన్ని తయారు చేశారు.

Honda CB750 Hornet: హోండా CB750 ధర భారీగా ఉంటుంది. ఈ బైక్ దాదాపు రూ.11 లక్షల నుంచి ఉంటుంది. మార్కెట్ వర్గాలు పేర్కొంటున్న దాని ప్రకారం, ఇది వచ్చే ఏడాది అక్టోబర్‌లో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ఈ బైక్ 755cc ఇంజిన్ కెపాసిటీతో వస్తుంది. దీనిలో అధునాతన ఫీచర్లను అందిస్తున్నారు. బైక్‌పై ట్రిప్‌లు వేసే వారికి బాగా సెట్ అయ్యే మోడల్.

Suzuki sv 650 Launch In 2025

Suzuki SV 650: సుజుకీ SV 650 వచ్చే ఏడాది జనవరి 21న మార్కెట్లోకి లాంచ్ అయ్యే అవకాశం ఉంది. అంచనాల ప్రకారం, ధర రూ.7.50 నుంచి రూ. 8.50 లక్షల వరకు ఉంటుంది. ఇది 645 cc ఇంజిన్ కెపాసిటీతో వస్తుంది. మైలేజ్ 30 కి.మీ వరకు వస్తుంది. రైడింగ్‌లో స్కిడ్ కాకుండా ఉండటానికి డబుల్ డిస్క్ బ్రేకులను కలిగి ఉంటుంది. లాంచ్‌కు ముందు మరిన్ని వివరాలు వెలువడనున్నాయి.

More from DriveSpark

Article Published On: Wednesday, December 18, 2024, 9:30 [IST]
English summary
Top upcoming new bikes in 2025 year here full details
Read more on: #auto #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+