సరికొత్త అవతారంలో వస్తున్న టీవీఎస్ జూపిటర్.. హోండా యాక్టివాకు ఇక కష్టాలే!
జూపిటర్ 110 (Jupiter 110)ను టీవీఎస్ మోటార్ కంపెనీ ఈ నెల 22 న భారతదేశంలో లాంచ్ చేయనుంది. ఈ అప్‌డేటెడ్ సరికొత్త స్కూటర్ డిజైన్‌తో పాటు పలు మార్పులను చేయనున్నారు. ఇప్పుడున్న 125 సీసీ కంటే భిన్నంగా పూర్తిగా కొత్త లుక్‌లో ఈ స్కూటర్ అందుబాటులోకి రానుంది. ఈ స్కూటర్ ద్వారా ఈ పండుగ సీజన్‌లో మాస్ మార్కెట్‌ని టార్గెట్ చేయాలని టీవీఎస్ భావిస్తుంది. సరికొత్త అడ్వాన్స్‌డ్ టెక్నాలజీతో ఇందులో భారీ మార్పులు చేయనున్నారు. త్వరలో విడుదల కాబోయే ఈ స్కూటర్‌లో ఎటువంటి ఫీచర్లను జోడించనున్నారు? ఇంజిన్ ఆప్షన్స్ ఎలా ఉండనున్నాయో ఈ కథనంలో తెలుసుకుందాం..
సరిగ్గా వారం రోజుల క్రితమే టీవీఎస్ మోటార్ కంపెనీ లైనప్‌లోని ఫేమస్ స్కూటర్ ఎన్‌టార్క్ (TVS Ntorq)ని అప్‌డేటెడ్ కలర్ ఆప్షన్స్ చిన్నపాటి మార్పులతో మార్కెట్‌లోకి విడుదల చేసింది. తాజాగా కంపెనీలో ఫేమస్ స్కూటర్ జూపిటర్‌ని 110 సీసీ సెగ్మెంట్‌లో తీసుకువస్తుంది. దీంతో మార్కెట్‌లో ఈ సారి గట్టి పోటీని ఇవ్వాలని చూస్తుంది. ఈ కొత్త స్కూటర్‌ని ఈ నెల 22న లాంచ్ చేయనుంది.

త్వరలో విడుదల కాబోయే స్కూటర్‌పై పూర్తి సమాచారం తెలియ రాలేదు. అయితే మీడియా లీక్స్, ఇతర నివేదికల ప్రకారం మాకు కొంత ముఖ్యమైన సమాచారం లభించింది. దీని ప్రకారం స్కూటర్ ముందు భాగంలో సిస్టమ్లో వెడల్పాటి ఎల్ఈడీ DRLs ను అమర్చారు. ప్రస్తుత మోడల్‌తో పోలిస్తే, ఈ స్కూటర్ కొత్త అప్‌డేట్స్ వివిధ డిజైన్ అప్‌డేట్స్‌తో పూర్తిగా కొత్త లుక్‌లో కనిపించనుంది.
ముఖ్యంగా, ఈ స్కూటర్ ముందు భాగంలో పెద్ద ఎత్తున మార్పులు జరిగే అవకాశం ఉంది. ఇది కాకుండా, సైడ్ మరియు రియర్ డిజైన్‌లోనూ చాలా మార్పులు ఉన్నట్లు తెలుస్తోంది. టీవీఎస్ అభిమానులకు ఈ పండుగ సీజన్ సరికొత్త అనుభూతి అనే చెప్పాలి. రెండు ఫేమస్ స్కూటర్లలో ఇప్పటికే ఎన్‌టార్క్ మార్కెట్‌లో విడుదలవ్వగా ఇప్పుడు జూపిటర్ రాక కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

టీవీఎస్ మోటార్ కంపెనీ 2013 సెప్టెంబరులో తొలిసారిగా టీవీఎస్ జూపిటర్‌ని విడుదల చేసింది. అప్పటి నుంచి ఈ స్కూటర్ భారత మార్కెట్లో అత్యధికంగా అమ్ముడవుతున్న స్కూటర్ల జాబితాలో ఒకటిగా ఉంది. టీవీఎస్ జూపిటర్ నేరుగా హోండా యాక్టివా, హీరో డియో వంటి స్కూటర్లకు గట్టి పోటీని ఇస్తుంది.
ఈ టీవీఎస్ జూపిటర్ 110 స్కూటర్ 109.7 సీసీ ఎయిర్ కూల్డ్, సింగిల్ సిలిండర్ ఇంజిన్ (ET-Fi) air-cooled engine with Ecothrust Fuel injection technologyతో పనిచేయనుంది. ఇది 7.77bhp పవర్ మరియు 8.8nm టార్క్‌ని ప్రొడ్యూస్ చేస్తుంది. అయితే ప్రస్తుతం 125 స్కూటర్ ధర రూ.77,100 నుంచి రూ.92,700 వరకు ఉంది.

ప్రస్తుతం అమ్మకానికి ఉన్న స్కూటర్ సస్పెన్షన్ కంటే బ్రేకింగ్ ఫీచర్లలో భారీ మార్పులు జరిగే అవకాశం ఉంది. దీంతో స్కూటర్ పనితీరును మెరుగుపడనుంది. టీవీఎస్ ఇప్పటికే తన జూపిటర్ స్కూటర్‌లోని స్మార్ట్ ఎక్స్‌కనెక్ట్‌ని అందిస్తోంది. రాబోయే అప్‌డేట్ మోడల్ కూడా అదే కనెక్టివిటీ ఫీచర్‌ని కలిగి ఉంటుందని భావిస్తున్నారు. ఇందుకోసం పూర్తిగా డిజిటల్ ఇన్‌స్ట్రూమెంట్ క్లస్టర్‌ని ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు.
భారతదేశంలో స్కూటర్ మార్కెట్ వేగంగా విస్తరిస్తుంది. ప్రజలు పెట్రోల్ స్కూటర్ల కంటే ఎలక్ట్రిక్ స్కూటర్లను ఇష్టపడుతున్నప్పటికీ, పెట్రోల్ స్కూటర్లు ఇప్పటికీ ప్రజాదరణ కోల్పోవడం లేదు. సంఖ్యాపరంగా చూస్తే పెట్రోల్ స్కూటర్లే అత్యధికంగా అమ్ముడవుతున్నాయి. పెట్రోల్ స్కూటర్ల వైపు ప్రజలను ఆకర్షించడానికి వాహన తయారీదారులు నిరంతరం ఇలాంటి అప్డేట్లను అందిస్తే సేల్స్ మరింత పెరిగే అవకాశం ఉంటుంది.


Click it and Unblock the Notifications








