రాయల్ ఎన్‌ఫీల్డ్‌కు ఇక ముచ్చెమటలే.. బ్రహ్మాస్త్రాన్ని వదులుతున్న టీవీఎస్.. అదిరిపోతున్న రోనిన్ కొత్త వెర్షన్
ఇండియాలో ప్రముఖ మోటార్‌సైకిల్ సంస్థగా ఉన్నటువంటి TVS కంపెనీ ఎప్పటికప్పుడు ట్రెండ్‌కు అనుగుణంగా కొత్త కొత్త బైకులను విడుదల చేస్తుంది. భారత్‌లో ఇటీవల కాలంలో టూవీలర్ల వాడకం గతంలో కంటే భారీగా పెరిగింది. దీంతె మెజార్టీ మార్కెట్ వాటాను సంపాదించడానికి ఇతర కంపెనీలకు పోటీగా కొత్త మోడల్‌ను తాజాగా ఆవిష్కరించింది. దేశంలోనే అత్యంత అందమైన సముద్ర తీరం కలిగిన గోవాలో వినియోగదారులను ఆకర్షించడానికి TVS Motosoul 2024 (టీవీఎస్ మోటోసౌల్) అనే ప్రోగ్రామ్‌ను నిర్వహిస్తుంది. ఈ ఈవెంట్‌లో 2025 వెర్షన్ TVS రోనిన్ (Ronin) బైక్‌ను శనివారం ఆవిష్కరించింది. అత్యంత ఘనంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో తన రాబోయే బైకును ప్రపంచానికి పరిచయం చేసింది. ఈ 2025 వెర్షన్ రోనిన్ మార్కెట్లోకి విడుదలైన తర్వాత మంచి అమ్మకాలను సాధిస్తుందని కంపెనీ అంచనాలు పెట్టుకుంది.
TVS 2025 రోనిన్ వచ్చే ఏడాదిలో వినియోగదారులకు అలరించడానికి వస్తుంది. దీని ధరల వివరాలను ఈ ఈవెంట్‌లో వెల్లడించలేదు. కొత్త ఏడాది ప్రారంభంలో జరగనున్న ఆటో ఎక్స్‌పోలో టీవీఎస్ అధికారికంగా ప్రకటిస్తుంది. ఈ కొత్త మిడ్-స్పెక్ వేరియంట్ సియర్ సిల్వర్, చార్‌కోల్ ఎంబర్ కలర్ వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది. ప్రస్తుతం మోడల్ డెల్టా బ్లూ, స్టార్‌గేజ్ బ్లాక్ స్థానంలో ఈ కొత్త కలర్స్‌ను కంపెనీ అందించింది.

2025 వెర్షన్ రోనిన్ దేశీయ మార్కెట్లో హోండా CB 350 RS,రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350 వంటి మోడళ్లకు గట్టి పోటీగా నిలుస్తుంది. ఇది 225.9 సీసీ సింగిల్-సిలిండర్ ఇంజిన్ ఆప్షన్‌తో లభిస్తుంది. ఈ ఇంజిన్ 750 rpm వద్ద 20 bhp పవర్, 3,750 rpm వద్ద 19.93 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీనికి 5-స్పీడ్ గేర్‌బాక్స్‌ను జత చేశారు.
ఈ కొత్త రోనిన్ డ్యూయల్-ఛానల్ ABS సిస్టంతో వస్తుంది. ఎత్తుపల్లాలు ఉన్న ప్రాంతాల్లో కూడా సులభంగా ప్రయాణించడానికి ముందు భాగంలో తలక్రిందులుగా ఉన్న ఫోర్క్స్, వెనుక ప్రీలోడ్ అడ్జస్టబుల్ 7 స్టేజ్ మోనోషాక్ సస్పెన్షన్ సెటప్ ఉంది. ఫ్రంట్ 110/70, బ్యాక్ 130/70 వీల్స్‌తో 17 -అంగుళాల అల్లాయ్ వీల్స్‌పై బైక్ రన్ అవుతుంది. ఫ్రంట్ 300 mm డిస్క్, వెనుక కూడా 240 mm డిస్క్‌ను ఏర్పాటు చేశారు.

ప్రస్తుతం అందుబాటులో ఉన్న రోనిన్ మూడు ట్రిమ్‌లలో లభిస్తుంది. బేస్ వేరియంట్ SS రెండు కలర్స్‌లలో రూ.1.35 లక్షల ప్రారంభ ధరతో లభిస్తుండగా, మిడ్-స్పెక్ DS వేరియంట్ మాత్రం రూ.1.57 లక్షల ధరతో, అదే రోనిన్ టాప్ వేరియంట్ TD దాదాపు రూ.1.71 లక్షలకు అందుబాటులో ఉంది. ఇవన్నీ కూడా షోరూమ్ ధరలు.
అయితే రాబోయే కొత్త వెర్షన్ రోనిన్ వీటి కంటే దాదాపు రూ.5 వేల నుంచి రూ.10,000 వరకు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. పాత మోడల్ కంటే కూడా కొత్తది అధునాతన ఫీచర్లతో వస్తుంది. ఈ వెర్షన్ లాంచ్ సందర్భంగా కంపెనీ ఉన్నతాధికారి విమల్ సుంబ్లీ మాట్లాడుతూ, కస్టమర్లకు ఆకట్టుకునే విధంగా ఈ బైక్ ఉందని, రానున్న రోజుల్లో మరిన్ని కొత్త లాంచ్‌లు ఉంటాయని తెలిపారు.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








