దేశంలోనే అతి పెద్ద బ్యాటరీ ఆప్షన్‌ టీవీఎస్‌ ఐక్యూబ్‌ స్కూటర్‌ డెలివరీలు షురూ.. వారికి రూ. 10,000 బోనస్‌

టీవీఎస్‌ ఐక్యూబ్‌ ఎస్‌టీ ట్రిమ్‌ (TVS iQube ST) వేరియంట్‌ యొక్క డెలివరీలను ఆ సంస్థ ప్రారంభించింది. ఈ స్కూటర్‌ని ఆవిష్కరించిన రెండు సంవత్సరాల తర్వాత ప్రస్తుతం అందుబాటులోకి తీసుకువచ్చింది. ఐక్యూబ్‌ సిరీస్‌లో ఇది టాప్‌ వేరియంట్‌గా ఉంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఐక్యూబ్ స్కూటర్ల కంటే ఎక్కువ పరిధిని కూడా అందించనుంది.
అయితే ఈ స్కూటర్‌ కొనుగోలు చేసే వారికి ఆ సంస్థ బంఫర్‌ ఆఫర్‌ని ప్రకటించింది. జూలై 15, 2022 లోపు ఎలక్ట్రిక్ స్కూటర్‌ని బుక్ చేసుకున్న వినియోగదారులకు ప్రత్యేక లాయల్టీ బోనస్‌ని అందించనున్నట్లు టీవీఎస్ ప్రకటించింది. అంటే తొలి 100 మంది కస్టమర్లకు రూ. 10,000 లాయల్టీ బోనస్ లభిస్తుంది. ప్రస్తుతం టీవీఎస్ మోటార్ కంపెనీ ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్లను దేశ వ్యాప్తంగా విక్రయిస్తుంది.

TVS-Iqube

భారతదేశంలో టీవీఎస్ నుంచి వచ్చిన ఏకైక ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనం ఇది. ఇది భారతదేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న ఎలక్ట్రిక్ స్కూటర్ మోడళ్లలో ఒకటిగా ఉంది. దేశంలో ఓలా ఎలక్ట్రిక్, ఏథర్‌ ఎనర్జీ తర్వాత అత్యధికంగా అమ్ముడైన ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల జాబితాలో టీవీఎస్‌ ఐక్యూబ్ ఉంది. ఇంకా నెలనెలా ఈ కంపెనీ సేల్స్‌ పెరుగుతూ వస్తున్నాయి. తాజాగా విడుదలైన ఈ స్కూటర్‌ వేరియంట్‌తో సేల్స్‌ మరింత పెరిగే అవకాశం ఉంది.

ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను పూర్తి అప్‌డేట్‌లతో టీవీఎస్‌ మార్పు చేసింది. తాజా స్కూటర్‌తో టీవీఎస్ ఐక్యూబ్ ఇప్పుడు ఐదు వేరియంట్లలో అందుబాటులోకి వచ్చింది. TVS iQube 2.2 kWh, TVS iQube 3.4 kWh, TVS iQube S 3.4 kWh, TVS iQube ST 3.4 kWh, TVS iQube ST 5.1 kWh వేరియంట్లలో లభ్యం కానున్నాయి.

TVS-Iqube-Electric-Scooter

ఎంట్రీ లెవల్ ఐక్యూబ్ స్కూటర్‌ రెండు బ్యాటరీ ప్యాక్ ఆప్షన్లలో లభిస్తుంది. ఐక్యూబ్ S వేరియంట్ సింగిల్ బ్యాటరీ ప్యాక్ ఆప్షన్‌తో వస్తుంది. ఇక హై-ఎండ్ ఐక్యూబ్ ST రెండు బ్యాటరీ ప్యాక్ ఆప్షన్‌లతో కొనుగోలుకు అందుబాటులో ఉండనుంది. ఐక్యూబ్ ST లోని 5.1 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్ భారత్‌లోనే అతిపెద్ద బ్యాటరీ ప్యాక్ ఆప్షన్‌గా ఉంది.

ఐక్యూబ్ 2.2 కిలోవాట్ వేరియంట్ ధర రూ. 97,307గా ఉంది. ఐక్యూబ్ 3.4 కిలోవాట్ల వేరియంట్ ధర రూ. 1.19 లక్షలుగా. ఐక్యూబ్ S 3.4 కిలోవాట్ల వేరియంట్ ధర రూ.1.29 లక్షలుగా కంపెనీ నిర్ణయించింది. హైలెవల్ ఐక్యూబ్ ST వేరియంట్‌లోని 3.4 కిలోవాట్ల ధర రూ. 1.56 లక్షలుగా ఉంది.

టాప్‌ వేరియంట్‌లోని 5.1 కిలోవాట్ ఆప్షన్‌ స్కూటర్‌ ధర రూ. 1.86 లక్షలుగా ఉన్నాయి. అన్నీ ఎక్స్ షోరూమ్ ధరలే. 5.1 కిలోవాట్ల సామర్థ్యం కలిగిన స్కూటర్‌ని ఒక్కసారి ఛార్జ్ చేస్తే 150 కిలోమీటర్ల రేంజ్‌ అందిస్తుంది. 3.4 కిలోవాట్ల వేరియంట్‌ని ఒక్కసారి ఛార్జ్ చేస్తే 100 కిలోమీటర్లు ప్రయాణించవచ్చు. ఇక 5.1 కిలోవాట్ల వేరియంట్ గంటకు 82 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది.

టీవీఎస్ ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్‌లలో బ్లూటూత్ కనెక్టివిటీతో ఈ స్కూటర్‌ని పూర్తిగా లింక్‌ చేసుకోవచ్చు. సైడ్ స్టాండ్ ఇండికేషన్, పార్క్ అసిస్ట్, మ్యూజిక్ కంట్రోల్, జియో ఫెన్సింగ్, యాంటీ థెఫ్ట్ టెక్నాలజీ, సెల్‌ఫోన్‌ని ఛార్జ్ చేయడానికి సహాయపడే USB ఛార్జర్ పాయింట్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఇంకా మరెన్నో స్మార్ట్‌ ఫీచర్లు ఈ స్కూటర్‌లో పొందవచ్చు.


డ్రైవ్స్‌పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

More from DriveSpark

Article Published On: Wednesday, May 29, 2024, 13:40 [IST]
English summary
Tvs iqube st variant deliveries begin you can get rs 10000 loyalty bonus
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+