ఈ బంపర్ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే.. TVS iQube ఇ స్కూటర్‌పై ఏకంగా రూ. 41,000 భారీ తగ్గింపు
దేశంలో ఎలక్ట్రిక్ టూ వీలర్ల వినియోగం పెరుగుతోంది. కస్టమర్లను ఆకర్షించేందుకు ఈవీ తయారీ సంస్థలు పోటీ పడి మరీ రాయితీలను అందిస్తున్నాయి. ఈ క్రమంలో ప్రముఖ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన తయారీ సంస్థ టీవీఎస్.. తన iQube ఎలక్ట్రిక్ స్కూటర్‌పై ఏకంగా రూ. 41,000 వరకు ప్రయోజనాలను అందిస్తోంది. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే..
భారత్‌లో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక చర్యలు తీసుకుంటోంది. ఈవీల వినియోగాన్ని ప్రోత్సహించేందుకు తయారీదారులకు FAME పథకం ద్వారా సబ్సిడీలను అందిస్తోంది. తద్వారా ఈవీల ధరలు చాలా వరకు తగ్గుతున్నాయి. అంతేకాకుండా కస్టమర్లను పెంచుకునేందుకు ఆయా కంపెనీలు కూడా ఆకర్షణీయమైన ఆఫర్లను తీసుకువస్తున్నాయి.

కాగా దేశంలో ఎలక్ట్రిక్ కార్లతో పోలిస్తే ఇ స్కూటర్లకు క్రేజ్ ఎక్కువగా ఉంటుంది. తక్కువ మెయింటెనెన్స్, లైట్ వెయిట్, ఈజీ హ్యాండ్లింగ్ కారణంగా నగరవాసులు ఎక్కువగా ఎలక్ట్రిక్ స్కూటర్లను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. అంతేకాకుండా మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా ఈవీ కంపెనీలు సైతం అత్యాధునిక ఫీచర్లు, స్టైలిష్ డిజైన్‌తో కొత్త కొత్త మోడళ్లలో స్కూటర్లను తీసుకువస్తున్నాయి.
ఈ క్రమంలో ఈవీల తయారీపై కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న FAME-2 సబ్సిడీ ఈ నెలాఖరుకు ముగియనుంది. ఆ తర్వాత ఎలక్ట్రిక్ వాహనాల ధరలు పెరిగే అవకాశాలు ఉన్నాయి. దీన్ని దృష్టిలో ఉంచుకుని ప్రముఖ ఈవీ తయారీ సంస్థ టీవీఎస్.. తన ఏకైక ఎలక్ట్రిక్ స్కూటర్ ఐక్యూబ్(TVS iQube)పై అదిరిపోయే ఆఫర్లను అందిస్తోంది. అయితే ఈ ఆఫర్ మార్చి 31 వరకే వర్తించనుంది.

మార్చి 31వ తేదీ లోపు టీవీఎస్ iQube(Offers On TVS iQube) ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుగోలు చేసినట్లయితే కస్టమర్లు ఏకంగా రూ. 41 వేలు ఆదా చేసుకోవచ్చని టీవీఎస్ మోటార్స్ ప్రకటించింది. ఈ ప్రయోజనాల్లో రూ. 6000 క్యాష్ బ్యాక్ ఆఫర్ ఉంది. అదే విధంగా నో కాస్ట్ EMIపై కొనుగోలు చేస్తే, రూ. 7500 అదనపు తగ్గింపును పొందవచ్చు.
అదేవిధంగా ఈ టీవీఎస్ ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్‌పై రూ. 5000 విలువైన ఎక్స్‌టెండెడ్ వారంటీ కూడా పూర్తిగా ఉచితంగా సంస్థ అందిస్తోంది. చివరగా FAME 2 సబ్సిడీ కింద ఐక్యూబ్‌పై రూ.22,065 సబ్సిడీని కేంద్రం అందిస్తోంది. ఇవన్నీ కలిపి చూస్తే మొత్తం iQube పై కస్టమర్లు రూ. 41 వేలు ఆదా చేసుకోవచ్చు.
ఇక TVS ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్‌లో ఫీచర్లను పరిశీలించినట్లయితే ఇందులో 7 అంగుళాల TFT టచ్ స్క్రీన్‌తో పాటు క్లీన్ యూఐ ఉంటుంది. ఇన్ఫినిటీ థీమ్ పర్సనలైజేషన్, వాయిస్ అసిస్ట్, అలెక్సా స్కిల్ సెట్, ఇంట్యూటివ్ మ్యూజిక్ ప్లేయర్ కంట్రోల్ వంటి ఫీచర్లు ఉన్నాయి. వీటితో పాటు OTA అప్‌డేట్స్, ప్లగ్-అండ్-ప్లే విత్ ఛార్జర్ ఫాస్ట్ ఛార్జింగ్, సేఫ్టీ ఇన్ఫర్మేషన్, బ్లూటూత్ లాంటి అడ్వాన్స్‌డ్ ఫీచర్లను పొందవచ్చు.
TVS iQube ఎలక్ట్రిక్ స్కూటర్ 3.4kWh బ్యాటరీ ప్యాక్‌ను ఉపయోగించారు. పూర్తి ఛార్జ్‌పై 100 కి.మీ వరకు ప్రయాణించవచ్చు. 32 లీటర్ల స్టోరేజ్ స్పేస్‌ను కలిగి ఉంది. కాగా ఈ స్కూటర్‌కు దేశవ్యాప్తంగా 2.5 లక్షల మంది కస్టమర్లు ఉన్నారు. అందుకే టీవీఎస్ ఐక్యూబ్ ఫ్యామిలీ స్కూటర్‌గా ప్రసిద్ధి చెందింది.
ఈ నెలాఖరుకు FAME- 2 సబ్సిడీ ముగుస్తుండటంతో టీవీఎస్ ఐక్యూబ్‌ను ఇంత భారీ ఆఫర్‌తో సొంతం చేసుకోవడానికి ఇదే సరైన సమయం. ఆ తర్వాత ధరలు భారీగా పెరిగే అవకాశం ఉంది. కాగా టీవీఎస్ iQube రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంది. వేరియంట్లను బట్టి ధరలు మారుతుంటాయి. పూర్తి సమాచారం కోసం సంస్థ అధికారిక వెబ్‌సైట్ లేదా సమీప డీలర్‌షిప్‌ను సందర్శించవచ్చు.


Click it and Unblock the Notifications








