ఒక్క నెలలో 50000 మంది ఈ బైక్ కొన్నారు.. దీని రేటెంతో తెలుసా?
ప్రముఖ టూ వీలర్ తయారీ సంస్థ టీవీఎస్ మోటార్ (TVS Motor) రోజు రోజుకి గణనీయమైన అభివృద్ధి చెందుతోంది. అమ్మకాల్లో దూసుకెళ్తున్న ఈ కంపెనీ గత నెలలో మంచి వృద్ధిని కనపరిచింది. ఇందులో టీవీఎస్ రైడర్ 125 గొప్ప అమ్మకాలను సాధించగలిగింది.
టీవీఎస్ కంపెనీ FY2024లో 29 శాతం వృద్ధిని నమోదు చేసి 301449 యూనిట్లను సేల్ చేసినట్లు సమాచారం. ఇందులో 132339 యూనిట్లు లేదా 38 శాతం స్కూటర్లు ఉన్నాయి. మోటార్ సైకిళ్లు 24 శాతం లేదా 127186 యూనిట్లుగా నమోదయ్యాయి. అదే సమయంలో 20 శాతం / 41924 యూనిట్ల మోపెడ్‌లు ఉన్నట్లు గణాంకాలు వెల్లడించాయి. మార్కెట్లో జుపీటర్ మరియు ఎన్‌టార్క్ మంది అమ్మకాలను పొందాయి.

మొత్తం అమ్మకాల్లో బాగా సంఖ్యలో విక్రయించబడిన బైక్ టీవీఎస్ రైడర్ 125 అని తెలుస్తోంది. ఈ బైక్ గత ఒక్క నెలలోనే 51098 యూనిట్ల అమ్మకాలను నమోదు చేయగలిగిందని SIAM నుంచి వచ్చిన డేటా ద్వారా తెలిసింది. ఈ అమ్మకాలు 2023 ఏప్రిల్ కంటే 62 శాతం అధికమని తెలుస్తోంది. టీవీఎస్ రైడర్ అమ్మకాల్లో అపాచీ కంటే ముందు వరుసలోకి చేరింది.
టీవీఎస్ అపాచీ అమ్మకాలు గత నెలలో 19 శాతం వృద్ధిని పొందాయి. అంటే గత నెలలో అపాచీ అమ్మకాలు 45520 యూనిట్లు. మోటార్ సైకిల్స్ అమ్మకాల్లో రైడర్ 40 శాతం వాటాను లేదా మొత్తం ద్విచక్ర వాహనాల విక్రయాల్లో 17 శాతం వాటాను కలిగి ఉంది. మొత్తం మీద టీవీఎస్ రైడర్ బైకును భారతీయ కస్టమర్లు ఎక్కువ ఇష్టపడుతున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది.

దేశీయ మార్కెట్లో లాంచ్ అయినప్పటి నుంచి టీవీఎస్ రైడర్ 800000 యూనిట్ల విక్రయాలను పొందగలిగింది. ఇన్ని బైకులను మార్కెట్లో విక్రయించడానికి 31 నెలల సమయం పట్టినట్లు తెలుస్తోంది. నివేదికల ప్రకారం భారతీయ విఫణిలో అత్యంత వేగవంతమైన అమ్మకాలు పొందుతున్న 125 సీసీ కమ్యూటర్ బైకులలో రైడర్ చెప్పుఉకోదగ్గ మోడల్ అని తెలుస్తోంది. రాబోయే రోజుల్లో కూడా రైడర్ అమ్మకాలు అద్భుతంగా ఉంటాయని తెలుస్తోంది.
టీవీఎస్ మంచి డిజైన్ కలిగి, ఆధునిక ఫీచర్స్ పొందుతుంది. ఈ బైక్ ధరలు దేశీయ మార్కెట్లో రూ. 95219 నుంచి రూ. 1.04 లక్షల (ఎక్స్ షోరూమ్) మధ్య ఉంటాయి. ఇందులో మస్కులర్ ట్యాంక్, స్నాజీ హెడ్‌లైట్, మినిమలిస్టిక్ టెయిల్ ల్యాంప్ మరియు స్ప్లిట్ సీట్ వంటి వాటితో పాటు TFT డాష్ కూడా ఉంటుంది. ఇవన్నీ వాహన వినియోగదారులకు మంచి రైడింగ్ అనుభూతిని అందిస్తాయి.

దేశీయ మార్కెట్లో మంచి అమ్మకాలతో ముందుకు సాగుతున్న టీవీఎస్ రైడర్.. ఇప్పటికే అమ్మకానికి ఉన్న బజాజ్ పల్సర్, హోండా షైన్ మరియు హీరో మోటోకార్ప్ యొక్క గ్లామర్, సూపర్ స్ప్లెండర్, ఎక్స్‌ట్రీమ్ 125ఆర్ వంటి వాటికి ప్రధాన ప్రత్యర్థిగా ఉంది. ప్రత్యర్థులకు గట్టి పోటీ ఇస్తూనే టీవీఎస్ రైడర్ 125 దేశీయ విఫణిలో ఉత్తమ అమ్మకాలను పొందగలిగింది. ఈ నెలలో కూడా ఈ బైక్ ఎక్కువ విక్రయాలను పొందుతుందని ఆశిస్తున్నాము.
ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథనాలు తెలుసుకోవడంతో పాటు, దేశీయ మార్కెట్లో లాంచ్ అయ్యే కొత్త కార్లు మరియు బైకుల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి 'తెలుగు డ్రైవ్‌స్పార్క్' చూస్తూ ఉండండి. ఈ కథనంపై మీ అభిప్రాయాలను మరియు సందేహాలను తప్పకుండా మాతో పంచుకోండి. లేటెస్ట్ ఆటోమొబైల్ వార్తలు కోసం ఫేస్‌బుక్ (Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) మరియు యూట్యూబ్ (YouTube) ఛానల్స్ ఫాలో అవ్వండి.


Click it and Unblock the Notifications








