మార్కెట్‌లో టాప్‌ ఎలక్ట్రిక్‌ స్కూటర్లపై ఏకంగా రూ. 30000 వరకు క్యాష్‌బ్యాక్.. రూ. 2399 EMI కే స్కూటర్‌!

పండుగ సీజన్‌లో వాహన తయారీ సంస్థలు అదిరిపోయే ఆఫర్లను అందిస్తున్నాయి. చాలా వరకు ఈ ఫెస్టివల్‌ ఆఫర్లలో తక్కువ ధరకే మీ వాహనాలను సొంతం చేసుకోవచ్చు. ఎక్కువ మంది వినియోగదారులను ఆకర్షించేలా ఈ పండుగ సీజన్ కోసం ప్రత్యేక ఆఫర్లను టీవీఎస్‌ మోటార్స్‌ (TVS) ప్రకటించింది. ఈ ఆఫర్‌లో కంపెనీ నుంచి అందుబాటులో ఉన్న ఏకైక ఎలక్ట్రిక్ స్కూటర్ ఐక్యూబ్ (iQube Electric Scooter) అమ్మకాలను ప్రోత్సహించడానికి కంపెనీ ప్రత్యేక ఆఫర్ ప్రకటించింది. ఈ స్కూటర్లపై దాదాపు రూ. 30,000 వరకు క్యాష్‌బ్యాక్ ఇవ్వనున్నట్లు ప్రకటించింది. దీనికి సంబంధించిన వివరాలు ఈ కథనంలో..

తాజాగా టీవీఎస్‌ ప్రకటించిన ఆఫర్లపై షరతులు విధించింది. ఈ ఫెస్టివల్‌ స్పెషల్ ఆఫర్ కేవలం రాష్ట్రాల్లో మాత్రమే అందుబాటులో ఉండనుంది. ఆ జాబితాలో తమిళనాడు, పుదుచ్చేరి (UT), ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, రాజస్థాన్, కర్ణాటక, కేరళ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, గుజరాత్, ఒడిశా, మహారాష్ట్ర రాష్ట్రాలు ఉన్నాయి. పైన పేర్కొన్న రాష్ట్రాల్లో మాత్రమే కంపనీ అందించే ఈ ఆఫర్‌ వర్తిస్తుంది.

TVS iQube Electric Scooter Festive Season Offers

అంతేకాకుండా, ఈ ప్రత్యేక ఆఫర్ ఈ నెల 31 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుందని టీవీఎస్‌ స్పష్టం చేసింది. ఈ ఆఫర్‌లో భాగంగా ముందుగా టీవీఎస్ ఐక్యూబ్ S వేరియంట్‌పై (TVS iQube S) రూ. 5999 విలువ చేసే 5 ఏళ్ల వారంటీ లేదా 70000 కిమీ వారంటీ ప్యాక్‌ని అందించనుంది. ఈ వారంటీ ప్లాన్ ఎటువంటి అదనపు ఖర్చు లేకుండా టీవీఎస్‌ అందిస్తుంది.

ఐక్యూబ్ 2.2 kWh వేరియంట్‌పై రూ.17,300, అలాగే ఐక్యూబ్‌ 3.4 వేరియంట్‌పై రూ. 20,000 వరకు క్యాష్‌బ్యాక్‌ లభిస్తుంది. అలాగే జూలై 15 లోపు ఐక్యూబ్ ST వేరియంట్‌ని బుక్ చేసుకున్న కస్టమర్లకు రూ.10,000 లాయల్టీ బోనస్ లభిస్తుంది. అయితే 5.1 కిలోవాట్ లేదా 3.4 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్‌కి మత్రమే ఈ ప్లాన్ వర్తిస్తుంది.

TVS iQube Electric Scooter Latest Price

ఈ టీవీఎస్ ఐక్యూబ్‌ స్కూటర్‌ని ఫైనాన్స్‌ ద్వారా కొనుగోలు చేసే కస్టమర్ల కోసం కొన్ని ప్రత్యేక ఆఫర్లను కూడా ప్రకటించింది. అలాగే ఎంపిక చేసిన బ్యాంక్‌ కార్డులపై రూ.10,000 వరకు డిస్కౌంట్‌ లభిస్తుంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌ని చాలా తక్కువ రూ .7,999 డౌన్ పేమెంట్‌ చెల్లించి కొనుగోలు చేయవచ్చు. కేవలం రూ. 2,399 తక్కువ ఈఎంఐ ప్లాన్‌ని ప్రవేశపెట్టింది.

టీవీఎస్ ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఈ పండుగ సీజన్‌లో మంచి సేల్స్‌ జరుగుతాయని భావిస్తోంది. ఇప్పటికే భారత్‌లో ఈ స్కూటర్లకు మంచి డిమాండ్ ఉండటం కలిసిరానుంది. ప్రస్తుతానికి టీవీఎస్ ఐక్యూబ్ మూడు వేరియంట్లలో అందుబాటులో ఉంది. అవి ఐక్యూబ్, ఐక్యూబ్ S, ఐక్యూబ్ ST. ఇక ఐక్యూబ్ వేరియంట్ 2.2 కిలోవాట్, 3.4 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్ ఆప్షన్లలో, ఐక్యూబ్ S వేరియంట్ 3.4 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్ ఆప్షన్లలో లభిస్తుంది.

ఐక్యూబ్ ST వేరియంట్ 3.4 కిలోవాట్, 5.1 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్‌తో లభిస్తుంది. ఇక అలాగే టీవీఎస్ ఐక్యూబ్ ప్రారంభ ధర రూ. 94,999 నుంచి గరిష్ట ధర రూ. 1.85 లక్షలుగా మధ్య ఉంది. ఇవన్నీ ఎక్స్-షోరూమ్ ధరలు మాత్రమే. ప్రస్తుతం టీవీఎస్ ఐక్యూబ్ ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్లతో పోటీ పడుతోంది. ఫెస్టివల్ సీజన్ స్పెషల్ ఆఫర్‌తో కస్టమర్లను ఆకట్టుకోవాలని భావిస్తోంది.

డ్రైవ్స్‌పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

More from DriveSpark

Article Published On: Thursday, October 10, 2024, 11:41 [IST]
English summary
Tvs iqube electric scooter festive season exciting offers up to rs 30 000 cashback
Read more on: #tvs motor #diwali #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+