Triumph Trident 660 స్పెషల్ ఎడిషన్.. ఇది చాలా స్పెషల్ గురూ! ఎందుకంటే?
ట్రయంఫ్ మోటార్‌సైకిల్స్ 1970లలో ఐల్ ఆఫ్ మ్యాన్ టీటీలో సాధించిన ఐదు విజయాలకు నివాళులు అర్పించడంలో భాగంగా స్పెషల్ ఎడిషన్ బైక్ ఆవిష్కరించింది. కంపెనీ ఆవిష్కరించిన ఈ బైక్ పేరు 'ట్రైడెంట్ 660'. దీని గురించి మరిన్ని వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.
కంపెనీ ఆవిష్కరించిన 'ట్రయంఫ్ ట్రైడెంట్ 660' ప్రత్యేకమైన ట్రై కలర్ పెయింట్ స్కీమ్ పొందుతుంది. అవి మెటాలిక్ బ్లూ స్ట్రిప్స్, ఎరుపు రంగు చారలతో కూడా బేస్ వైట్ కలర్. ఇది చూడటానికి కొత్తగా మాత్రమే కాదు, చాలా ఆకర్షణీయంగా కూడా ఉంటుంది. ఇది స్టాండర్డ్ ట్రైడెంట్ 660కి భిన్నంగా ఉంటుంది. దీనిని 750 సీసీ ట్రయంఫ్ ట్రైడెంట్ ఆధారంగా రూపొందించబడిన 'స్లిప్పరీ సామ్' రేస్ బైక్‌కు నివాళులుగా రూపొందించారు.

కొత్త ట్రయంఫ్ ట్రైడెంట్ 660 బైక్ యొక్క ఫ్యూయెల్ ట్యాంక్ మీద 67 అనే నెంబర్ ఉంటుంది. ఈ కలర్ స్కీమ్ ఫ్లైస్క్రీన్ మరియు బెల్లీపాన్‌లో కూడా చూడవచ్చు. ఇది దాని మునుపటి మోడల్ కంటే భిన్నంగా కనిపించేలా చేస్తుంది. ఈ బైక్ యొక్క రైడర్ సీటు తక్కువ ఎత్తులో, పిలియన్ సీటు కొంచెం ఎత్తును కలిగి ఉంటుంది. ఇది రైడింగ్ సమయంలో బైక్ రైడర్‌కు చాలా అనుకూలంగా ఉంటుంది.
డిజైన్ పరంగా కొంత అప్డేట్ పొందినప్పటికీ.. ట్రయంఫ్ ట్రైడెంట్ 660 ఎడిషన్ యాంత్రికంగా ఎటువంటి మార్పుకు లోనుకాదు. కాబట్టి అదే 660 సీసీ లిక్విడ్ కూల్డ్ ఇన్‌లైన్ త్రీ సిలిండర్ ఇంజిన్ పొందుతుంది. ఇది 81 హార్స్ పవర్ మరియు 64 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంజిన్ 6 స్పీడ్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది. ఇది బైడైరెక్షనల్ క్విక్ షిఫ్టర్ పొందుతుంది.

ట్రయంఫ్ ట్రైడెంట్ 660 బైక్ ట్యూబ్యులర్ ఫ్రేమ్ షోవా యూఎస్‌డీ ఫోర్క్ మరియు ఫ్రీలోడ్ అడ్జస్టబుల్ మోనోశాక్ వంటి వాటిని పొందుతుంది. బ్రేకింగ్ విషయానికి వస్తే.. ఈ బైక్ యొక్క ముందు భాగంలో 310 మిమీ డిస్క్ బ్రేక్ మరియు వెనుక 255 మిమీ డిస్క్ బ్రేక్ ఉంటాయి. ఇది రోడ్ అండ్ రెయిన్ అనే రెండు రైడింగ్ మోడ్స్ ఉంటాయి.
ట్రైడెంట్ 660 స్పెషల్ ఎడిషన్ ట్రాక్షన్ కంట్రోల్ పొందుతుంది. కలర్ TFT డ్యాష్ ద్వారా దీనిని యాక్సెస్ చేయవచ్చు. టర్న్ బై టర్న్ న్యావిగేషన్, అల్ ఎల్ఈడీ లైటింగ్ మరియు ఆటో క్యాన్సిలింగ్ ఇండికేటర్స్ కూడా ఇందులో లభిస్తాయి. ట్రయంఫ్ ఇండియా తన పోర్ట్‌ఫోలియోను అప్డేట్ చేయడంలో భాగంగా ఈ బైక్ ప్రవేశపెట్టడం జరిగింది. అయితే ఇది భారతీయ మార్కెట్లో లాంచ్ అవుతుందా? లేదా? అనేది తెలియాల్సి ఉంది.

ట్రయంఫ్ ట్రైడెంట్ 660 బైక్ ధర రూ. 8.12 లక్షలు ఉంటుందని అంచనా. అయితే అధికారికంగా ధరలు ఈ బైక్ లాంచ్ సమయంలో వెల్లడవుతాయి. బహుశా ఈ స్పెషల్ ఎడిషన్ బైకుకు సరైన ప్రత్యర్థులు లేదని తెలుస్తోంది. ఇది స్పెషల్ ఎడిషన్ కాబట్టి పరిమిత సంఖ్యలో మాత్రమే అందుబాటులో ఉంటుందా? లేదా అనేది కూడా తెలియాల్సిన విషయం. ఇలాంటి మరిన్ని వివరాలు త్వరలోనే తెలుస్తాయి.
ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథనాలు తెలుసుకోవడంతో పాటు, దేశీయ మార్కెట్లో లాంచ్ అయ్యే కొత్త కార్లు మరియు బైకుల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి 'తెలుగు డ్రైవ్‌స్పార్క్' చూస్తూ ఉండండి. ఈ కథనంపై మీ అభిప్రాయాలను మరియు సందేహాలను తప్పకుండా మాతో పంచుకోండి. లేటెస్ట్ ఆటోమొబైల్ వార్తలు కోసం ఫేస్‌బుక్ (Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) మరియు యూట్యూబ్ (YouTube) ఛానల్స్ ఫాలో అవ్వండి.


Click it and Unblock the Notifications








