తక్కువ ధరలో ట్రయంఫ్ కొత్త బైక్ విడుదల.. రాయల్ ఎన్‌ఫీల్డ్ కొనేవారు దీనిని ట్రై చేయవచ్చు!
ప్రముఖ మోటార్ సైకిల్స్ ప్రధాన సంస్థ ట్రయంఫ్ (Triumph Motorcycles) భారత్‌లో రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్స్‌కి గట్టి పోటీని ఇస్తుంది. ఈ కంపెనీ నుంచి విడుదలైన బైక్స్ ప్రస్తుతం మార్కెట్‌లో మంచి డిమాండ్‌ని కలిగి ఉన్నాయి. బ్రిటన్‌కు చెందిన ట్రయంఫ్ మోటార్‌సైకిల్, బజాజ్ ఆటో భారత మార్కెట్‌లో భాగస్వామ్యంలో బైక్స్‌ని విడుదల చేస్తుంది. బజాజ్‌కి ఉన్న మార్కెట్‌తో ట్రయంఫ్ మోటార్‌సైకిల్స్ దుమ్మురేపుతున్నాయి. ఈ కంపెనీ బైక్స్‌ని సరికొత్త డిజైన్, ఆకర్షణీయమైన ఫీచర్లతో అందుబాటులోకి తీసుకువస్తుంది. నేడు (17-09-2024) సరికొత్త ట్రయంఫ్ స్పీడ్ T4 (Triumph Speed T4 Motorcycles), అప్‌డేటెడ్ ట్రయంఫ్ స్పీడ్ 400 మోటార్‌సైకిళ్లను (Triumph Speed 400 Motorcycles) విడుదల చేసింది. ఈ బైక్స్‌కి సంబంధించిన పూర్తి వివరాలు, ధర, స్పెసిఫికేషన్‌లపై ఓ లుక్కేయండి.
ట్రయంఫ్ స్పీడ్ T4: కంపెనీ లైనప్‌లోని బైక్స్‌లో అత్యంత సరసమైన ధరలో ఈ బైక్ అందుబాటులోకి తెచ్చింది. ఈ బైక్‌ని రూ. 2.17 లక్షల (ఎక్స్-షోరూమ్) ధరతో ఈ బైక్‌ని మార్కెట్‌లో ప్రవేశపెట్టింది. ఈ బైక్‌కి సంబంధించిన బుకింగ్స్‌ని సైతం ఈ బైక్ ఇప్పటికే ప్రారంభమైనట్లు కంపెనీ వెల్లడించింది. ఆసక్తి గల కస్టమర్‌లు కంపెనీ అధికారిక వెబ్‌సైట్ లేదా సమీప డీలర్‌షిప్‌ను సందర్శించడం ద్వారా ఈ మోటార్‌సైకిల్‌ను బుక్ చేసుకోవచ్చు.

ఈ సరికొత్త ట్రయంఫ్ స్పీడ్ ఇంజిన్ కంపెనీ లైనప్‌లోని ఇతర మోడళ్ల మాదిరి 399 సీసీ సింగిల్-సిలిండర్ లిక్విడ్-కూల్డ్ పెట్రోల్ ఇంజిన్‌తో పనిచేస్తుంది. ఇది 7000 rpm వద్ద 30.6 bhp పవర్‌ని, 5000 rpm వద్ద 36 Nm గరిష్ట టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఈ బైక్ 6-స్పీడ్ గేర్‌బాక్స్‌తో అందుబాటులో ఉంటుంది.
ఈ సరికొత్త స్పీడ్ T4 మోటార్‌సైకిల్ డిజైన్ అచ్చం 'స్పీడ్ 400' బైక్‌ని పోలి ఉంటుంది. ఈ బైక్ వైట్, రెడ్, బ్లాక్ కలర్‌లలో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది. ఈ బైక్‌ని బ్లూటూత్ కనెక్టివిటీ, ట్రాక్షన్ కంట్రోల్, అనలాగ్-డిజిటల్ డిస్‌ప్లేతో మరెన్నో అదనపు ఫీచర్లు ఇందులో ఉన్నాయి. ఈ ఫీచర్లు అన్ని ప్రీమియం బైక్స్‌లో ఉండే విధంగా అందుబాటులో ఉంటాయి.

ఇక సస్పెన్షన్ విషయానికి వస్తే కొత్త స్పీడ్ T4 మోటార్‌సైకిల్ ముందు (Front) టెలిస్కోపిక్ ఫోర్క్స్ సస్పెన్షన్ సెటప్‌తో వస్తుంది. ఇది హ్యాండిల్ బార్ రెండు చివర్లలో డిస్క్ బ్రేక్ ఆప్షన్‌ని కలిగి ఉంటుంది. 17-అంగుళాల చక్రాలు అపోలో ఆల్ఫా H1 టైర్లు లేదా MRF స్టీల్ బ్రేస్ టైర్లతో అమర్చబడి ఉంటాయి. ఇవి మడ్ రోడ్లలోనూ మంచి ఫర్ఫామెన్స్‌ని అందించేందుకు దోహదపడతాయి.
ట్రయంఫ్ స్పీడ్ 400: ఈ బైక్‌ని చిన్నపాటి అప్‌డేట్స్‌తో కంపెనీ లాంచ్ చేయబడింది. దీని ధర రూ.2.4 లక్షలు ఎక్స్-షోరూమ్‌గా నిర్ణయించింది. ఇది వరకే అందుబాటులో ఉన్న పాత 'స్పీడ్ 400'తో పోలిస్తే దీని ధర రూ.15,000 ఎక్కువగా ఉంది. దీనికి సంబంధించిన బుకింగ్స్ కూడా ఇప్పటికే ప్రారంభం అయ్యాయి. ఈ బైక్ డెలివరీలు కూడా అతి త్వరలో ఆరంభం కానున్నాయి.

ఈ సరికొత్త స్పీడ్ మోటార్‌సైకిల్ రేసింగ్ ఎల్లో, ఫాంటమ్ బ్లాక్, పెరల్ మెటాలిక్ వైట్, రేసింగ్ రెడ్ అనే కలర్ ఆప్షన్‌లలో అందుబాటులో ఉంటుంది. ఈ బైక్ సీటింగ్ పొజీషన్‌ని కంపెనీ అప్‌గ్రేడ్ చేసింది. దీంతో సుదూర ప్రయాణాల్లో ఈ బైక్‌పై సౌకర్యవంతంగా ప్రయాణించవచ్చు. అడ్జస్టబుల్ బ్రేక్స్, క్లచ్ లివర్లు ఇంకా కొన్ని చిన్నపాటి మార్పులను కంపెనీ సరిచేసింది.
ఈ ట్రయంఫ్ స్పీడ్ 400 బైక్ కూడా అదే 399 సీసీ సింగిల్ సిలిండర్ లిక్విడ్-కూల్డ్ పెట్రోల్ ఇంజిన్‌తో పనిచేస్తుంది. ఇది 8,000 rpm వద్ద 39.5 bhp పవర్, 6,500 rpm వద్ద 39 nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 6-స్పీడ్ గేర్‌బాక్స్‌ను కలిగి ఉంటుంది. ఇందులో రైడ్-బై-వైర్ థొరెటల్, ఫుల్-LED లైటింగ్, డ్యూయల్-ఛానల్ ABS, సెమీ-డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ వంటి ఫీచర్లు కలవు.


Click it and Unblock the Notifications








