రూ. 58 వేలకే సరికొత్త బైక్‌ లాంచ్‌.. టాప్‌ క్లాస్‌ డిజైన్‌, అదిరే ఫీచర్లు, భారీ మైలేజీతో మార్కెట్‌లోకి!

తక్కువ ధరలో బైక్‌ను కొనుగోలు చేయాలనుకునే వారి కోసం ప్రముఖ టూవీలర్‌ తయారీ సంస్థ TVS తన రేడియన్(Radeon) మోటార్‌సైకిల్‌ని సరికొత్త బేస్ వేరియంట్‌లో విడుదల చేసింది. ఈ బైక్‌ ఇప్పుడు ఆల్‌ బ్లాక్ కలర్‌లో అందుబాటులో ఉంది. ఈ బేస్‌ వేరియంట్‌ ఆకట్టుకునే ఫీచర్లను కలిగి ఉంది. ఈ బైక్‌‌ను కంపెనీ అందుబాటులో ఉన్న ఇతర వేరియంట్స్‌ కంటే తక్కువ ధరలో తీసుకువచ్చింది. ధర రూ. 58,880 (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) వద్ద దీనిని విడుదల చేసింది.

ఈ బైక్‌ ధర తక్కువగా ఉండటంతో వినియోగదారులు ఎక్కువ సంఖ్యలో కొనుగోలు చేసే అవకాశం ఉంది. ముఖ్యంగా ఇది మిడ్ వేరియంట్ కంటే రూ.17,514 తక్కువ ధరలో లభిస్తుంది. ప్రధానంగా రేడియన్ బైక్ బేస్, డీజీ డ్రమ్, డీజీ డిస్క్ మూడు వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది. వినియోగదారులు నచ్చిన వేరియంట్‌ను కొనుగోలు చేసుకోవచ్చు.

TVS Radeon All Block Front View

డిజైన్: ఈ బైక్‌ని ఇప్పుడు సరికొత్త ఆల్‌ బ్లాక్ కలర్‌లో తీసుకువచ్చింది. ఈ బైక్‌ ఫ్యూయల్ ట్యాంక్, సైడ్ ప్యానెల్స్‌పై TVS కంపెనీ రేడియన్ బ్యాడ్జింగ్‌ను కలిగి ఉంటుంది. ఇంజిన్ పైన కూడా కంపెనీ లోగోతో షీల్డ్ కవర్‌ను అందించారు. ఇది పూర్తి బ్లాక్ కలర్‌తో పాటు మొత్తం ఏడు కలర్ ఆప్షన్లలో లభిస్తుంది.

ఇంజిన్ సామర్థ్యం: ఈ మోటార్‌ సైకిల్‌ బైక్ 109.7 cc ఎయిర్-కూల్డ్ సింగిల్-సిలిండర్ ఇంజిన్‌తో రన్ అవుతుంది. ఈ ఇంజిన్ 7350 rpm వద్ద 8.08 bhp పవర్, 4500 rpm వద్ద 8.7 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇందులో 4-స్పీడ్ గేర్‌బాక్స్‌ ఆప్షన్‌ ఇంజిన్‌కి జతజేయబడి ఉంటుంది. దీని పెట్రోల్ ట్యాంక్ కెపాసిటీ 10 లీటర్లుగా ఉంది.

TVS Radeon All Black Side View

బ్రేకింగ్ సిస్టమ్: ఈ బైక్‌ను కంట్రోల్ చేయడానికి కొత్త బ్రేకింగ్ సిస్టమ్‌ అందుబాటులో ఉంది. దీనిలో 130 mm ఫ్రంట్ డ్రమ్ బ్రేక్‌ కలదు. టాప్ వేరియంట్‌లో 240 mm ఫ్రంట్ డిస్క్, వెనుక భాగంలో డ్రమ్ బ్రేక్‌ను అమర్చారు. ఈ మోడల్‌తోపాటు మిగిలిన అన్ని వేరియంట్లు 18-అంగుళాల అల్లాయ్ వీల్స్‌పై రన్ అవుతాయి. ఇందులోని కంబైన్డ్ బ్రేకింగ్ సిస్టమ్ (CBS) ద్వారా బైక్‌ని ఏక కాలంలో నిలువరించవచ్చు.

ఇతర ఫీచర్లు: TVS రేడియన్(Radeon)బేస్ వేరియంట్ బడ్జెట్ ధరలో భారీ ఫీచర్లను కలిగి ఉంది. ఈ బైక్‌లో ప్రధానంగా LCD స్క్రీన్, USB ఛార్జింగ్ పోర్ట్ వంటివి ఉన్నాయి. ఇది 180 మిమీ గ్రౌండ్ క్లియరెన్స్‌ని కలిగి ఉంటుంది. ఇది అన్ని రకాల రోడ్లపై సులువుగా ప్రయాణిస్తుంది. బైక్ ముందు టెలిస్కోపిక్ ఫోర్క్స్‌, వెనక వైపున ట్విన్ షాక్‌లతో కూడిన సింగిల్ క్రెడిల్ ట్యూబ్యులర్ ఫ్రేమ్‌తో వస్తుంది.

ప్రత్యర్థి బైక్స్: TVS రేడియన్(Radeon) బేస్ వేరియంట్ రూ.58 వేల ధరలో లభిస్తుండడంతో మార్కెట్‌లో ఇప్పటికే ఉన్న ఇతర కంపెనీలకు గట్టి పోటీ ఇవ్వనుంది. ముఖ్యంగా ఈ మోడల్ హోండా CD 110 డ్రీమ్ DX, హీరో స్ప్లెండర్ ప్లస్, బజాజ్ ప్లాటినా తదితర మోడళ్లకు గట్టి పోటీని ఇస్తుంది.

డ్రైవ్స్‌పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

More from DriveSpark

Article Published On: Tuesday, October 8, 2024, 17:43 [IST]
English summary
Tvs radeon all black base variant top 5 specifications and features in telugu
Read more on: #tvs #bikes #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+