Triumph Daytona 660 ట్రయంఫ్ డేటోనా 660 బైక్ ఆవిష్కరణ.. ధర, ఫీచర్లు, ఇతర వివరాలివే.!!
ప్రముఖ టూ వీలర్స్ తయారీ సంస్థ ట్రయంఫ్ తన మిడిల్ వైట్ స్పోర్ట్ బైక్ 'డేటోనా 660(Triumph Daytona 660)' స్పోర్ట్ టూరర్ బైక్‌ను నిన్న(జనవరి 9) న ఆవిష్కరించింది. భారత్‌తో పాటు గ్లోబల్ మార్కెట్లో ఈ బైక్‌ను పరిచయం చేసింది. ఈ బైక్ డిజైన్, ధర, ఫీచర్లు పూర్తి సమాచారం ఈ కథనంలో..
ట్రయంఫ్ డేటోనా 660 బైక్‌లో.. ట్రైడెంట్ 660, టైగర్ స్పోర్ట్ 660లో కనిపించే అదే 660cc ఇంజిన్‌ను ఉపయోగించారు. ఇన్‌లైన్ త్రీ-సిలిండర్, లిక్విడ్-కూల్డ్ ఇంజిన్‌తో ఈ బైక్ పనిచేస్తుంది. అయితే, డేటోనా 660 అదనంగా.. 14hp మరియు 4Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుండగా.. మొత్తంగా 8,250 rpm వద్ద 95 hp మరియు 11,250 rpm వద్ద 69 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

డేటోనా 660(Daytona 660) బైక్ ఆరు-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది. దీని ద్వారా ఈ బైక్ రైడర్లకు ఉత్తేజకరమైన రైడ్ ఫీలింగ్‌ను ఇస్తుంది. ఇంకా ఇందులో స్లిప్, అసిస్ట్ క్లచ్‌తోపాటు 2-వే క్విక్ షిఫ్టర్, ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్ కలిగి ఉంది. ఈ బైక్ 2-రైడింగ్ మోడ్స్ అంటే రెయిన్, రోడ్ మోడ్స్‌లో పరిచయమవుతోంది.
డేటోనా 660 41mm అప్‌సైడ్-డౌన్ బిగ్ పిస్టన్ ఫోర్క్‌లను కలిగి ఉండగా.. ముందు వైపున 110mm ట్రావెల్ మరియు షోవా మోనోషాక్‌తో ప్రీలోడ్ అడ్జస్ట్‌మెంట్‌ను కలిగి ఉంది. వెనుకవైపు 130mm ట్రావెల్‌తో వస్తుంది. బ్రేకింగ్ సిస్టమ్ విషయానికొస్తే ముందు భాగంలో ట్విన్ 310mm డిస్క్‌లతో అప్‌గ్రేడ్ అయింది. వెనుక వైపు 220mm డిస్క్ బ్రేక్‌ను కలిగి ఉంది.

మొత్తంగా ఫ్రంట్‌లో నాన్ అడ్జస్టబుల్ అప్‌సైడ్ యూఎస్డీ డౌన్‌ఫోర్క్, రేర్‌లో మోనో షాక్ యూనిట్, రెండు వీల్స్‌పై డిస్క్ బ్రేక్స్‌ను కలిగి ఉన్నాయి. భారత మార్కెట్లో యమహా ఆర్7, కవాసాకి నింజా 650, హోండా సీబీఆర్ 650ఆర్ మోటారు సైకిళ్లకు ట్రయంఫ్ డేటోనా 660 గట్టి పోటీనివ్వనుంది.
కాగా ట్రయంఫ్ డేటోనా 660 బైక్‌లో డ్యూయల్-ఛానల్ ABS ఫీచర్‌ను అందించడం ద్వారా రైడర్ భద్రతకు అధిక ప్రాధాన్యత ఇస్తోంది. ఇక ఇందులో డ్యుయల్ ఎల్ఈడీ హెడ్‌లైట్ క్లస్టర్, క్లిప్ హ్యాండిల్ బార్ ఉన్నాయి. ట్రైడెంట్, టైగర్ స్పోర్ట్ బైక్‌ల మాదిరిగానే స్విచ్ గేర్స్, లీవర్స్, ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ ఫీచర్లను ఇందులో చూడవచ్చు.

ట్రయంఫ్ డేటోనా 660ను డ్యాష్‌బోర్డ్ కోసం బ్లూటూత్ మాడ్యూల్, ఇంకా బైడైరెక్షనల్ క్విక్‌షిఫ్టర్‌తో సహా అధునాతన ఫీచర్లతో రూపొందించారు. డేటోనా 660లో స్పోర్ట్-ఓరియెంటెడ్ మిచెలిన్ పవర్ 6 టైర్‌లను అమర్చారు. కాగా అంతర్జాతీయ మార్కెట్లో ఈ బైక్ ధర GBP 8,595 (భారత కరెన్సీలో రూ. 9.08 లక్షలు) ధర ట్యాగ్‌ను కలిగి ఉంది. ఇది ట్రైడెంట్ 660 ధర కంటే ఎక్కువగా ఉంది.

భారత మార్కెట్‌లో ట్రయంఫ్ డేటోనా 660 ధరపై త్వరలో స్పష్టత రానుంది. ట్రయంఫ్ తన అంతర్జాతీయ లైనప్‌ను భారత్‌లోనూ కొనసాగిస్తుండటం బైక్ ప్రియులకు గుడ్ న్యూస్ లాంటిది. ఈ లిస్ట్‌లో డేటోనా 660 కూడా చేరనుంది. ఇది రైడర్‌కు థ్రిల్లింగ్ అనుభూతిని ఇవ్వనుంది. బైక్ పర్ఫామెన్స్, రిఫైన్డ్ హ్యాండ్లింగ్ మరియు స్పోర్టీ డిజైన్‌తో, డేటోనా 660 మోటార్‌సైకిల్ ప్రియులకు ఫేవరెట్‌గా మారడానికి సిద్ధంగా ఉంది.


Click it and Unblock the Notifications








