దేశంలోనే ఇంత డిమాండ్ ఉన్న బైకును ఇప్పటివరకు చూసి ఉండరు.. ఏకంగా 10 లక్షల మంది పైగా కొన్నారు..

ఇండియాలో ఒక బైక్ క్లిక్ అయిందంటే చాలు దాని రేంజ్ ఎక్కడికో వెళ్తుంది. అలాంటి ఒక మోడల్ తాజాగా సరికొత్త మైలురాయి సాధించింది. అదే 2021లో విడుదలైన టీవీఎస్ రైడర్ 125(TVS raider 125). ఈ బైకుకు దేశంలో ఎంత డిమాండ్ ఉందంటే ఏకంగా ఇప్పటి వరకు ఈ మూడేళ్లలో దాదాపు 10 లక్షల కంటే ఎక్కువ మంది దీనిని కొనుగోలు చేశారు. ఒక బైక్ ఈ రేంజ్‌లో అమ్మకాలను సాధించడం అంటే మాములు విషయం కాదు. ఇటీవల వచ్చిన సమాచారం ప్రకారం, రైడర్ 125 ఇండియా మార్కెట్లోకి వచ్చినప్పటి నుంచి కేవలం మూడు సంవత్సరాల్లో 10,07,514 యూనిట్లు అమ్ముడు పోయింది. ఈ డిమాండ్ 125 cc మోటార్‌బైక్‌ల పట్ల ప్రజల్లో ఉన్న ఆదరణను హైలెట్ చేస్తుంది.

సెప్టెంబర్, 2021లో రైడర్ 125 విడుదల అయింది. మంచి డిజైన్, మైలేజ్‌తో క్లిక్ కావడంతో 2024 మార్చి నాటికి దాదాపు 7,87,059 మంది కొనుగోలు చేశారు. అనంతరం డిమాండ్ అంతకంతకు పెరుగుతూ, ఈ ఆరు నెలల్లోనే ఏకంగా 2,12,941 మంది కొనుగోలు చేయడంతో మొత్తం అమ్మకాలు 10 లక్షల పైచిలుకు నమోదు కావడం గమనార్హం.

Tvs Raider 125 Crosses 1 Million Unit sales Milestone

2024 ఏడాదిలో టీవీఎస్ కంపెనీ మొత్తం అమ్మకాల్లో రైడర్ 125 సరికొత్త చరిత్రను లిఖించింది. కంపెనీకి చెందిన ఇతర మోడళ్ల కంటే అత్యధికంగా అమ్మకాలను సాధించింది. మరి ఈ బైకుకు ఈ స్థాయిలో డిమాండ్ ఎందుకు ఉందంటే దాని ఫెర్ఫామెన్స్, మైలేజ్, ఫీచర్లు అద్బుతంగా ఉండటం ప్రధాన కారణం.

టీవీఎస్ రైడర్ ఇంజిన్ విషయానికి వస్తే, ఇది 124.8 cc సింగిల్ సిలిండర్ ఇంజిన్‌తో పనిచేస్తుంది. దీనిని ఎయిర్-ఆయిల్ కూల్డ్ ఇంజిన్‌గా అభివృద్ధి చేశారు. 7500 rpm వద్ద 11.22 bhp గరిష్ట శక్తిని, 6,000 rpm వద్ద 11.2 nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ బైకులో అందించిన గేర్లు చాలా మృదువుగా ఉంటాయి. దీని కోసం 5-స్పీడ్ గేర్‌బాక్స్‌ను ఇంజిన్‌కు జత చేశారు.

Tvs Raider 125 1 Million Unit sales

ఇతర ఫీచర్లలో USB ఛార్జర్ పోర్టు ప్రత్యేకంగా ఉంది. దీని ద్వారా బైక్‌ను రైడింగ్ చేస్తూ కూడా స్మార్ట్ ‌ఫోన్ లేదా ఇతర డివైజ్‌లను ఛార్జింగ్ చేసుకోవచ్చు. ఇంకా, టాప్ వేరియంట్‌లో కాల్/SMS అలర్ట్, క్లైమేట్ అప్‌డేట్, రూట్ మ్యాప్ కోసం బ్లూటూత్ కనెక్టివిటీ వంటివి ఉన్నాయి. అదనంగా హెల్మెట్-అటెన్షన్ నోట్, సైడ్ స్టాండ్ గురించి హెచ్చరించడానికి ప్రత్యేక ఫీచర్లు ఉన్నాయి.

సీట్ క్రింది భాగంలో స్టోరేజ్‌ కూడా ఇతర మోడళ్లతో పోలిస్తే ఎక్కువగా ఉంటుంది. రైడింగ్‌లో బైకును కంట్రోల్ చేయడానికి సింక్రోనస్ బ్రేకింగ్ సిస్టమ్ బాగా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా ఈ బైకును జనాలు ఎక్కువగా కొనడానికి ప్రధాన కారణం మైలేజ్. ఈ బైకు దాదాపు లీటర్ పెట్రోల్‌కు 56 కి.మీ వరకు మైలేజ్ ఇస్తుంది. అందుకే మధ్యతరగతి ప్రజలకు రైడర్‌ అంటే చాలా ఇష్టం.

టీవీఎస్ రైడర్ 125 ధర విషయానికి వస్తే రూ. 84,869 నుండి రూ. 1,03,830 (ఎక్స్-షోరూమ్) మధ్యలో అందుబాటులో ఉంది. ఈ ధరలో ఇతర కంపెనీల మోడళ్లకు రైడర్ గట్టి పోటీ ఇస్తుంది. ఈ బైక్ మంచి మైలేజీతో, తక్కువ ధరలో లభించడం మాత్రమే కాకుండా డిజైన్ చాలా బాగుంటుంది.

టీవీఎస్ రైడర్ 125 ప్రత్యేకమైన డిజైన్, బలమైన పనితీరు, అధునాతన ఫీచర్లతో రావడంతో భారతీయ మోటార్‌సైకిల్ మార్కెట్లో ఫేవరెట్‌గా దాని స్థానాన్ని సుస్థిరం చేసింది. కస్టమర్ అంచనాలను ఇది సమర్థవంతంగా అందుకోవడంతో అమ్మకాలు 10 లక్షలకు పైగా దాటి సరికొత్త రికార్డు క్రియేట్ అయింది.

More from DriveSpark

Article Published On: Friday, November 1, 2024, 7:20 [IST]
English summary
Tvs raider 125 crosses 10 lakhs unit sales milestone in just 3 years
Read more on: #tvs #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+