ఇలాంటి ఆఫర్ మళ్లీమళ్లీ రాదు.. ఫ్లిప్‌కార్ట్‌లో ఈ స్కూటర్‌ను భారీ తగ్గింపుతో ఇంటికి తీసుకెళ్లండి!

భారత మార్కెట్లో అత్యంత ప్రజాదరణ ఉన్న ఎలక్ట్రిక్ స్కూటర్ మోడళ్లలో TVS iQube ఒకటి. పెట్రోల్ సెగ్మెంట్ స్కూటర్లతో సమానమైన ఇమేజ్‌ను టీవీఎస్ ఐక్యూబ్ సొంతం చేసుకుంది. లుక్ అండ్ డిజైన్ పరంగా ఫ్యామిలీ ఫేవరెట్ స్కూటర్‌గా కొనసాగుతున్న ఈ ఈవీని కొత్త ఏడాది సందర్భంగా కొనుగోలు చేయాలనుకునేవారికి టీవీఎస్ ఓ సువర్ణావకాశం అందిస్తోంది. అదేంటంటే..

ప్రముఖ ఇ-కామర్స్ వెబ్‌సైట్ ఫ్లిప్‌కార్ట్ ప్రస్తుతం టీవీఎస్ ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్‌పై భారీ తగ్గింపును అందిస్తోంది. ఈ బంపర్ ఆఫర్ ద్వారా TVS iQube ఈవీ కొనుగోలు చేయాలనుకునేవారు.. 2.2 kW వేరియంట్‌ను కేవలం రూ. 85,000కి పొందే అవకాశాన్ని కల్పిస్తోంది. కాగా భారత మార్కెట్లో ఈ ఎంట్రీ-లెవెల్ iQube మోడల్ ధర రూ. 94,999(ఎక్స్-షోరూమ్) గా ఉంది.

TVS iQube EV Flipkart Offer

అంటే ఇప్పుడు ఫ్లిప్‌కార్ట్ ద్వారా TVS iQube ఇ-స్కూటర్‌ను కొనుగోలు చేసినట్లయితే.. ఏకంగా మీరు రూ. 10,000 ఆదా చేసుకోవచ్చు. ఫ్లిప్‌కార్ట్ ఇయర్-ఎండ్ ఆఫర్‌లో భాగంగా, TVS iQube 2.2 kW వేరియంట్‌ను రూ. 85,000కి మీరు ఇంటికి తీసుకెళ్లొచ్చు. అయితే డిసెంబర్ 20 నుంచి 25 వరకు మాత్రమే ఈ ఆఫర్ అందుబాటులో ఉటుందది. అంటే ఈ ఆఫర్ ఇంకా రెండ్రోజులు మాత్రమే ఉంది.

డిస్కౌంట్‌లకు ముందు ఫ్లిప్‌కార్ట్‌లో TVS iQube ఎక్స్-షోరూమ్ ధర రూ.1,03,299. కానీ Flipkart యొక్క #justforyou తగ్గింపుతో, స్కూటర్ ధర రూ. 4000 తగ్గింది. ఇది కాకుండా, రూ. 20,000 కంటే ఎక్కువ కొనుగోళ్లపై కార్ట్‌కు రూ. 12,300 అదనపు తగ్గింపు లభిస్తుంది.

TVS iQube EV Flipkart Offer

ఇంకా ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ క్రెడిట్ కార్డును ఉపయోగించి వాహనాన్ని కొనుగోలు చేసేటప్పుడు, టీవీఎస్ ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్ తుది ధర కేవలం రూ. 85,380కే అందుబాటులో ఉంటుంది. అంటే ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ క్రెడిట్ కార్డ్ ద్వారా కస్టమర్లకు రూ. 5,619 తగ్గింపును అందిస్తోంది.

కాగా TVS iQube 2.2 kWh, 3.4 kWh అనే రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంది. దీని ఎంట్రీ-లెవెల్ వేరియంట్ భారతదేశంలో బెస్ట్ సెల్లర్‌గా దూసుకుపోతోంది. 2.2 kWh బ్యాటరీ ప్యాక్‌తో వస్తున్న TVS iQube 2 గంటల 45 నిమిషాల్లో 0-80 శాతం ఛార్జింగ్ పూర్తవుతుంది. ఈ బ్యాటరీ ప్యాక్ పూర్తి ఛార్జ్‌పై సుమారు 75 కి.మీ రేంజ్‌ని అందిస్తుందని కంపెనీ పేర్కొంది.

TVS iQube ఎలక్ట్రిక్ స్కూటర్ 4.4 kW శక్తిని ఉత్పత్తి చేయగల మోటారుతో పనిచేస్తుంది. ఇది గరిష్ఠంగా 140 Nm వరకు టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. TVS iQube EV గరిష్ఠ వేగం 75 kmph. ఫీచర్ల పరంగా ఇందులో ఆకట్టుకునే ఫీచర్లు ఉన్నాయి.

5-అంగుళాల కలర్ TFT స్క్రీన్, ఫ్రంట్ డిస్క్ బ్రేక్‌లు, 30-లీటర్ అండర్ సీట్ స్టోరేజ్, వెహికల్ క్రాష్ హెచ్చరికలు, టర్న్-బై-టర్న్ నావిగేషన్, పార్క్ అసిస్ట్, USB ఛార్జింగ్ పోర్ట్, రిమోట్ ఛార్జింగ్ స్టేటస్ ఇంకా ఇతర కనెక్ట్ చేయబడిన ప్రధాన ఫీచర్లు ఉన్నాయి.

టీవీఎస్ iQube 2.2 kWh వేరియంట్ వాల్‌నట్ బ్రౌన్, పెరల్ వైట్‌ కలర్స్ ఎంపికలలో అందుబాటులో ఉంది. బ్రేకింగ్ కోసం 220 mm ఫ్రంట్ డిస్క్, 130 mm వెనుక డ్రమ్‌ను కలిగి ఉంది. ఎలక్ట్రిక్ స్కూటర్ గ్రౌండ్ క్లియరెన్స్ 157 మిమీ, సీటు ఎత్తు 770 మిమీ. ఈవీ సెగ్మెంట్లో ఐక్యూబ్.. ఓలా ఎస్1, బజాజ్ చేతక్, ఈథర్ రిస్టా వంటి దిగ్గజాలకు గట్టిపోటీనిస్తోంది.

More from DriveSpark

Article Published On: Monday, December 23, 2024, 19:08 [IST]
English summary
Tvs iqube electric scooter limited time period offer available at rs 85000 in flipkart check details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+