జాతీయ జెండా కలర్స్‌తో TVS ఐక్యూబ్‌ స్కూటర్లు, 1000 మందికే లక్కీ ఛాన్స్‌.. బుకింగ్ క్లోజింగ్‌ డేట్‌ తెలుసా?

భారత స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా టీవీఎస్ మోటార్ కంపెనీ తన ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ని లిమిటెడ్ ఎడిషన్‌లో విడుదల చేసింది. ప్రస్తుతం భారతదేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న ఎలక్ట్రిక్ స్కూటర్లలో ఐక్యూబ్ ఒకటిగా ఉంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క కొత్త లిమిటెడ్ ఎడిషన్‌ని మార్కెట్‌లోకి ప్రవేశపెట్టడంతో.. ఈ స్కూటర్‌పై అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. టీవీఎస్ మోటార్ కంపెనీ భారతదేశంలో 2-వీలర్స్ మరియు త్రీ వీలర్స్ తయారీ మరియు అమ్మకందారులలో ఒకటిగా ఉంది. తాజాగా ఈ కంపెనీ విడుదల చేసిన సరికొత్త ఎడిషన్‌కి సంబంధించిన పూర్తి వివరాలు ఈ కథనంలో..

ఈ ఐక్యూబ్ స్కూటర్‌ని 2020 ప్రారంభంలో తమిళనాడు రాష్ట్రంలో హోసూరులోని టీవీఎస్ మోటార్ కంపెనీ ప్లాంట్‌లో ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌ని ప్రారంభించింది. అయితే కొవిడ్‌ వ్యాప్తి కారణంగా టీవీఎస్ ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్ల అమ్మకాలు మొదట్లో పెద్దగా సాధించలేదు. అయితే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లను కొనుగోలు చేసే వారి సంఖ్య ఇటీవలి కాలంలో క్రమంగా పెరుగుతోంది.

TVS-IQube-Celebration-Edition-Launched

డిమాండ్‌కి అనుగుణంగా ఐక్యూబ్ స్కూటర్లను టీవీఎస్‌ ఉత్పత్తి చేస్తుంది. ఈ కంపెనీ స్కూటర్‌ ప్రస్తుతం మార్కెట్‌లో టాప్‌ 5 లో కొనసాగుతుంది. తాజాగా ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌ని కొత్త స్పెషల్ ఎడిషన్‌లో ప్రవేశపెట్టింది. సాధారణంగా స్వాతంత్ర్య దినోత్సవం రోజున టీవీఎస్‌ కచ్చితంగా కొత్త వాహనాలను లాంచ్ చేస్తుంది. ఈ ఏడాది స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని టీవీఎస్ మోటార్ ఐక్యూబ్ సెలెబ్రేషన్‌ ఎడిషన్‌ని (TVS iQube Celebration Edition) విడుదల చేసింది.

ఈ ఐక్యూబ్ స్కూటర్‌ని సెలెబ్రేషన్‌ ఎడిషన్ అనేదాని కంటే లిమిటెడ్ ఎడిషన్ అనడం కరెక్ట్. ఎందుకంటే ఈ సెలబ్రేషన్ ఎడిషన్ బుకింగ్స్ ఆగస్టు 26 వరకు అంటే కేవలం 11 రోజులు మాత్రమే అందుబాటులో ఉంటాయి. అంటే అప్పటి వరకు మాత్రమే ఈ స్కూటర్ బుకింగ్స్‌ని స్వీకరిస్తారు. టీవీఎస్ మోటార్ కంపెనీ ఐక్యూబ్ సెలబ్రేషన్ ఎడిషన్ ఈవీ 1,000 యూనిట్ల స్కూటర్లను విక్రయించిన తర్వాత నిలిపివేయనున్నట్లు సంస్థ ప్రకటించింది.

TVS-IQube-Celebration-Edition-Launched

ప్రస్తుతం ఈ టీవీఎస్ ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్ మొత్తం 5 వేరియంట్లలో లభిస్తుంది. ఆ 5 వేరియంట్లు 2.2 కిలోవాట్స్‌లో స్టాండర్డ్, అలాగే 3.4 కిలోవాట్స్‌లో స్టాండర్డ్, S, ST వేరియంట్స్‌, టాప్‌ వేరియంట్‌ ST 5.1 కిలోవాట్స్‌తో వస్తుంది. అయితే కొత్త సెలెబ్రేషన్ ఎడిషన్‌ని కేవలం 3.4 కిలోవాట్ల బ్యాటరీని కలిగి ఉన్న స్టాండర్డ్ మరియు S వేరియంట్లలో మాత్రమే ప్రవేశపెట్టబడింది.

అంటే కొత్త సెలెబ్రేషన్ ఎడిషన్ ఐక్యూబ్ స్టాండర్డ్, ఎస్ వేరియంట్లలో లభించే అన్ని ఫీచర్లను పొందుతుంది. కొత్త ఐక్యూబ్ స్టాండర్డ్ సెలెబ్రేషన్ ఎడిషన్ ధర రూ.1,19,628 కాగా, ఎస్ సెలెబ్రేషన్ ఎడిషన్ ధర రూ.1,29,420గా ఉంది. కొత్త సెలెబ్రేషన్ ఎడిషన్ స్కూటర్లు డ్యూయల్ కలర్స్‌లో లభిస్తాయి. స్కూటర్ చుట్టూ 'సెలబ్రేషన్ ఎడిషన్' లోగోను అందిచారు.

TVS-IQube-Celebration-Edition-Launched

హ్యాండిల్‌ బార్ రెండు వైపులా చిన్నగా జాతీయ జెండా కలర్స్‌ని అందించారు. కొత్త ఐక్యూబ్ సెలబ్రేషన్ ఎడిషన్ 3.4 కిలోవాట్ల బ్యాటరీతో వస్తుంది. ఇది ఫుల్ ఛార్జ్ చేస్తే 100 కిలోమీటర్ల పరిధిని అందిస్తుంది. టీవీఎస్ ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్ టాప్ స్పీడ్ గంటకు 78 కిలోమీటర్లుగా ఉంది. అంతేకాకుండా ఇందులో 32 లీటర్ల భారీ స్టోరేజీని అందించారు.

డ్రైవ్స్‌పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

More from DriveSpark

Article Published On: Friday, August 16, 2024, 10:28 [IST]
English summary
Tvs iqube celebration edition launched in india at rs 1 19 lakhs check full details here
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+