ట్రయంఫ్ సరికొత్త స్టైలిష్‌ బైక్‌.. దీన్ని సొంతం చేసుకుంటే మీరు అదృష్టవంతులే.. ఇది చాలా స్పెషల్ గురూ

లగ్జరీ లుక్‌ను కలిగి ఉండే బైకులకు డిమాండ్ గతంలో కంటే బాగా పెరిగింది. ప్రజల ఆదాయ స్థితిలో మార్పులు రావడం కారణంగా సాధారణ బైకుల కంటే కూడా స్టైలిష్ లుక్‌ను కలిగి ఉండే వాటిని ఎక్కువ మంది కొనుగోలు చేస్తున్నారు. దీంతో టూవీలర్ తయారీ కంపెనీలు ఈ సెగ్మెంట్ బైకుల ఉత్పత్తిపై ఎక్కువ ఫోకస్ చేసి మార్కెట్లోకి విడుదల చేస్తున్నాయి. తాజాగా ట్రయంఫ్ కంపెనీ కొత్తగా అధునాతన మోడల్‌ను ఆవిష్కరించింది. దీని పేరు 'బోనెవిల్లే బాబర్ TFC (Bonneville bobber tfc)'. ఇది ఒక లిమిటెడ్ ఎడిషన్. ట్రయంఫ్ ప్రత్యేకంగా ఈ బైకును తీసుకొచ్చింది. కంపెనీ ఈ మోడల్‌ను ప్రపంచవ్యాప్తంగా 750 యూనిట్లను మాత్రమే విక్రయిస్తుంది. కంపెనీకి చెందిన ఫ్యాక్టరీలో వీటిని తయారు చేస్తుంది. ఇది 2025 లో వినియోగదారులు కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంటుంది.

బోనెవిల్లే బాబర్ TFC లిమిటెడ్ ఎడిషన్ కాబట్టి ఈ బైకును కొనుగోలు చేయాలనుకునే వారు ప్రత్యేక వెబ్‌సైట్ ద్వారా బుక్ చేసుకోవడం ఉత్తమం. 750 యూనిట్లలో కొన్నింటిని భారత్‌కు కేటాయించే అవకాశం ఉంది. దీని డిజైన్ చూపరులను కట్టిపడేసేలా ఉంది. పెట్రోల్ ట్యాంక్ బ్లాక్ కలర్‌లో మధ్యలో గోల్డ్ టెక్చర్డ్ స్ట్రిప్‌‌తో అందంగా మెరిసిపోతుంది. ఇది సింగిల్ సీట్ ఆప్షన్‌ను కలిగి ఉంటుందని టీజర్ చూస్తేనే తెలుస్తుంది.

Bobber Tfc Limited Edition

ఇండియాలో దీని ధర రూ. 12 లక్షలు (ఎక్స్-షోరూమ్) నుంచి ప్రారంభం అవుతుంది. ఈ లిమిటెడ్ ఎడిషన్ ఇంజిన్ విషయానికి వస్తే, 1200cc సమాంతర-ట్విన్ ఇంజిన్‌తో రన్ అవుతుంది. ఇది 6000rpm వద్ద 75bhp పవర్, 3750rpm వద్ద 106Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. బైక్‌లో 6-స్పీడ్ గేర్‌బాక్స్‌ సెటప్ ఉంది. దీని బాడీ షేప్ చూస్తే కఠినమైన వాతావరణ పరిస్థితులను సైతం తట్టుకునేలా ఉంది.

ఎత్తుపల్లాలు ఉన్న ప్రాంతాల్లో కూడా ఈజీ రైడింగ్ అనుభవాన్ని అందిస్తుంది. ఇది స్పోర్ట్, రెయిన్, రోడ్ అనే మూడు రైడింగ్ మోడ్స్‌లను కలిగి ఉంది. అధునాతన సస్పెన్షన్ సెటప్‌ NIX 30 USD ఫ్రంట్ ఫోర్క్స్‌లను అడ్జెస్ట్ చేసుకునే విధంగా ఉన్నాయి. ముందు డ్యూయల్ 310mm డిస్క్‌లు, వెనుక భాగంలో 255mm డిస్క్‌ ఉంటుంది. రైడింగ్ సమయంలో పూర్తి కంట్రోల్ కోసం డ్యూయల్-ఛానల్ ABS సిస్టంను కూడా ఇచ్చారు.

bonneville bobber tfc limited edition Unveiled

బాబర్ TFCలో స్పోక్డ్ వీల్స్‌ను అందించారు. ముందు 19-అంగుళాల వీల్ కొంచెం ఎత్తుగా ఉంటుంది, అదే వెనుక వైపు 16-అంగుళాల వీల్ ఉంది. అల్యూమినియం యోక్స్‌పై క్లిప్ ఆన్ హ్యాండిల్‌బార్‌లను దీనికి ఇచ్చారు. బైకు బరువు తక్కువగా ఉంటుంది. సాధారణ బాబర్ మోడల్ 251 కిలోలు ఉండగా, అదే బాబర్ TFC మాత్రం 237 కిలోల బరువుతో వచ్చింది.

మడ్‌గార్డ్ స్టేలు, సైడ్ ప్యానెల్‌‌లు స్పోర్టీగా కనిపించడానికి వీటిని గ్లోస్ లక్కర్డ్ కార్బన్ ఫైబర్‌‌తో తయారుచేశారు. సైలెన్సర్ అమర్చిన తీరు బైక్‌కు కొత్త రూపాన్ని తీసుకువచ్చింది. రైడర్ల కోసం ఇంటిగ్రేటెడ్ మల్టీఫంక్షన్ LCDతో అనలాగ్ స్పీడోమీటర్‌ను అందించారు. ముందు ఉన్న డిస్‌ప్లేలో రైడింగ్ వివరాలను తెలుసుకోవచ్చు. కొత్త ట్రయంఫ్ బోనెవిల్లే బాబర్ TFC 2025 ఏడాది మార్చి నుండి డీలర్‌షిప్‌లలో అందుబాటులో ఉంటుందని తెలుస్తుంది.

Triumph bonneville bobber tfc limited edition

డ్రైవ్‌స్పార్క్‌ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

More from DriveSpark

Article Published On: Friday, December 13, 2024, 16:27 [IST]
English summary
Triumph bonneville bobber tfc limited edition unveiled
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+