టాప్‌ సెల్లింగ్‌ టూ వీలర్స్‌ జాబితాలో టీవీఎస్‌.. మార్చిలో 12 శాతం వృద్ధితో రికార్డు సేల్స్‌

దేశంలో టూ వీలర్ మార్కెట్‌ గణనీయమైన వృద్ధిని సాధిస్తోంది. ప్రతి ఏటా డొమెస్టిక్ సేల్స్‌ పరంగా వృద్ధిని సాధించడమే కాకుండా అంతర్జాతీయ మార్కెట్‌లోనూ ఉనికిని చాటుకుంటున్నాయి. ఈ క్రమంలో స్వదేశీ కంపెనీ టీవీఎస్‌ మోటార్‌.. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది మార్చి నెలలో 12 శాతం ఎక్కువ టూ వీలర్లను విక్రయించింది. పూర్తి వివరాల్లోకి వెళితే..

టీవీఎస్‌ మోటార్‌ కంపెనీ(TVS Motor Company) వెల్లడించిన నివేదికల ప్రకారం గతేడాది(2023) మార్చిలో 3,17,152 యూనిట్లను సంస్థ విక్రయించింది. ఈ ఏడాది మార్చిలో విక్రయాల సంఖ్య 354,592 యూనిట్లకు పెరగడంతో 12 శాతం వృద్ధిని సాధించి.. మార్కెట్లో టాప్‌ టూ వీలర్‌ సేల్స్‌ జాబితాలో ఒకటిగా ఉంది.

TVS-Sales-Report-March-2024

ఇక త్రీవీలర్ సెగ్మెంట్‌లో టీవీఎస్‌ మోటార్స్‌ ఈ ఏడాది మార్చిలో 10,146 యూనిట్లను విక్రయించింది. గతేడాది ఇదే నెలతో పోలిస్తే 6 శాతం వృద్ధిని నమోదు చేసినట్లుగా నివేదికలు చెబుతున్నాయి. ద్విచక్ర వాహనం సెగ్మెంట్‌లో గతేడాది మార్చిలో 3,07,559 యూనిట్లను విక్రయించగా.. ఈ ఏడాది మార్చిలో 3,44,446 యూనిట్ల (ఎగుమతులతో సహా) సేల్స్‌ నమోదయ్యాయి.

ఇక దేశీయంగా టీవీఎస్‌ మోటార్స్‌(TVS Sales in 2024 March) టూ వీలర్‌ విభాగంలో 8 శాతం వృద్ధిని నమోదు చేసింది. అంటే గతేడాది సంస్థ భారత మార్కెట్లో 2,40,780 యూనిట్లను విక్రయించగా.. ఈ ఏడాది మార్చిలో దేశీయంగా 2,60,532 యూనిట్లను సంస్థ విక్రయించింది.

TVS-Sales-Report-March-2024

టీవీఎస్‌ మోటార్‌సైకిళ్ల విషయానికి వస్తే, ఈ సెగ్మెంట్‌లో సంస్థ మార్చి 2023లో 1,41,250 యూనిట్లను సేల్ చేసింది. కాగా 2024 మార్చిలో 1,71,611 యూనిట్ల అమ్మకాలను సాధించింది. దీంతో మొత్తంగా 22 శాతం వృద్ధిని నమోదు చేసింది.స్కూటర్ సెగ్మెంట్‌లో 1,28,817 యూనిట్ల నుంచి 1,31,472 యూనిట్లకు పెరగడంతో 2 శాతం వృద్ధిని నమోదు చేసింది.

టీవీఎస్‌ మోటార్స్‌ ఎలక్ట్రిక్ వాహనాల సెగ్మెంట్‌లోనూ సత్తా చాటుతోంది. ఈవీ సబ్సిడీ కారణంగా గత నెలలో టీవీఎస్‌ ఏకైక ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ TVS iQubeపై ఏకంగా రూ. 40,000 విలువైన ప్రయోజనాలు ఉన్నప్పటికీ.. ఈ సారి కూడా గతేడాది మాదిరిగానే విక్రయాలు దాదాపుగా స్థిరంగా ఉన్నాయి. మార్చి 2023లో 15,364 యూనిట్లను విక్రయించగా.. గత నెలలో 15,250 యూనిట్ల సేల్స్‌ నమోదైంది.

TVS-Sales-Report-March-2024

ఇక అంతర్జాతీయ మార్కెట్లో టీవీఎస్‌ మోటార్‌ కంపెనీ మొత్తం ఎగుమతుల ద్వారా 23 శాతం వృద్ధిని నమోదు చేసింది. మార్చి 2023లో సంస్థ 75,037 యూనిట్లను విక్రయించగా.. 2024 మార్చిలో 91,972 యూనిట్ల విక్రయాలను సాధించింది. టూ వీలర్ల పరంగా మార్చి 2023లో 66,779 యూనిట్లను ఎగుమతి చేయగా.. మార్చి 2024 లో 83,914 యూనిట్ల ఎగుమతులు చేయడంతో 26 శాతం వృద్ధిని సాధించింది.

మొత్తంగా 2023-24 ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో కంపెనీ టూ వీలర్‌ సెగ్మెంట్‌ 23 శాతం వృద్ధిని నమోదు చేసింది. ఇది 2022-23 ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో 8.40 లక్షల యూనిట్ల నుంచి ఇప్పుడు 10.32 లక్షల యూనిట్లకు పెరిగింది.

TVS-Sales-Report-March-2024

త్రీ వీలర్‌ సెగ్మెంట్‌లో సంస్థ నాలుగో త్రైమాసికంలో 0.30 లక్షల యూనిట్ల అమ్మకాలతో 4 శాతం వృద్ధిని నమోదు చేసింది. మొత్తంమీద TVS గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే మంచి వృద్ధిని సాధించినట్లుగా గణాంకాలు చెబుతున్నాయి. టూ వీలర్‌, త్రీ వీలర్‌, ఈవీ సెగ్మెంట్లలో దూసుకుపోతోంది.

More from DriveSpark

Article Published On: Tuesday, April 2, 2024, 13:26 [IST]
English summary
Tvs motor company registers 12 percent growth in march 2024 check full details here
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+