అమ్మకాల్లో టీవీఎస్ సునామీ.. కేవలం నెల రోజుల్లోనే 4 లక్షల మంది కొన్నారు.. జోరు చూపించిన దిగ్గజం..
దేశీయ ప్రముఖ కంపెనీ టీవీఎస్ మోటార్(TVS MOTOR) చాలా ఏళ్లుగా తన వాహనాల అమ్మకాల్లో మెరుగైన గణంకాలు సాధిస్తున్న విషయం తెలిసిందే. ప్రతి ఏటా టీవీఎస్ ఇతర కంపెనీల కంటే ఎక్కువ మంది కస్టమర్లను సంపాదించుకుంటూ విక్రయాల పరంగా దూసుకుపోతోంది. తాజాగా విడుదలైన డేటా ప్రకారం, టీవీఎస్ మోటార్ నవంబర్ 2024లో మొత్తం 4,01,250 యూనిట్ల వాహనాల విక్రయాలను నమోదు చేసింది. గత ఏడాది నవంబర్ నెలలో 3,64,231 యూనిట్ల వాహనాలను అమ్మగా, ఈ సారి వినియోగదారుల నుంచి మంచి డిమాండ్ రావడంతో గత ఏడాదితో పోలిస్తే నవంబర్‌లో అమ్మకాలు 10 శాతం ఎక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా ఈ విక్రయాలు పెరగడానికి ప్రధాన కారణం దీపావళి పండుగ. ఎందుకంటే టీవీఎస్ తన ఉత్పత్తులపై ఫెస్టివల్ ఆఫర్లు అందించింది.
అలాగే, డీలర్లు కూడా ప్రత్యేకంగా తగ్గింపులు, బ్యాంక్ క్యాష్‌బ్యాక్‌లు ఇవ్వడం ద్వారా నవంబర్ నెలలో మొత్తం వాహన అమ్మకాలు భారీగా పెరిగాయి. ఇదిలా ఉంటే, టూవీలర్ వాహనాల విషయానికి వస్తే, 2024 నవంబర్ నెలలో మొత్తం 3,92,473 యూనిట్లు అమ్ముడుపోయాయి. అదే గత ఏడాది (2023) ఇదే నెలలో అమ్మకాలు 3,52,103 యూనిట్లుగా ఉన్నాయి. అంటే గత నవంబర్ టూవీలర్ విక్రయాలతో పోలిస్తే ఇప్పుడు 12 శాతం వృద్ధి నమోదైంది.

అయితే ఇక్కడ మరో విషయం ఏమిటంటే, 2023 నవంబర్‌లో జరిగిన మొత్త అమ్మకాల్లో ఎగుమతులు కాకుండా దేశీయంగా విక్రయించిన టూవీలర్ వాహనాలు 2,87,017 యూనిట్లుగా ఉన్నాయి. అదే ఈ ఏడాది నవంబర్‌లో జరగిన మొత్తం విక్రయాల్లో ఎగుమతులు కాకుండా దేశీయంగా 3,05,323 యూనిట్ల అమ్మకాలు నమోదయ్యాయని డేటా పేర్కొంది. ఈ లెక్కన చూసినట్లయితే దేశీయంగా మొత్తం టూవీలర్ విక్రయాలు 6 శాతం పెరిగాయి.
మోటార్‌సైకిల్ అమ్మకాలను చూసినట్లయితే ఈ ఏడాది నవంబర్‌లో మొత్తం 1,80,247 వాహనాలను కొనుగోలు చేయగా, ఇది గత ఏడాది(2023)లో ఇదే నెలలో 1,72,836 మంది కొత్త వాహనాలను కొన్నారు. దీని ప్రకారం గత ఏడాది కంటే ఈ సారి టీవీఎస్ మోటార్‌సైకిల్ విక్రయాలు 4 శాతం వృద్ధిని సాధించాయి. స్కూటర్ అమ్మకాల డేటాను చూసినట్లయితే ఈ విభాగం కూడా మెరుగ్గా ఉంది.

2024 నవంబర్‌లో టీవీఎస్ స్కూటర్ అమ్మకాలు 1,65,535 యూనిట్ల వరకు నమోదు కాగా, అదే గత ఏడాది 2023 నవంబర్‌లో 1,35,749 యూనిట్లుగా ఉన్నట్లు డేటా పేర్కొంది. గత ఏడాది కంటే స్కూటర్ల విభాగం 22 శాతం వృద్ధిని సాధించింది. ఎలక్ట్రిక్ వాహనాల విషయానికి వస్తే, ఈ ఏడాది నవంబర్‌లో 26,292 యూనిట్ల ఈవీలు అమ్ముడుపోగా, గత ఏడాది ఇవి 16,782 యూనిట్లుగా ఉన్నాయి. ఇది ముఖ్యంగా ఐక్యూబ్ స్కూటర్.
అదే విధంగా నవంబర్ 2023లో త్రీ వీలర్ విక్రయాలు 12,128 యూనిట్లుగా ఉండగా, ఈ ఏడాది 8,777 యూనిట్ల అమ్మకాలు నమోదు అయ్యాయి. దేశీయంగానే కాకుండా అంతర్జాతీయంగా టీవీఎస్ మొత్తం ఎగుమతులు 2024 నవంబర్‌లో 93,755 యూనిట్లు కాగా, ఇది గత ఏడాది ఇదే నెలలో 75,203 యూనిట్లుగా ఉన్నాయి. అంటే దాదాపు ఎగుమతుల వృద్ధి 25 శాతం పెరిగింది.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








