సరికొత్త కలర్స్‌లో టీవీఎస్‌ ఎన్‌టార్క్ స్కూటర్స్‌ విడుదల.. కొత్తలుక్‌లో మెరిసిపోతున్న స్కూటర్లు!

టీవీఎస్‌ ఎన్‌టార్క్‌ (TVS Ntorq)కి మార్కెట్‌లో మంచి డిమాండ్‌ ఉంది. ఈ సంస్థ నుంచి స్పోర్టీ లుక్‌లో అందుబాటులో ఉన్న ఏకైక స్కూటర్లలో ఇది ఒకటిగా ఉంది. ఈ స్కూటర్‌ ముఖ్యంగా అర్బన్‌లో ఉండే వారికి చాలా అనువుగా ఉంటుంది. అయితే ఈ స్కూటర్‌ని ఇప్పుడు పూర్తి అప్‌డేట్‌తో టీవీఎస్‌ తీసుకువచ్చింది. ఎన్‌టార్క్ 125, ఎన్‌టార్క్ రేస్‌ 125 XP అనే వేరియంట్లలో ఈ స్కూటర్ లభిస్తుంది. సాధారణ అవసరాల కోసం ఎన్‌టార్క్‌ 125, హై ఫర్ఫామెన్స్‌ కోసం ఎన్‌టార్క్ XP బెస్ట్‌ ఆప్షన్స్‌గా ఉన్నాయి. ఈ స్కూటర్లను ఇప్పుడు సరికొత్త కలర్స్‌లో టీవీఎస్‌ విడుదల చేసింది. కొత్తగా ఎలాంటి మార్పులు చోటుచేసుకున్నాయి. ఈ స్కూటర్లలోని ఇతర ఆప్షన్స్‌ వివరాలు ఈ కథనంలో..

టీవీఎస్ నుంచి అందుబాటులో ఉన్న ఇతర స్కూటర్లతో పోల్చితే ఇది ఢిఫరెంట్‌ లుక్‌ని కలిగి ఉంటుంది. దీని స్పోర్టీ డిజైన్, ఆకర్షణీయమైన ఫీచర్లు యువతను ఎక్కువగా ఆకట్టుకుంటుంది. తాజాగా దీనిని మరింత కొత్త వెర్షన్‌లో టీవీఎస్ విడుదల చేసింది. ఎక్స్‌టీరియర్‌ (బయటి) డిజైన్‌లో కొన్ని కాస్మెటిక్ మార్పులను కంపెనీ చేసింది. అందులో భాగంగా ఈ స్కూటర్లు ఇప్పుడు టర్కోయిస్, హార్లెక్విన్ బ్లూ, నార్డో గ్రే కొత్త ఆప్షన్స్‌లో అందుబాటులో ఉండనున్నాయి.

TVS-Ntorq-125-Features

ఇక కొత్త టీవీఎస్ ఎన్‌టార్క్‌లోనూ 125 అత్యాధునిక ఫీచర్లతో వస్తుంది. ఎల్ఈడీ హెడ్ ల్యాంప్, LCD ఇన్‌స్ట్రూమెంట్ కన్సోల్, బ్లూటూత్ కనెక్టివిటీ, నావిగేషన్ అసిస్ట్, కాలర్ ఐడీ, లాస్ట్ పార్కింగ్ లొకేషన్ అసిస్ట్ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి. ఇందులో డ్యూయల్ రైడ్ మోడ్స్ కూడా ఉన్నాయి. టీవీఎస్ ఎన్‌టార్క్‌ 125 స్కూటర్‌ 124.8 సీసీ 3 వాల్వ్ పెట్రోల్ ఇంజిన్‌తో పనిచేస్తుంది.

ఈ ఇంజిన్ 7,000 rpm వద్ద 9.5 ps గరిష్ట శక్తిని మరియు 5,500 rpm వద్ద 10.6 nm గరిష్ట టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. దీని ధర రూ. 86,871 (ఎక్స్-షోరూమ్ ఢిల్లీ) వద్ద కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది. ఇక ఎన్‌టార్క్‌ రేస్ XP సిరీస్' మ్యాట్ బ్లాక్ స్పెషల్ ఎడిషన్'లో తీసుకువచ్చారు.

TVS-Ntorq-125-Price

XP మ్యాట్ మరియు గ్లాసీ పియానో బ్లాక్‌ కలర్‌ మిశ్రమంగా కనిపిస్తుంది. ఇది చూడటానికి మరింత ఆకర్షణీయంగా ఉండే పదునైన గ్రాఫిక్స్ డిజైన్‌ని కలిగి ఉంది. ఇందులోనూ అనేక ఫీచర్లున్నాయి. LCD ఇన్‌స్ట్రూమెంట్ కన్సోల్, బ్లూటూత్ కనెక్టివిటీ, కాలర్ ఐడీ, 20కి పైగా వాయిస్ అసిస్ట్, లాస్ట్ పార్కింగ్ లొకేషన్ అసిస్ట్, కాల్ అలర్ట్, ఎస్ఎంఎస్ అలర్ట్, ల్యాప్ టైమర్, టర్న్ బై టర్న్ నావిగేషన్ తదితర ఫీచర్లు ఉన్నాయి.

అయితే టీవీఎస్ ఎన్‌టార్క్ రేస్ XP నార్మల్‌ ఎన్‌టార్క్‌ కంటే శక్తివంతమైన పవర్‌ట్రెయిన్‌ని కలిగి ఉంది. ఇందులోని 124.8 సీసీ 3 వాల్వ్ పెట్రోల్ ఇంజిన్ 7,000 rpm వద్ద 10.2 ps గరిష్ట శక్తిని మరియు 5,500 rpm వద్ద 10.9 nm గరిష్ట టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. దీని ధర రూ.97,501 (ఎక్స్ షోరూమ్) ఉంది.

TVS-Ntorq-125-New-Colour-Options

డ్రైవ్స్‌పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

More from DriveSpark

Article Published On: Friday, August 9, 2024, 7:20 [IST]
English summary
Tvs ntorq 125 now gets new colour options check price features in telugu
Read more on: #tvs #scooter #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+