బజాజ్‌ చేతక్‌ వర్సెస్‌ టీవీఎస్‌ ఐక్యూబ్‌ స్కూటర్లలో ఏదీ బెస్ట్‌? రెండింటీ మధ్య ఫీచర్లు, ధర, రేంజ్‌ తేడాలు ఇవే!

దేశంలో ఎలక్ట్రిక్ స్కూటర్లు విరివిగా లభిస్తున్నాయి. ఇప్పటికే చాలా సంస్థలు మార్కెట్‌లో తమ కంపెనీ లైనప్‌లను జనాల్లోకి తీసుకెళ్లడంలో సక్సెస్‌ అయ్యాయి. టాప్‌ కంపెనీలతో పాటు కొత్త స్టార్టప్‌లు కూడా మార్కెట్‌లోకి హై రేంజ్‌తో పాటు ఆకర్షణీయమైన ఫీచర్లను అందిస్తూ కస్టమర్లను ఆకట్టుకుంటున్నాయి. ఇతర పేరొందిన కంపెనీలు సైతం ఎలక్ట్రిక్ స్కూటర్ల ఉత్పత్తిలో నిమగ్నమయ్యాయి. కొత్త కంపెనీల రాకతో మార్కెట్‌లో కాంపిటీషన్‌ రోజు రోజుకు పెరుగుతూ వస్తుంది. ప్రస్తుతం ఎలక్ట్రిక్ స్కూటర్ల తయారీలో టీవీఎస్ మోటార్, బజాజ్ చేతక్ టాప్‌-5 లో ఉన్నాయి. ఈ రెండూ సంస్థల నుంచి టీవీఎస్ ఐక్యూబ్ (TVS iQube), బజాజ్ చేతక్ (Bajaj Chetak) ఎలక్ట్రిక్ స్కూటర్లను విక్రయిస్తున్నాయి. రెండూ ఒకే ధర వద్ద కొనుగోలుకి ఉన్నప్పటికీ.. వీటిలో చాలా తేడాలు ఉన్నాయి.

డిజైన్‌: లుక్స్ పరంగా ఈ రెండు ఎలక్ట్రిక్ స్కూటర్లు డిఫరెంట్‌గా ఉంటాయి. ఎందుకంటే టీవీఎస్ ఐక్యూబ్ మోడ్రన్ లుక్‌ని కలిగి ఉంది. కానీ బజాజ్ చేతక్ పాత స్కూటర్ల మాదిరిగానే క్లాసిక్ స్కూటర్‌లా కనిపిస్తుంది. 2020లో బజాజ్ ఆటో తన మొదటి ఎలక్ట్రిక్ స్కూటర్‌ని మార్కెట్‌లోకి తీసుకువచ్చింది. ఇది 1980, 90 లలో ప్రాచుర్యం పొందిన బజాజ్ చేతక్ పేరుతో పాటు అదే లుక్‌తో విడుదల చేసింది.

TVS iQube Electric Vs Bajaj Chetak Comparision

ఇక టీవీఎస్ ఐక్యూబ్ కూడా 2020లో లాంచ్ అయింది. బజాజ్ చేతక్ టీవీఎస్ ఐక్యూబ్ కంటే కొంచెం పొడవుగా ఉంటుంది. హెడ్‌లైట్ల డిజైన్‌లోనూ మార్పులు ఉన్నాయి. కానీ రెండింటికీ అల్లాయ్ వీల్స్ అమర్చారు. ఐక్యూబ్‌లో BLDC మోటార్‌ని అందించినందున, స్కూటర్ వెనుక చక్రంపై మోటార్ అందించబడుతుంది. బజాజ్‌ చేతక్‌ టెయిల్‌లైట్‌తో వెనక భాగం పొడవుగా ఉంటుంది.

