మార్కెట్‌లోకి కొత్త టీవీఎస్‌ అపాచీ విడుదల.. ఇది డిజైన్ పరంగా మరింత హాట్, ఫర్ఫామెన్స్‌లో వీర స్మార్ట్‌!

భారత్‌లో టీవీఎస్‌ మోటార్లకు డిమాండ్‌ పెరుగుతోంది. ఈ మోటార్‌సైకిల్స్‌కి సంబంధించిన గత కొన్ని నెలల సేల్స్‌ ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. వీటి డిజైన్‌, సరికొత్త అప్‌గ్రేడ్స్‌ మార్కెట్‌లో టాప్‌ మోడళ్ల ఒకటిగా నిలబెడుతున్నాయి. ఈ మోటార్‌సైకిల్స్‌లో ప్రస్తుతం టీవీఎస్‌ రైడర్‌ అదరొడుతోంది. ఈ 125 సీసీ బైక్‌ ఇటీవలె 10 లక్షల సేల్స్‌ మార్క్‌ని సైతం టచ్‌ చేసింది. ఇక ఈ కంపనీ లైనప్‌లోని అపాచీ సిరీస్‌ బైక్స్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ బైక్‌ భిన్నమైన డిజైన్‌తో ఉంటుంది. అబ్బురపరిచే ఫీచర్లు కూడా ఉన్నాయి. ఈ బైక్‌ని ఎప్పటికప్పుడు అప్‌గ్రేడ్ చేస్తూ మార్కెట్‌లో టీవీఎస్‌ విడుదల చేస్తోంది. తాజాగా ఇది సరికొత్త అవతారంలో వచ్చింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలపై ఓ లుక్కేయండి.

టీవీఎస్ అపాచీ ఆర్‌టీఆర్‌ 160 4వీ మోటార్ సైకిల్‌ని ఇప్పుడు అదనపు ఫీచర్లు, అప్‌గ్రేడ్స్‌తో మార్కెట్‌లో విడుదల చేసింది. ఈ 160సీసీ బైక్‌ ధరను రూ.1.40 లక్షలు (ఎక్స్‌షోరూమ్‌)గా నిర్ణయించారు. 2023 లో ప్రవేశపెట్టిన చివరి అప్‌డేటెడ్‌ట్‌ బైక్‌ కంటే ఇది సుమారు రూ .5,000 ఎక్కువ ధరతో అందుబాటులో ఉంది. అందుకు తగినట్లుగానే ఇందులో ఫీచర్లను పెంచారు.

NewTVS Apache RTR 160 4V Price

ఈ సరికొత్త టీవీఎస్‌ అపాచీలో మెరుగైన రైడింగ్ అనుభవాన్ని అందించడానికి ఈ కొత్త ఫీచర్లు ఉపయోగపడతాయి. ఈ అపాచీలో ఇప్పుడు బ్లూటూత్ కనెక్టివిటీని ఎనేబుల్ చేసే కొత్త టివిఎస్ స్మార్ట్‌ఎక్సోనెక్ట్ (Smartxonnect) TM టెక్నాలజీ లభిస్తుంది. దీంతోపాటు టర్న్ బై టర్న్ నావిగేషన్, కాల్, SMS అలర్ట్స్, వాయిస్ అసిస్ట్ కూడా ఇందులో ఉన్నాయి. టీవీఎస్ అపాచీ ఆర్‌టీఆర్‌ 160 4వీ మోడల్‌కి గ్లైడ్-త్రూ టెక్నాలజీ (GTT) ను జోడించింది.

