సామాన్యుడికి అందుబాటు ధరలో సరికొత్తగా టీవీఎస్ iQube స్కూటర్.. వేరియంట్లు ఇవే.!!
ఎలక్ట్రిక్ స్కూటర్ విభాగంలో iQube తో టీవీఎస్ మోటార్స్ సేల్స్ పరంగా దూసుకుపోతోంది. తాజాగా TVS iQube ను సంస్థ మూడు కొత్త వేరియంట్లలో విడుదల చేసింది. కొత్త వేరియంట్ల పరిచయంతో ఇప్పుడు మొత్తం ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ 5 వేరియంట్లలో అందుబాటులో ఉంది.
టీవీఎస్ iQube కొత్త మోడళ్లు 3.04 KWh సామర్థ్యం గల లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్‌తో అమర్చబడి ఉంటాయి. ఇప్పటికే అందుబాటులో ఉన్న iQube మరియు iQube S వెర్షన్‌లతో పాటుగా వీటీని కూడా విక్రయించనున్నట్లు కంపెనీ తెలిపింది. సరికొత్త TVS iQube ఎలక్ట్రిక్ స్కూటర్లు దేశవ్యాప్తంగా 434 నగరాల్లోని కస్టమర్ల కొనుగోలుకు అందుబాటులో ఉన్నాయని వెల్లడించింది.

సరసమైన ధరతో ప్రారంభించబడిన TVS iQube ఎలక్ట్రిక్ స్కూటర్ ఎంట్రీ-లెవల్ మోడల్ (ప్రారంభ వెర్షన్) 2.2 KWh బ్యాటరీతో వస్తుంది. ధరు రూ.94,999 (ఎక్స్-షోరూమ్). ఈ వేరియంట్ పూర్తి ఛార్జింగ్‌పై 75 కి.మీల రేంజ్ అందిస్తుంది. దీని గరిష్ట వేగం గంటకు 75 కి.మీ. వాల్‌నట్ బ్రౌన్ మరియు పెరల్ వైట్ కలర్స్‌లో కొనుగోలు చేయవచ్చు.
2.2 KWh బ్యాటరీతో నడిచే iQube వేరియంట్ దాని ధరకు అనుగుణంగా ఆకర్షణీయమైన ఫీచర్లను కలిగి ఉంటుంది. ఇది 5-అంగుళాల TFT స్క్రీన్, వెహికల్ క్రాష్ & టో అలర్ట్, టర్న్-బై-టర్న్ నావిగేషన్‌తో సహా వివిధ ఫీచర్లను కలిగి ఉంది. 30 లీటర్ కెపాసిటీ గల సీట్ బూట్ స్పేస్‌ను కలిగి ఉంటుంది. దాని బ్యాటరీ ఫాస్ట్ ఛార్జర్ ద్వారా 2 గంటల్లో 80 శాతం ఛార్జ్ అవుతుంది.

కొత్త TVS iQube ST వేరియంట్ ఎలక్ట్రిక్ స్కూటర్ కూడా రెండు రకాల బ్యాటరీ ప్యాక్ ఎంపికలలో విడుదల అయింది. 3.4 KWh కెపాసిటీ బ్యాటరీ ప్యాక్ కలిగిన మోడల్ ధర రూ. 1,55,555 ఎక్స్-షోరూమ్ కాగా ఇది ఫుల్ ఛార్జింగ్‌పై 100 కి.మీ రేంజ్ ఇస్తుంది. దీని గరిష్ఠ వేగం గంటకు 78 కి.మీ.
ఈ iQube ST (3.4 KWh) వెర్షన్ కోరల్ సాండ్ శాటిన్, టైటానియం గ్రే మ్యాట్, స్టార్‌లైట్ బ్లూ కలర్స్‌లో అందుబాటులో ఉంది. 7-అంగుళాల ఫుల్ కలర్ TFT స్క్రీన్, 118+ కనెక్ట్ చేయబడిన ఫీచర్లు, వాయిస్ అసిస్ట్ & అలెక్సా స్కిల్‌సెట్, డిజిటల్ డాక్యుమెంట్ స్టోరేజ్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ వంటి వివిధ ఫీచర్లను కలిగి ఉంటుంది.

మరో TVS iQube ST మోడల్ 5.1 kWh బ్యాటరీ ప్యాక్‌తో ఉన్న వేరియంట్‌ను రూ. 1,85,373 ఎక్స్-షోరూమ్ వద్ద కొనుగోలు చేయవచ్చు. ఇది పూర్తి ఛార్జింగ్‌పై 150 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుంది. దీని గరిష్ఠ వేగం గంటకు 82 కి.మీ. ఇందులోని 950W ఛార్జర్.. 4 గంటల 18 నిమిషాల్లో బ్యాటరీని 0-80 శాతం ఛార్జ్ చేస్తుంది.
ఈ iQube ST (5.1 KWh) వెర్షన్ 7-అంగుళాల ఫుల్ కలర్ TFT స్క్రీన్, 118+ కనెక్ట్ చేయబడిన ఫీచర్లు, వాయిస్ అసిస్ట్ & అలెక్సా స్కిల్‌సెట్, డిజిటల్ డాక్యుమెంట్ స్టోరేజ్, TPMS (టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్) వంటి డజన్ల కొద్దీ ఫీచర్లను కలిగి ఉంటుంది. 32-లీటర్ కెపాసిటీ గల సీట్ బూట్ స్పేస్‌తో వస్తుంది. ఇది టైటానియం గ్రే మ్యాట్, స్టార్‌లైట్ బ్లూ కలర్స్‌లో కొనుగోలు చేయవచ్చు.
కాగా సాధారణ iQube మరియు iQube S వేరియంట్‌లు 3.04 kWh లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్‌ని కలిగి ఉన్నాయి. వీటి ధర రూ. 1.37 లక్షల నుండి రూ. 1.46 లక్షల వరకు ఎక్స్-షోరూమ్ ఉంటుంది. పూర్తి ఛార్జింగ్‌తో 100 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుంది. 4 గంటల 30 నిమిషాల్లో దాని బ్యాటరీ ప్యాక్ 0 నుంచి 80 శాతం ఛార్జ్ అవుతుంది.


Click it and Unblock the Notifications