ఫీచర్లు: టీవీఎస్ ఐక్యూబ్‌ 7 ఇంచెస్‌ టచ్‌స్క్రీన్‌ TFT స్క్రీన్‌ వస్తుంది. ఇందులో ఇది టర్న్-బై-టర్న్ నావిగేషన్, మొబైల్ ఫోన్ కాల్స్, SMS & సోషల్ మీడియా నోటిఫికేషన్లు, డాక్యూమెంట్‌ స్టోరేజ్, మ్యూజిక్ కంట్రోల్, ఓవర్-ది-ఎయిర్ అప్డేట్స్, క్లస్టర్‌ థీమ్స్‌ని మీకు నచ్చినట్లు మార్చుకోవచ్చు. ఇలా మరెన్నో స్మార్ట్ ఫీచర్లను ఇందులో పొందవచ్చు.

TVS iQube Electric Vs Bajaj Chetak Comparision

ఇక బజాజ్ చేతక్‌లో టర్న్ బై టర్న్ నావిగేషన్, ఆన్ బోర్డ్ మ్యూజిక్ కంట్రోల్, కాల్ అలర్ట్స్ తదితర ఫీచర్లు ఉన్నాయి. చేతక్ TaCPaC అనే అదనపు ఫీచర్‌ని కూడా అందిస్తుంది. దీన్ని పొందడానికి మీరు అదనంగా డబ్బు చెల్లించాల్సి ఉంటుంది. ఇది హిల్ హోల్డ్ కంట్రోల్ మరియు రివర్స్ మోడ్స్‌కి అనుమతిస్తుంది.

రేంజ్‌: టీవీఎస్ ఐక్యూబ్ 3 బ్యాటరీ ఆప్షన్లలో లభిస్తుంది. అయితే బజాజ్ చేతక్‌లో కేవలం ఒకే ఒక్క బ్యాటరీ ఆప్షన్ ఉంది. ఐక్యూబ్ 3.2 కిలోవాట్ల బ్యాటరీని చేతక్‌లో అందించిన 3.2 కిలోవాట్ల బ్యాటరీతో పోల్చి చూస్తే, రెండు స్కూటర్లు అందించే రేంజ్‌లో పెద్దగా తేడా లేదు.

ఐక్యూబ్ 3.2 కిలోవాట్ల బ్యాటరీని ఫుల్ ఛార్జ్ చేస్తే 100 కిలోమీటర్ల నుంచి 120 కిలోమీటర్ల రేంజ్‌ వరకు ప్రయాణించగలదు. మరోవైపు బజాజ్ చేతక్ బైక్ ఇదే బ్యాటరీ ఆప్షన్‌లో 126 కిలోమీటర్ల రేంజ్‌ ఇస్తుంది. రెండు ఎలక్ట్రిక్ స్కూటర్లు హోమ్ ఛార్జింగ్ సదుపాయంతో వస్తాయి.

ధర: టీవీఎస్ ఐక్యూబ్ బజాజ్ చేతక్ రెండింటి ధరలు దాదాపు ఒకేలా ఉన్నాయి. ఐక్యూబ్ ఎలక్ట్రిక్ 5 వేరియంట్లు మరియు 3 బ్యాటరీ ఆప్షన్‌లో లభిస్తుంది. దీని ధర రూ .1.17 లక్షలు (ఎక్స్-షోరూమ్) నుంచి ప్రారంభమవుతుంది. 2.2 కిలోవాట్ల బ్యాటరీ కలిగిన బేసిక్‌ ఐక్యూబ్ స్కూటర్ ధర రూ.1.17 లక్షలుగా ఉంది. మరోవైపు బజాజ్ చేతక్ ఎక్స్-షోరూమ్ ధరలు రూ .1.10 లక్షల నుంచి ప్రారంభమవుతాయి.

More from DriveSpark

Article Published On: Monday, August 19, 2024, 12:47 [IST]
English summary
Tvs iqube electric vs bajaj chetak price and features comparison details telugu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+