TVS Raider 125 మార్కెట్లో ఈ బైక్‌ను ఇప్పటివరకూ 7 లక్షలకు పైగా కొనేశారు.. ఏముంది ఇందులో అంత స్పెషల్‌.!!

భారత మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన టూ వీలర్‌ కంపెనీల్లో టీవీఎస్‌ మోటార్స్‌(TVS Motors) ఒకటి. కాగా ఈ సంస్థకు చెందిన TVS Raider 125 అరుదైన రికార్డును సాధించింది. ఈ ఆర్థిక సంవత్సరంలో బెస్ట్‌ సెల్లింగ్‌ బైక్‌గా నిలిచింది. పూర్తి సమాచారం ఈ కథనంలో..

భారత మార్కెట్లోకి అడుగుపెట్టిన కేవలం 29 నెలల్లోనే TVS రైడర్ 125.. 7,00,000 యూనిట్ల అమ్మకాలను దాటి సరికొత్త రికార్డును సృష్టించింది. ప్రారంభించినప్పటి నుండి రెండున్నర సంవత్సరాలలోపే, 125cc కమ్యూటర్‌ మోటార్‌సైకిల్‌ విభాగంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న బైక్‌గా మార్కెట్‌ను కైవసం చేసుకుంది. దేశీయంగా ఇప్పటివరకూ 7,14,484 యూనిట్లను విక్రయించింది.

TVS-Raider-125-Sales

భారత్‌లో టూ వీలర్‌ మార్కెట్లో టీవీఎస్‌ తన ఉనికిని చాటుతూ ఆటో రంగం వృద్ధిలో కీలక సహకారం అందిస్తోంది. స్పోర్టీ 125cc మోటార్‌సైకిళ్లకు పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని కొత్త ఉత్పత్తులను అందిస్తూ.. కస్టమర్ల నుంచి ఆదరణ పొందుతోంది. ఏప్రిల్‌ 2023 నుంచి జనవరి 2024 మధ్య 3,98,354 టీవీఎస్‌ రైడర్‌ 125 యూనిట్లు సేల్‌ అయ్యాయి.

గత ఆర్థిక సంవత్సరం(2,39,388)తో పోలిస్తే 124 శాతం వృద్ధిని సాధించింది. మార్కెట్లో హీరో గ్లామర్ మరియు సూపర్ స్ప్లెండర్, బజాజ్ పల్సర్ మరియు హోండా షైన్ వంటి కమ్యూటర్‌ బైక్‌లతో అత్యంత పోటీ ఉన్నప్పటికీ.. టీవీఎస్‌ రైడర్‌ 125 తన దూకుడుని ఎక్కడా తగ్గించలేదు.

TVS-Raider-125-Sales

అదేవిధంగా టీవీఎస్‌ బ్రాండ్‌ నుంచి యువ రైడర్లకు ఫేవరెట్‌గా ఉన్న మరో బైక్‌ అపాచీ సిరీస్‌.. ఈ ఆర్థిక సంవత్సరంలో పది నెలల్లో 3,09,242 యూనిట్లను విక్రయించి బెస్ట్‌ సెల్లింగ్ బైక్‌గా మారింది. స్కూటర్‌ సెగ్మెంట్‌లో టీవీఎస్‌ జూపిటర్ స్కూటర్ 6,99,613 యూనిట్లతో ప్రథమ స్థానంలో ఉండగా.. XL మోపెడ్ 3,99,877 యూనిట్లతో సేల్స్‌ పరంగా రెండో స్ఖానంలో నిలిచింది.

కాగా మోటార్‌ సైకిల్‌ విభాగంలో టీవీఎస్‌ రైడర్ 125 అగ్రగామిగా ఉంది. మార్కెట్లో టీవీఎస్‌ రైడర్‌ 125.. మూడు వేరియంట్‌లలో (సింగిల్ సీట్, స్ప్లిట్, సీట్ SX) అందుబాటులో ఉంది. రైడర్ 125 యొక్క ఆన్-రోడ్ ముంబయి ధర సింగిల్-సీట్ బైక్‌కి రూ. 93,700గా ఉంది. స్ప్లిట్ సీట్ వేరియంట్‌ రూ. 94,700 ఉండగా.. రేంజ్-టాపింగ్ రైడర్‌ 125SX రూ. 1,00,800 ధరతో ప్రారంభమవుతుంది.

TVS-Raider-125-Sales

ఈ బైక్‌ ఇంతలా యువ రైడర్లను ఆకట్టుకోవడానికి ఇందులో చాలా ప్రత్యేకమైన అంశాలు ఉన్నాయి. TVS రైడర్ 125 లో మస్కులర్ ట్యాంక్, స్నాజీ హెడ్‌లైట్, 5 అంగుళాల TFT క్లస్టర్, టర్న్ బై టర్న్ నావిగేషన్, లో ఫ్యూయెల్ వార్నింగ్, మినిమలిస్ట్ టెయిల్-ల్యాంప్, అలాగే స్ప్లిట్ సీటు రూపంలో అథ్లెటిక్-లుకింగ్ స్టైలింగ్‌తో ఆకర్షణీయంగా ఉంటుంది. దాని వినూత్న డిజైన్‌, స్టైలింగ్‌తో, దాని ప్రత్యర్థుల మోడల్స్‌ నుంచి వేరుగా కనిపిస్తుంది.

TVS రైడర్ 125 లో డే టైమ్‌ రన్నింగ్ లైట్లు, పాస్-లైట్ స్విచ్, పిలియన్ గ్రాబ్రెయిల్, పిలియన్ సీట్, పిలియన్ ఫుట్‌రెస్ట్, ట్రిప్‌మీటర్, ఎలక్ట్రిక్ స్టార్ట్ మరియు క్లాక్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఇంజిన్‌ విషయానికొస్తే.. ఇందులో శక్తివంతమైన 124.8సీసీ ఇంజిన్‌ను ఉపయోగించారు. 11.4hp మరియు 11.2 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఐదు-స్పీడ్ ట్రాన్స్‌మిషన్‌తో జతచేయబడి ఉంటుంది.

TVS రైడర్‌ 125 17-అంగుళాల టైర్‌లపై నడుస్తుంది. ఈ బైక్‌ 5.9 సెకన్లలో 0 నుంచి 60 కి.మీ వేగాన్ని అందుకుంటుంది. గంటకు 99 కి.మీ వేగంతో దూసుకుపోతుంది. ఈ బైక్‌ లీటర్‌కు 67 కి.మీ మైలేజ్‌ను అందిస్తుంది. కాగా ఈ బైక్ మార్కెట్లోకి విడుదలైనప్పటి నుంచి టెక్నాలజీ పరంగా అప్‌డేట్లతో సరికొత్త వేరియంట్లతో కస్టమర్లను ఆకట్టుకుంటోంది.

Article Published On: Saturday, February 24, 2024, 17:36 [IST]
English summary
Tvs raider 125 crosses 7 lakhs sales milestone top tvs bike in fy 2024
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+