టీవీఎస్ స్కూటర్లు, బైక్‌లకు క్యూ కట్టిన జనాలు.. ఈవీ స్కూటర్‌కు అయితే విపరీతమైన డిమాండ్..

భారతదేశంలో పండుగల సీజన్ నేపథ్యంలో వాహనాల అమ్మకాలు భారీగా పెరిగాయి. చాలా ఆటోమొబైల్ తయారీ కంపెనీలు ఈ టైంలో కొత్తగా పలు మోడళ్లను లాంచ్ చేయగా, చాలా వరకు కస్టమర్ల నుంచి వచ్చిన డిమాండ్‌తో మెరుగైన విక్రయాలు నమోదు అయ్యాయి. ఇదే సమయంలో ప్రముఖ కంపెనీ TVS మోటార్ సైతం దేశీయ మార్కెట్లో ఆకర్షణీయమైన ఫీచర్లతో కూడిన అనేక స్కూటర్లు, బైక్‌లను విక్రయించి అమ్మకాల పరంగా మెరుగైన గణంకాలను సాధించింది. ముఖ్యంగా అక్టోబర్ (2024) నెలలో వాహన అమ్మకాల గణాంకాలు ఊహించిన దానికంటే మెరుగైన వృద్ధిని నివేదించాయి. పండుగల సమయంలో తగ్గింపులు, డిస్కౌంట్‌లు, క్యాష్‌బ్యాక్‌లు ఇంకా పలు ఆఫర్ల వలన అక్టోబర్ నెలలో అమ్మకాలు బాగా పుంజుకున్నాయి.

TVS మోటార్ అక్టోబర్ - 2024లో మొత్తం 4,89,015 టూవీలర్ వాహనాలను, త్రీ వీలర్ వాహనాలు విక్రయించింది, వీటిలో దేశీయంగా విక్రయించిన వాటితో పాటు ఎగుమతులు కూడా ఉన్నాయి. ఇవి గత ఏడాది 2023 ఇదే నెలలో విక్రయించిన 4,34,714 యూనిట్లతో పోలిస్తే, సంవత్సరానికి 13 శాతం వృద్ధి చెందాయి. గత కొంత కాలంగా టీవీఎస్ కంపెనీ అమ్మకాల్లో పుంజుకుంటుంది.

Tvs October 2024 Record Sales 13 Percent Growth

కంపెనీ ఇటీవల విడుదల చేసిన డేటా ప్రకారం, ఈ అక్టోబర్‌లో 14 శాతం వృద్ధితో 4,78,159 యూనిట్ల బైక్‌లు, స్కూటర్ల విక్రయాలు నమోదు అయ్యాయి. అదే 2023 అక్టోబర్ నెలలో 4,20,610 యూనిట్లను మాత్రమే కంపెనీ విక్రయించింది. దేశీయంగా అమ్మకాలతో పాటు టీవీఎస్ విదేశీ ఎగుమతులు సైతం మెరుగైన స్థితిలో ఉన్నాయి.

ఈ అక్టోబర్‌లో, TVS కంపెనీ విదేశాలకు అత్యధిక సంఖ్యలో టూవీలర్, త్రీ వీలర్ వాహనాలను ఎగుమతి చేసింది. మొత్తం 87,952 యూనిట్లు వివిధ దేశాలకు ఎగుమతి అయ్యాయి. 2023లో ఇదే కాలంలో విదేశాలకు ఎగుమతి చేసిన 87,952 యూనిట్లతో పోలిస్తే, ఏడాది ప్రాతిపదికన వృద్ధి 9 శాతం. అయితే ఇదే సమయంలో 10,856 యూనిట్ల అమ్మకాలతో త్రీ వీలర్లు తక్కువగా ఎగుమతి అయ్యాయి.

ఇటీవల కాలంలో ఎలక్ట్రిక్ వాహనాల వాడకం పెరిగిన నేపథ్యంలో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల విక్రయాల్లో టీవీఎస్ మంచి వృద్ధిని సాధించింది. దసరా, దీపావళి పండుగల కారణంగా అక్టోబర్ నెలలో 29,308 యూనిట్లు అమ్ముడయ్యాయి. 2023 అదే కాలంలో విక్రయించిన 20,153 యూనిట్లతో పోలిస్తే, ఇది 45 శాతం ఎక్కువ కావడం గమనార్హం.

ముఖ్యంగా టీవీఎస్ ఎలక్ట్రిక్ టూవీలర్ వాహనాల అమ్మకాలు భారీగా పెరగడం వెనుక 'ఐక్యూబ్(iCube)' ఎలక్ట్రిక్ స్కూటర్ ప్రధాన కారణం. ఇది 3 వేరియంట్‌లలో అందుబాటులో ఉంది. రూ.1.07 లక్షల నుండి రూ.1.37 లక్షల ఎక్స్-షోరూమ్ ధర వద్ద కొనుగోలుకు లభిస్తుంది. TVS iQube ఈ-స్కూటర్ 2.2 kWh, 3.04 kWh, 5.1 kWh బ్యాటరీ ప్యాక్ ఎంపికలతో వస్తుంది.

ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ పూర్తి ఛార్జింగ్ పై 75 నుండి 150 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుంది. ఇది పూర్తి-రంగు TFT స్క్రీన్, వాయిస్ అసిస్ట్-అలెక్సా స్కిల్‌సెట్, TPMS (టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్), డిజిటల్ డాక్యుమెంట్ స్టోరేజ్ వంటి వివిధ ఫీచర్లతో వచ్చింది. ఈ మోడల్ ఇటీవల కాలంలో ఎక్కువగా అమ్ముడుపోతున్న ఈవీ విభాగంలో కంపెనీ నుంచి మొదటి స్థానంలో ఉంది.

అలాగే, కంపెనీ మోపెడ్ విభాగంలో XLని విక్రయిస్తుంది, ఈ మోడల్‌కు కూడా వినియోగదారుల నుంచి విపరీతమైన డిమాండ్ ఉంది. ప్రస్తుతం XL విక్రయాలు 53,898 యూనిట్లుగా ఉన్నాయి. ఇవి అక్టోబర్ 2023లో విక్రయించిన 53,510 యూనిట్ల నుండి ఏడాది ప్రాతిపదికన 0.73 శాతం వృద్ధిని సాధించింది. XL ప్రస్తుతం కంపెనీ పోర్ట్‌ఫోలియోలో 11.27 శాతం వాటాను కలిగి ఉంది.

More from DriveSpark

Article Published On: Monday, November 4, 2024, 7:20 [IST]
English summary
Tvs october 2024 sales 13 percent growth and iqube ev most demand model
Read more on: #tvs motor #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+