ఈ టెక్నాలజీ ట్రాఫిక్‌లో ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రయాణించడానికి సహాయపడుతుంది. ఇందులో అడ్జస్టబుల్ బ్రేక్స్‌, క్లచ్ లివర్స్‌ మరింత సౌకర్యవంతంగా ఉన్నాయి. టీవీఎస్ అపాచీ ఆర్‌టీఆర్‌ 1604వీని 3 ఎక్స్టీరియర్ గ్రానైట్ గ్రే, మ్యాట్ బ్లాక్, పెరల్ వైట్ అనే కలర్‌ ఆప్షన్స్‌లో కొనుగోలు చేయవచ్చు. ఇక అందరీ ఫేవరెట్‌ కలర్‌ లైటింగ్ బ్లూ కలర్‌లోనూ దీనిని కొనుగోలు చేయవచ్చు.

New TVS Apache RTR 160 4V Launch

ఇక ముందు భాగంలో మరింత స్పోర్టి లుక్‌ని అందించేందుకు రేస్ గ్రాఫిక్స్, గోల్డెన్ కలర్‌తో అప్‌ అండ్‌ డౌన్‌ (యూఎస్డీ) ఫోర్క్స్‌ ఉన్నాయి. ఇక దూరం నుంచి కూడా బైక్‌ షైనింగ్‌ లుక్‌లో కనిపించేందుకు రెడ్‌ కలర్‌ అల్లాయ్ వీల్స్‌ని అందించారు. అదే విధంగా హెడ్‌లైట్‌, ఫ్యూయల్‌ ట్యాంక్‌ ఇతర కాస్మోటిక్‌ మార్పులు అలానే ఉండనున్నాయి.

దీని లుక్స్ పరంగా భారీ మార్పులు చేసినప్పటికీ టీవీఎస్‌ అపాచీ RTR 160 4వీ ఇంజిన్‌లో ఎటువంటి మార్పులు చేయలేదు. పైన చెప్పిన విధంగా ఈ బైక్‌ అదే 160 సింగిల్ సిలిండర్ ఎయిర్ ఆయిల్ కూల్డ్ ఇంజిన్‌తో పనిచేస్తుంది. ఈ ఇంజిన్ 8,000 rpm వద్ద 17.3 bhp పవర్, 6,500 rpm వద్ద 14.8 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది.

TVS Apache RTR 160 4V

ఈ ఇంజిన్ 5-స్పీడ్ గేర్ బాక్స్‌ ఆప్షన్‌తో జతచేయబడి వస్తుంది. ఇక ఇందులోని అపాచీ ఇంజిన్ రేస్-ట్యూన్డ్ ఫ్యూయల్ ఇంజెక్షన్ (RT-fi) సిస్టమ్ మెరుగైన పవర్ డెలివరీ, మంచి మైలేజీ, ఎక్కువ ఇంజిన్ లైఫ్, వివిధ రైడింగ్‌ పరిస్థితులలో స్థిరమైన ఫర్ఫామెన్స్‌ వంటి వాటిని అందిస్తుంది. దీనిలో సస్పెన్షన్‌ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పనిలేదు. 37 mm USD ఫ్రంట్ సస్పెన్షన్, టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్స్, వెనుక మోనోషాక్ ఉన్నాయి.

240 మిమీ రియర్ డిస్క్ బ్రేక్, డ్యూయల్-ఛానల్ ఏబీఎస్ వంటివి బైక్‌ని ఏక కాలంలో నిలువరించేదుకు సహాయపడతాయి. ఈ అపాచీ ఆర్‌టీర్‌ స్పోర్ట్, అర్బన్, రెయిన్‌ అనే మూడు రైడ్ మోడ్లతో వస్తుంది. ఈ బైక్‌లోని అత్యాధునిక టెక్నాలజీ, మెరుగైన పనితీరు అందిస్తుంది. ఈ బైక్‌ హీరో ఎక్స్‌ట్రీమ్, హోండా సీబీ హార్నెట్ 2.0, బజాజ్ పల్సర్ N 160కి గట్టి పోటీని ఇస్తుంది.

Article Published On: Wednesday, November 20, 2024, 11:08 [IST]
English summary
Tvs apache rtr 160 4v launched with updated features check whats new here
Read more on: #tvs #new apache #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+