75 నగరాలు, 100 షోరూమ్‌లు: భారీగా పెరుగుతున్న ట్రయంఫ్ హవా!

భారతదేశంలో టూ వీలర్ల వినియోగం మునుపటి కంటే కూడా పెరిగింది. ఈ సమయంలో వాహన తయారీ సంస్థలు కూడా దేశీయ విఫణిలో తమ ఉనికిని నిరంతరం విస్తరించడానికి తగిన సన్నాహాలు చేస్తున్నాయి. ఈ చొరవలో భాగంగానే ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ 'ట్రయంఫ్ మోటార్‌సైకిల్స్' (Triumph Motorcycles) తన నెట్‌వర్క్ విస్తరిస్తోంది. గతంలో 16 నగరాల్లో 16 షోరూమ్‌లను మాత్రమే కలిగి ఉన్న సంస్థ ఇప్పుడు 75 నగరాలకు చేరింది, 100 షోరూమ్‌లను ప్రారంభించింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలను వివరంగా ఈ కథనంలో తెలుసుకుందాం.

ట్రయంఫ్ కంపెనీ దేశంలో వేగంగా విస్తరించడానికి కారణం.. బ్రాండ్ యొక్క స్పీడ్ 400 మరియు స్క్రాంబ్లర్ 400 ఎక్స్. ఇవి రెండూ కంపెనీ యొక్క వృద్ధికి గణనీయంగా దోహదపడ్డాయి. ఇది మాత్రమే కాకుండా కంపెనీ బజాజ్‌తో ఏర్పాటు చేసుకున్న భాగస్వామ్యం కూడా దేశంలో అభివృద్ధి చెందటానికి కీలకంగా మారింది. కంపెనీ బజాజ్ ఆటో సహకారంతోనే స్పీడ్ 400, స్క్రాంబ్లర్ 400 ఎక్స్ బైకులను అభివృద్ధి చేసి వినియోగదారులకు అందుబాటులోకి తెచ్చాయి.

Triumph Dealership In India

భారతదేశంలో మాత్రమే కాకుండా.. అమెరికా, జపాన్, జర్మనీ, యూకే మరియు ఆస్ట్రేలియా వంటి 50 దేశాల్లో ట్రయంఫ్ బైకులను విక్రయిస్తోంది. ఇప్పటికే కంపెనీ ఈ దేశాల్లో 50000 యూనిట్ల బైకులను విజయవంతంగా విక్రయించింది. కంపెనీ ఇన్నో దేశాల్లో అంత పెద్ద సంఖ్యలో బైకులను విక్రయించింది అంటే.. గ్లోబల్ మార్కెట్లో బ్రాండ్ యొక్క డిమాండ్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.

భారతదేశంలో విక్రయిస్తున్న స్పీడ్ 400 బైక్ ధర దాని ప్రత్యర్థులతో పోలిస్తే తక్కువనే చెప్పాలి. ట్రయంఫ్ స్పీడ్ 40 అనేది దేశంలో అత్యంత సరసమైన బైక్. దీని ధర రూ. 2.24 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఇదే కంపెనీ యొక్క అత్యంత ఖరీదైన బైక్ రాకెట్ 3 స్ట్రోమ్ ఆర్. దీని ధర ఏకంగా రూ. 21.99 లక్షలు (ఎక్స్ షోరూమ్).

Triumph Dealership In India

దేశీయ మార్కెట్లో విక్రయించబడుతున్న కొత్త ట్రయంఫ్ స్పీడ్ 400 మరియు స్క్రాంబ్లర్ 400 ఎక్స్ రెండింటికీ శక్తినిచ్చే ఇంజన్ ట్రయంఫ్ యొక్క కొత్త టీఆర్ సిరీస్‌కు చెందినదని స్పష్టమవుతోంది. ఇందులో 398.15 సీసీ లిక్విడ్ కూల్డ్ ఇంజిన్ ఉంటుంది. ఇది 39.5 బీహెచ్‌పీ పవర్ మరియు 37.5 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంజిన్ 6 స్పీడ్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది.

ట్రయంఫ్ స్క్రాంబ్లర్ 400 ఎక్స్ బైక్ యొక్క ముందు భాగంలో 43 మిమీ అప్‌సైడ్‌డౌన్ బిగ్ పిస్టన్ ఫోర్క్ మరియు ఫ్రీ లోడ్ అడ్జస్టబుల్ మోనోశాక్ ఉంటుంది. ఈ బైక్ యొక్క రెండు చివర్లలో 150 మిమీ సస్పెన్షన్ ఉంటుంది. అయితే స్పీడ్ 400 బైకులో 140 మిమీ ఫ్రంట్ ఫోర్క్ మరియు వెనుక 130 మిమీ మోనోషాక్ సెటప్‌ ఉంటుంది.

భారతదేశంలో ప్రస్తుతం ఈ బైకులకు మంచి డిమాండ్ ఉంది. ఈ తరుణంలో కంపెనీ ఈ బైకులను వాహన ప్రియులకు మరింత చేరువ చేయడానికి షోరూమ్‌లను ఎక్కువ సంఖ్యలో ప్రారంభిస్తోంది. ఇప్పటికే 100 షోరూమ్‌లను ప్రారంభించిన కంపెనీ రాబోయే రోజుల్లో ఈ సంఖ్యను మరింత పెంచే అవకాశం కూడా ఉంది. ఇదే జరిగితే కంపెనీ యొక్క బైకులు మరింత ఎక్కువగా అమ్మాయుడవుతాయని స్పష్టమవుతోంది.

ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథనాలు తెలుసుకోవడంతో పాటు, దేశీయ మార్కెట్లో లాంచ్ అయ్యే కొత్త కార్లు మరియు బైకుల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి 'తెలుగు డ్రైవ్‌స్పార్క్' చూస్తూ ఉండండి. ఈ కథనంపై మీ అభిప్రాయాలను మరియు సందేహాలను తప్పకుండా మాతో పంచుకోండి. లేటెస్ట్ ఆటోమొబైల్ వార్తలు కోసం ఫేస్‌బుక్ (Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) మరియు యూట్యూబ్ (YouTube) ఛానల్స్ ఫాలో అవ్వండి.

More from DriveSpark

Article Published On: Wednesday, July 31, 2024, 11:00 [IST]
English summary
Triumph opens 100th dealership in india details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+