కొత్త ట్రయాంఫ్ బైక్ విడుదల.. దీనిని కొనే బదులు రెండు కార్లు కొనొచ్చు!
మార్కెట్‌లో సరికొత్త మోటార్ సైకిళ్లతో ట్రయాంఫ్ మోటార్స్ గట్టి సవాల్‌ని విసురుతోంది. ముఖ్యంగా రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్స్‌కి ఈ ట్రయాంఫ్ బైక్స్ పలు సవాళ్లను విసురుతోంది. నేడు ఆ కంపెనీ డేటోనా 660 (Triumph Daytona 660) బైక్‌ని విడుదల చేసింది. కొత్త ట్రయాంఫ్ డేటోనా 660 ధర రూ. 9.72 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)గా ఉంది. కొత్త ట్రయాంఫ్ డేటోన్ 660 కోసం బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. ఈ కొత్త బైక్ కొనుగోలు చేయడానికి రూ. 25,000 టోకెన్ అమౌంట్ చెల్లించాలి. ఈ బైక్ ఇప్పటికే అధీకృత డీలర్‌షిప్‌లకు చేరుకోవడం ప్రారంభించింది.
కొత్త ట్రయాంఫ్ డేటోనా 660 మోడల్ పాత డేటోనా 675 నుంచి కొన్ని డిజైన్‌లను పంచుకుంటుంది. ఇది ట్రాన్స్‌పరెంట్ విండ్‌స్క్రీన్‌తో కూడిన స్ప్లిట్ LED హెడ్‌లైట్‌ని కలిగి ఉంటుంది. డేటోనా 660 మరింత స్పోర్టీ లుక్‌ని కలిగి ఉంది. ఇంది మై ట్రయాంఫ్ కనెక్టివిటీ సిస్టమ్ సపోర్ట్ చేసే TFT LCD డిస్ప్లేతో కూడిన డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ కన్సోల్‌ని కలిగి ఉంది.

ఈ బైక్ రెయిన్, రోడ్ మరియు స్పోర్ట్ అనే మూడు రైడింగ్ మోడ్స్‌తో వస్తుంది, రైడ్-బై-వైర్ త్రోటిల్, ట్రాక్షన్ కంట్రోల్ మొదలైనవి ఉన్నాయి. ఈ ట్రయాంఫ్ డేటోనా 660 స్నోడోనియా వైట్, శాటిన్ గ్రానైట్, కార్నివాల్ రెడ్ అనే మూడు పెయింట్ స్కీమ్ లలో లభిస్తుంది. ఇది చూడడానకి సరికొత్త లుక్‌ని అందిస్తుంది.
ట్రయాంఫ్ డేటన్ 660 బైకులో 660 సీసీ ఇన్ లైన్ మూడు సిలిండర్ల ఇంజిన్ కలదు. ఈ ఇంజిన్ 11,250 rpm వద్ద 95 ps శక్తిని మరియు 69 nm టార్క్‌ని ఉత్పత్తి చేయగలదు. ఇది 6-స్పీడ్ గేర్‌బాక్స్ తో పాటు స్లిప్పర్ మరియు అసిస్ట్ క్లచ్‌ని స్టాండర్డ్ ఫిట్‌మెంట్‌గా జతచేయబడి ఉంటుంది.

ట్రయాంఫ్ డేటోనా 660 బైక్‌లో స్టీల్ ప్యారిమీటర్ ఛాసిస్‌ని అమర్చారు. కొత్త ట్రయాంఫ్ డేటోనా 660 భారత మార్కెట్‌లో కవాసాకి నింజా 650 కు ప్రత్యర్థిగా ఉంది. ట్రయాంఫ్ ముందు భాగంలో షోవా 41 మిమీ పెద్ద పిస్టన్, ఫ్రంట్ ఫోర్కులు మరియు వెనుక ప్రీలోడ్-అడ్జస్టబుల్ మోనోషాక్ సస్పెన్షన్ కలిగి ఉంది. కొత్త ట్రయాంఫ్ డేటోనా 660 బైక్ ముందు భాగంలో ట్విన్ 310mm డిస్క్ బ్రేక్స్ ఉన్నాయి.
వెనుక భాగంలో 220mm డిస్క్ బ్రేక్స్ ఉన్నాయి. ఇది మరింత సేఫ్టీ కోసం డ్యూయల్-ఛానల్ ఎబిఎస్ సిస్టమ్‌తో వస్తుంది. ఇందులో 17 అంగుళాల వై-ఆకారంలో కాస్ట్ అల్యూమినియం ఫైవ్-స్పోక్ బ్లాక్ అల్లాయ్ వీల్స్ ఉన్నాయి. ఇవి ముందు 120/70, వెనుక 180/55 టైర్‌తో వస్తుంది. ఈ బైక్ సీటు ఎత్తు 810 mmగా ఉంది. ఇది 660 సీసీ ప్రత్యర్థుల కంటే ఎక్కువ పనితీరును కలిగి ఉంది.

ఈ బైక్ రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్స్‌కి గట్టి పోటీని ఇస్తుంది. దీనికి ప్రధాన పోటీదారుగా భావిస్తున్న కవాసకి నింజా 650 ధర రూ. 7.16 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)గా ఉంది. అయితే దీనితో పోల్చుకుంటే ఇది హై ఫర్ఫామెన్స్‌ని అందిస్తుంది. అందువల్ల దీని ధర ఎక్కువగా ఉందని చెబుతున్నారు. ఈ విభాగంలో గట్టి పోటీని మాత్రం ఇస్తుందని భావిస్తున్నారు.
డ్రైవ్స్‌పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








