మార్కెట్‌లోకి కొత్త బైక్‌.. ధర కేవలం రూ. 59,880, మెరిసే డిజైన్‌, మురిపించే మైలేజీ!

దేశంలో టూవీలర్స్‌ వినియోగం రోజు రోజుకు పెరుగుతుంది. ఎక్కువ సంఖ్యలో కస్టమర్లకు చేరువ అయ్యేందుకు చాలా కంపెనీలు తక్కువ ధరలో మోటార్‌సైకిళ్లను విడుదల చేస్తున్నాయి. ప్రస్తుతం 125 సీసీ, 110 సీసీ టూవీలర్స్‌కి డిమాండ్‌ ఎక్కువగా ఉంది. 125 సీసీలతో పోల్చితే 110 సీసీ మోటార్‌సైకిల్స్‌ ధర చాలా తక్కువ. దీంతో కంపెనీలు కూడా మాస్‌ మార్కెట్‌లో ఎక్కువ మంది కస్టమర్లకు చేరువ అయ్యేందుకు 110 సీసీ మోటార్‌ సైకిల్స్‌ విడుదలపై దృష్టి సారిస్తున్నాయి. ఈ 110 సీసీ సెగ్మెంట్‌లో మోటార్‌సైకిళ్ల అమ్మకాలు కూడా అదే స్థాయిలో కొనసాగుతున్నాయి. ఈ విభాగంలో టీవీఎస్, హీరో మోటాకార్ప్, బజాజ్, హోండా కంపెనీలు ఉత్పత్తులు మార్కెట్‌లో మంచి డిమాండ్‌ని కలిగి ఉన్నాయి.

తాజాగా టీవీఎస్ కంపెనీ అప్‌డేటేడ్‌ రేడియన్ ఆల్‌ బ్లాక్‌ బేస్‌ ఎడిషన్‌ని (TVS Radeon All Black Base Edition) లాంచ్ చేసింది. టీవీఎస్‌ రేడియన్‌కి మార్కెట్‌లో మంచి డిమాండ్‌ ఉంది. ఇప్పుడు కొత్త కలర్ ఆప్షన్‌తో దీనిని కంపెనీ తీసుకువచ్చింది. ఈ కొత్త బైక్‌ని ఇప్పుడు ఆల్-బ్లాక్ కలర్ ఆప్షన్‌తో కొనుగోలు చేయవచ్చు. ఈ కలర్‌ ఆప్షన్‌తో కలిపి టీవీఎస్ రేడియన్ మొత్తం ఏడు కలర్స్‌లో లభిస్తుంది.

TVS Radeon All Black Base Edition Launch

రేడియన్‌ బైక్‌ బేస్, డీజీ డ్రమ్ (Digi Drum), డీజీ డిస్క్ (Digi Disc) అనే మూడు వేరియంట్లలో లభిస్తుంది. టీవీఎస్ రేడియన్ మరింత చౌకగా ఉండటానికి బేస్ వేరియంట్ ధరను కూడా తగ్గించారు. ప్రస్తుతం రేడియన్ ధర రూ.59,880 (ఎక్స్-షోరూమ్)గా ఉంది. ప్రస్తుతం దీని ధర రూ.2,525 తగ్గింది. ఇక మిడ్-స్పెక్ డీజీ డ్రమ్ వేరియంట్ ధర రూ .77,394 (ఎక్స్-షోరూమ్) లభిస్తుంది.

టాప్-స్పెక్ డీజీ డిస్క్ ధర రూ .81,394 (ఎక్స్-షోరూమ్)గా ఉంది. ఈ కొత్త ఆల్-బ్లాక్ కలర్ ఫ్యూయల్ ట్యాంక్ సైడ్ ప్యానెల్స్‌పై వైట్ టీవీఎస్‌, రేడియన్ బ్యాడ్జింగ్‌తో షైనింగ్ ఫినిన్‌తో వస్తుంది. ఇక బైక్‌కి కాంట్రాస్ట్ టచ్ ఇచ్చే కంచు కలర్‌ (Bronze) ఇంజిన్ కవర్ దీని ప్రత్యేకతగా చెప్పవచ్చు. ఇది బైక్‌కి అదనపు ఆకర్షణగా ఉంటుంది. ఈ బైక్‌ ఇతర కలర్స్‌తో పోల్చితే ఈ ఎడిషన్‌ సరికొత్తగా కనిపిస్తుంది.

TVS Radeon All Black Base Edition Price

రైడర్లకు అదనపు సౌలభ్యం కోసం కలర్ LCD స్క్రీన్, USB ఛార్జింగ్ పోర్ట్‌తో వస్తుంది. డ్రమ్ వేరియంట్ బరువు 113 కిలోలు, డిస్క్ వేరియంట్ బరువు 115 కిలోలుగా ఉంది. ఈ బైక్‌ కాంబీ బ్రేకింగ్ సిస్టమ్ (సీబీఎస్)తో వస్తుంది. దీంతో బైక్‌ బ్రేకింగ్స్‌ చురుగ్గా పనిచేయనున్నాయి. ఇది 180 మిమీ గ్రౌండ్ క్లియరెన్స్‌ని కలిగి ఉంటుంది. దీంతో గ్రామీణ ప్రాంతాల్లోనూ ఈ బైక్‌ని సులభంగా డ్రైవ్‌ చేయవచ్చు.

టీవీఎస్ రేడియన్ 109.7 సీసీ ఎయిర్-కూల్డ్ సింగిల్ సిలిండర్ ఇంజిన్‌ని కలిగి ఉంది. ఇది 8 ps పవర్‌ని 8.7 nm టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. లీటరుకు 68 కిలోమీటర్ల మైలేజీ అందిస్తుందని కంపెనీ పేర్కొంది. ఈ రేడియన్‌ బైక్‌ 10 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో వస్తుంది. ఇందులో టెలిస్కోపిక్ ఫోర్క్స్‌, ప్రీలోడ్-అడ్జస్టబుల్ షాక్ అబ్జార్బర్లు కూడా ఉన్నాయి.

డ్రైవ్స్‌పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

More from DriveSpark

Article Published On: Monday, September 30, 2024, 17:56 [IST]
English summary
Tvs radeon all black base edition launched at rs 59880 check specifications here in telugu
Read more on: #tvs #bikes #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+