టీవీఎస్ జూపిటర్ లేదా ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్‌లలో ఏది బెస్ట్? కీలక తేడాలు ఇవే!!
టీవీఎస్ లైనప్ నుంచి మంచి మైలేజీ, రేంజ్ అందించే ఎలక్ట్రిక్ స్కూటర్లు అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతం ఈ కంపెనీ సేల్‌లో ఉన్న స్కూటర్లను కొనుగోలు చేయాలో తెలియక జనాలు కాస్త అయోమయంలో ఉంటున్నారు. ముఖ్యంగా ఆ సంస్థ నుంచి అందుబాటులో ఉన్న ఫ్యామిలీ స్కూటర్ జూపిటర్, ఐక్యూబ్‌లు రెండు మంచి డిమాండ్‌ని కలిగి ఉన్నాయి. ఈ రెండింటి మధ్య అతిపెద్ద వ్యత్యాసం ఏమిలేదు. కాకపోతే ఒక స్కూటర్ పెట్రోల్ ఆధారితం, మరొకటి ఎలక్ట్రిక్ మోటార్‌తో నడుస్తాయి. టీవీఎస్ నుంచి అందుబాటులో ఉన్న ఈ రెండు స్కూటర్లకు సంబంధించి కీలక తేడాలు మీకోసం.. ఈ కథనం చదివిన తర్వాత ఏ స్కూటర్ కొనుగోలు చేయాలో మీరే తేల్చుకోండి.
ఇన్‌స్ట్రూమెంట్ కన్సోల్: టీవీఎస్ జూపిటర్ 125 డిస్క్ మరియు డ్రమ్ వేరియంట్‌లో అందుబాటులో ఉంది. దీని ఇన్‌స్ట్రూమెంట్ కన్సోల్‌లో ఎడమ వైపున అనలాగ్ స్పీడోమీటర్ మరియు కుడి వైపున LCD స్క్రీన్‌తో సెమీ-డిజిటల్ ఇన్‌స్ట్రూమెంట్ కన్సోల్ గమనించవచ్చు. ఓడోమీటర్, ట్రిప్ మీటర్, డిస్టెన్స్ మరియు ఎకో/పవర్ ఇండికేటర్‌లను చూపిస్తుంది.

ఇక ఐక్యూబ్‌ని టీవీఎస్ కనెక్ట్ యాప్ ద్వారా టర్న్ బై టర్న్ నావిగేషన్, వాయిస్ అసిస్ట్ బ్లూటూత్ కనెక్టివిటీతో యాక్సెస్ చేయవచ్చు. ఈ కన్సోల్ కుడివైపు నెగిటివ్ లైట్ LED స్క్రీన్, ఎడమవైపు TFT డిస్ ప్లేను కలిగి ఉంది. ఎల్ సిడి స్క్రీన్ స్పీడోమీటర్, ఓడోమీటర్, ట్రిప్ మీటర్ మరియు ఫ్యూయల్ గేజ్ రీడౌట్‌లను చూపిస్తుంది.
వేరియంట్స్: టీవీఎస్ ఐక్యూబ్ మూడు వేరియంట్లలో లభిస్తుంది. బేస్ వేరియంట్, S మరియు ST వేరియంట్స్‌గా ఉన్నాయి. వీటిలో బ్లూటూత్ కనెక్టివిటీ మరియు టర్న్-బై-టర్న్ నావిగేషన్, స్కూటర్ క్రాష్ అలర్ట్, TFT ఇన్‌స్ట్రూమెంట్ కన్సోల్స్‌తో వస్తాయి. వాయిస్ అసిస్ట్, టీవీఎస్ కనెక్ట్ యాప్ ద్వారా అలర్ట్స్ పొందవచ్చు. పార్కింగ్ అసిస్టన్స్‌తో పాటు మరెన్నో అధునాతన ఫీచర్లు ఇందులో ఉన్నాయి.

ఇతర ఫీచర్లు: టీవీఎస్ జూపిటర్ 125 33-లీటర్ అండర్ సీట్ స్టోరేజ్ స్పేస్ (సెగ్మెంట్ లో అతిపెద్దది) తో ఉంది. ముందు ఆప్రాన్‌లో 2-లీటర్ గ్లోవ్ బాక్స్ మరియు ఎక్స్ టర్నల్ ఫ్యూయల్ ఫిల్లర్ క్యాప్, USB ఛార్జింగ్ పోర్ట్ ఉంది. సైలెంట్ స్టార్టర్ మరియు ఐడిల్-స్టాప్-స్టార్ట్ సిస్టమ్ ఉన్నాయి. ఇది ఇంధనాన్ని ఆదా చేయడానికి ట్రాఫిక్‌లో ఉన్నప్పుడు ఇతర సందర్భాల్లో ఇంజిన్‌ని సులభంగా ఆఫ్ చేయవచ్చు.
టీవీఎస్ జూపిటర్ 125 అండర్ సీట్ స్టోరేజ్: టీవీఎస్ ఐక్యూబ్ బేస్ వేరియంట్‌లో 30 లీటర్ల అండర్ సీట్ స్టోరేజ్ స్పేస్‌తో వస్తుంది. S, ST వేరియంట్లలో 32 లీటర్ల అండర్ సీట్ స్టోరేజ్ స్పేస్ లభిస్తుంది. మూడు వేరియంట్లలో USB ఛార్జింగ్ పోర్ట్ ఉంది. ఐక్యూబ్ ఎకో, పవర్ అనే రెండు రైడింగ్ మోడ్లను కలిగి ఉంది.

ఐక్యూబ్ ధర బేస్ వేరియంట్ ధర రూ .94,999 నుంచి 1,85,373 (ఎక్స్-షోరూమ్) ధరల మధ్య అందుబాటులో లభిస్తుంది. ST (5.1 కిలోవాట్ల) వేరియంట్‌పై 2024 EMPS (ఎలక్ట్రిక్ మొబిలిటీ ప్రమోషన్ స్కీమ్) కింద సబ్సిడీ లభిస్తుంది. జూపిటర్ 125 ధర డ్రమ్ వేరియంట్ ధర రూ .86,405 జూపిటర్ స్మార్ట్స్‌నెక్స్ట్ వేరియంట్ ధర రూ .96,855 (రెండూ ఢిల్లీ ఎక్స్-షోరూమ్)గా ఉన్నాయి.
టీవీఎస్ ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్లు 75 కి.మీ నుంచి 150 కి.మీ రేంజ్ వరకు అందిస్తాయి. ఇక జూపిటర్ 125 లీటర్ పెట్రోల్‌పై 45-50 కి.మీ మైలేజీని అందిస్తుంది. ఈ స్కూటర్ ట్యాంక్ 5.1 లీటర్ల కెపాసిటీని కలిగి ఉంటుంది. ఈ స్కూటర్ ఫుల్‌ట్యాంక్‌పై 225 కి.మీ మైలేజీని అందిస్తుంది. ధర వేరియంట్, ఇతర ఫీచర్ల ఆధారంగా మీకు నచ్చిన స్కూటర్‌ని ఎన్నుకోండి.


Click it and Unblock the Notifications








