ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ కొనేవారికి అదిరిపోయే ఆఫర్‌.. ఆ తేదీలలో కొంటే 100% క్యాష్‌బ్యాక్‌, రోజుకో విన్నర్‌!

టీవీఎస్‌ మోటార్స్‌ నుంచి అందుబాటులో ఉన్న ఏకైక ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ సేల్స్‌లో సత్తా చాటుతోంది. తాజాగా ఈ స్కూటర్‌ సరికొత్త రికార్డుని నెలకొల్పింది. ఇప్పటి వరకు మొత్తం 4,50,000 యూనిట్లకు పైగా ఐక్యూబ్ ఈ-స్కూటర్లను కంపెనీ విక్రయించింది. 2020 జనవరిలో ఈ స్కూటర్‌ని మార్కెట్‌లో టీవీఎస్‌ ప్రవేశపెట్టింది. అప్పటి నుంచి సేల్స్‌లో ప్రతీ నెల టాప్‌ 5లో కొనసాగుతూ వస్తోంది. ఈ రికార్డుని చేరుకోవడంతో మరింత సేల్స్‌ని పెంచేందుకు ఐక్యూబ్ మిడ్‌నైట్‌ కార్నివాల్ పేరుతో సేల్స్ ఫెయిర్ నిర్వహించాలని కంపెనీ నిర్ణయించింది.

10 రోజుల పాటు జరిగే ఈ ఫెయిర్‌ని ఇప్పటికే కంపెనీ అధికారికంగా ప్రారంభించింది. ఈ డిసెంబర్ 22 రాత్రి 11:59 గంటల వరకు అమల్లోకి వస్తుంది. ఈ ఫెయిర్‌లో అదృష్టవంతులు కొత్త టీవీఎస్ ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ కొనుగోలుపై ఏకంగా 100% క్యాష్‌బ్యాక్‌ ఆఫర్‌ని పొందుతారు. ప్రతీ రోజు ఈ 'టీవీఎస్ ఐక్యూబ్ మిడ్‌నైట్‌ కార్నివాల్' ఫెయిర్‌లో గెలిచిన కస్టమర్లకు ఈ క్యాష్‌బ్యాక్‌ వస్తుంది.

ఇది వరకే ఈ ఐక్యూబ్ ఈ-స్కూటర్‌ని బుక్ చేసుకున్న కస్టమర్లందరూ 'మిడ్ నైట్ కార్నివాల్' ఆఫర్‌కి అర్హులు. దీనికి సంబంధించి మీకు ఏదైనా గందరగోళం నెలకొంటే మీ అధికారిక వెబ్‌సైట్‌ లేదా సమీప డీలర్‌షిప్‌ని సందర్శించడం ద్వారా మరిన్నీ వివరాలు తెలుసుకోవచ్చు. కావున ఈ మిడ్‌నైట్‌ సేల్‌లో అదృష్టం మిమ్మల్నీ కూడా వరించే ‌అవకాశం ఉంటుంది. కావున ఈ సేల్‌పై ఓ కన్నేయండి.

దీనితో పాటు టీవీఎస్ ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుగోలుదారులకు 3.4 కిలోవాట్ (kWh) వేరియంట్‌పై 5 సంవత్సరాలు లేదా 70,000 కిలోమీటర్ల వారంటీని సైతం అందిస్తుంది. అదే విధంగా 2.2 కిలోవాట్ వేరియంట్‌పై 5 సంవత్సరాలు లేదా 50,000 కిలోమీటర్ల వారంటీతో వస్తుంది. ప్రస్తుతం ఈ 'టీవీఎస్ ఐక్యూబ్' ఎలక్ట్రిక్ స్కూటర్ దేశీయ మార్కెట్‌లో వివిధ బ్యాటరీ (5.1 kWh) వేరియంట్లలో అందుబాటులో ఉంది.

TVS iQube Offer

ఈ టీవీఎస్‌ ఐక్యూబ్ ఇ-స్కూటర్ 2.2 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్‌ ఎంట్రీ లెవల్ మోడల్ ఆన్‌రోడ్‌ ధర రూ.1.14 లక్షలుగా ఉంది. ఇది ఫుల్ ఛార్జ్‌పై 75 కిలోమీటర్ల రేంజ్‌ని అందిస్తుంది. దీని గరిష్ట వేగం గంటకు 75 కిలోమీటర్లుగా ఉంది. ఇక టీవీఎస్ ఐక్యూబ్ ST 3.4 కిలోవాట్ల బ్యాటరీతో వచ్చే స్కూటర్‌ ఆన్-రోడ్‌ ధర రూ .1.43 లక్షలుగా ఉంది.

ఇది ఫుల్ ఛార్జ్ చేస్తే 100 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. దీని గరిష్ట వేగం గంటకు 78 కిలోమీటర్లుగా ఉంది. ఇక ST 5.1 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్ ఆన్-రోడ్‌ ధర రూ .1.93 లక్షలుగా ఉంది. ఇది ఫుల్‌ ఛార్జ్‌పై 150 కిలోమీటర్ల రేంజ్‌ని అందిస్తుంది. దీని గరిష్ట వేగం గంటకు 82 కిలోమీటర్లుగా ఉంది.

TVS iQube Midnight Carnival

ఇందులో 7 అంగుళాల ఫుల్ కలర్ TFT స్క్రీన్‌తో పాటు పార్కింగ్‌ అసిస్ట్‌, మోబైల్‌ కనెక్టివిటీ ద్వారా లైవ్‌ లొకేషన్, క్రాష్ లేదా ఫాల్‌ అలర్ట్‌ కనిపిస్తుంది. ఈ ఐక్యూబ్ స్కూటర్‌ని నవంబర్-2024 26,292 యూనిట్లను విక్రయించింది. 2023 నవంబర్‌లో 16,782 యూనిట్ల అమ్మకాలతో పోలిస్తే సేల్స్‌ 57 శాతం వృద్ధి నమోదు చేసింది. ఈ స్కూటర్‌ని గతంలో 1000 యూనిట్లలో ట్రైకలర్‌ ఆప్షన్‌లో విక్రయించారు.

డ్రైవ్‌స్పార్క్‌ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

More from DriveSpark

Article Published On: Thursday, December 12, 2024, 18:38 [IST]
English summary
Tvs iqube midnight carnival celebration starts from december 12 check details here
Read more on: #tvs #limited offer #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+