కొత్త ఏడాదికి ముందు ఈ బైక్‌పై అదిరిపోయే ఆఫర్.. ఇయర్ ఎండ్ సేల్‌ను అందిస్తున్న ట్రయంఫ్
ప్రస్తుత ఏడాది 2024 కొద్ది రోజుల్లోనే ముగియనుంది. ఈ నేపథ్యంలో బ్రిటిష్ కంపెనీ ట్రయంఫ్(Triumph) భారతీయ వినియోగదారుల కోసం ఇయర్ ఎండ్ ఆఫర్‌ను తీసుకొచ్చింది. అందులో భాగంగా తన మోడల్‌పై ఈ డిసెంబర్ నెలలో భారీ ఎత్తున తగ్గింపును అందిస్తున్నట్లు ఇటీవల ఒక ప్రకటన విడుదల చేసింది. ట్రయంఫ్ భారతీయ కంపెనీ బజాజ్‌తో కలిసి అభివృద్ధి చేసిన స్క్రాంబ్లర్ 400 ఎక్స్(scrambler 400X) మోడల్‌పై ఇయర్ ఎండ్ ఆఫర్ ప్రస్తుతం అందుబాటులో ఉంది. దీపావళి పండుగ సమయంలో కొత్త బైకును కొనలేని వారు సరికొత్త ఆఫర్‌తో లభిస్తున్న ఈ బైకును కొత్త ఏడాది కంటే ముందుగానే తమ ఇంటికి తీసుకెళ్లవచ్చు. రాబోయే 2025 ఏడాదిలో కొత్త బైక్‌తో రోడ్లపై రయ్ మంటూ దూసుకుపోవచ్చు. స్క్రాంబ్లర్ 400 ఎక్స్‌పై కంపెనీ దాదాపు రూ.12,500 విలువైన యాక్సెసరీలను అందిస్తోంది. ఈ ఆఫర్ డిసెంబర్ నెల చివరి వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది.
ఈ బైక్‌ను డిసెంబర్‌లో కొనుగోలు చేసిన వారికి కంపెనీ ప్రత్యేక ఆఫర్‌లో భాగంగా ఉచితంగా ట్రయంఫ్ టీ-షర్ట్‌ను అందిస్తుంది. అలాగే, రూ.12,500 విలువైన యాక్సెసరీలలో కోటెడ్ విండ్‌స్క్రీన్, హై మడ్‌గార్డ్ , లగేజ్ ర్యాక్ కిట్ వంటివి ఉన్నాయి. అదనంగా ట్యాంక్ ప్యాడ్, ఇతర వాటిని సైతం అందిస్తుంది. స్క్రాంబ్లర్ 400 ఎక్స్‌ను కంపెనీ స్పీడ్ 400తో పాటే అభివృద్ది చేసింది. ఈ రెండు అమ్మకాల పరంగా మెరుగ్గానే ఉన్నాయి.

ట్రయంఫ్ స్క్రాంబ్లర్ 400X ఆఫ్-రోడ్ రైడింగ్‌కు అనుకూలంగా ఉంటుంది. ఇది 398.15 సీసీ లిక్విడ్-కూల్డ్ ఇంజిన్ ఆధారంగా రన్ అవుతుంది. ఈ ఇంజిన్ 39.5 bhp పవర్‌ను, 37.5 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 6-స్పీడ్ గేర్‌బాక్స్‌తో వస్తుంది. మరో విషయం ఏమిటంటే ఈ మోడల్ ప్లాట్‌ఫారమ్ ఆధారంగా రూపుదిద్దుకున్న స్పీడ్ 400లో కూడా ఇదే ఇంజిన్ ఆప్షన్ ఉంటుంది.
స్క్రాంబ్లర్ 400X ఎత్తుపల్లాలు ఉన్న ప్రాంతాల్లో కూడా ఈజీగా వెళ్తుంది. దీని కోసం ముందు వైపున 43 మిమీ అప్‌సైడ్ డౌన్ ఫోర్క్స్, వెనుక వైపు మోనోషాక్ సస్పెన్షన్ సెటప్‌ను అందించారు. ఫ్రంట్ వీల్ 19 అంగుళాలు, బ్యాక్ వీల్ 17 అంగుళాల వరకు ఉంటుంది. రైడింగ్‌లో స్కిడ్ కాకుండా బైక్ వేగాన్ని నెమ్మదిగా అదుపు చేయడానికి ముందు, వెనుక డిస్క్ బ్రేక్ సెటప్‌ను అమర్చారు.
రైడర్లకు మరింత రక్షణ కోసం డ్యూయల్ ఛానల్ ABS సిస్టం కూడా అందించారు. ఇంకా స్క్రాంబ్లర్ 400Xలో ట్రాక్షన్ కంట్రోల్, సెమీ-అనలాగ్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, స్లిప్-అండ్-అసిస్ట్ క్లచ్ వంటివి కూడా ఉన్నాయి. ఇది వినియోగదారులను ఆకట్టుకోడానికి మ్యాట్ ఖాకీ గ్రీన్- ఫ్యూజన్ వైట్,ఫాంటమ్ బ్లాక్- సిల్వర్ ఐస్, పర్ల్ మెటాలిక్ వైట్, కార్నివాల్ రెడ్- ఫాంటమ్ బ్లాక్ కలర్ వేరియంట్లలో లభిస్తుంది.
ఆఫ్ రోడ్ ప్రయాణాలకు అనువుగా ఉండే స్క్రాంబ్లర్ 400X ప్రస్తుతం అమ్మకాల పరంగా మెరుగైన గణంకాలు సాధిస్తుంది. ఇప్పుడు ఈ కొత్త ఆఫర్ ద్వారా కస్టమర్ల నుంచి మరింత స్పందన వస్తుందని ఈ డిసెంబర్ నెలలో మరిన్ని కొనుగోళ్లను నమోదు చేస్తుందని కంపెనీ భారీ అంచనాలు పెట్టుకుంది. ఈ ఆఫర్‌ను పొందడానికి వినియోగదారులు సమీపంలోని షోరూమ్‌ను సంప్రదించవచ్చు.
ఇయర్ ఎండ్ ఆఫర్ కావడంతో ఇది డిసెంబర్ నెల వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. కాబట్టి వినియోగదారులు బుకింగ్ కోసం త్వరపడటం బెస్ట్. స్క్రాంబ్లర్ 400X మోడల్ రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్ 450,YZ స్క్రాంబ్లర్,KTM 390 అడ్వెంచర్ X,BMW G310 GS వంటి బైకులకు గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications








