కొత్త వేరియంట్‌లో స్పోర్టీ లుక్ బైక్ లాంచ్.. ధర కేవలం రూ. 84,869 మాత్రమే, 67 కిమీ మైలేజీ!
మార్కెట్‌లో టీవీఎస్ స్కూటర్లకు మంచి డిమాండ్ ఉంది. ఈ కంపెనీకి చెందిన మోటార్‌సైకిల్స్ అధిక మైలేజీని అందించడంతో పాటు ఢిఫరెంట్ లుక్‌ని కలిగి ఉంటాయి. దీంతో దేశంలోనే టాప్ టూవీలర్స్ ఉత్పత్తిలో ఈ కంపెనీ చోటుసంపాదించింది. ప్రస్తుతం దేశీయ మార్కెట్‌లో మిగతా కంపెనీల కంటే ఆకర్షణీయమైన ఫీచర్లతో పలు బైక్స్, స్కూటర్లను విక్రయిస్తోంది. ఈ కంపెనీ నుంచి అందుబాటులో ఉన్న టీవీఎస్ రైడర్ (TVS Raider 125) ఎక్కువ సంఖ్యలో అమ్ముడవుతోంది. తక్కువ ధరలో భిన్నమైన డిజైన్‌తో ఈ మైటార్‌సైకిల్ అందుబాటులో ఉంది. తాజాగా ఈ అప్‌డేటెడ్ రైడర్ 125ని కంపెనీ విడుదల చేసింది. సెప్టెంబర్ 24 న విడుదల చేసిన ఈ బైక్ కొత్త వేరియంట్ ధర, స్పెసిఫికేషన్లపై ఓ లుక్కేయండి.
ఈ టీవీఎస్ రైడర్ 125ని డ్రమ్ బ్రేక్ వేరియంట్‌లో కంపెనీ లాంచ్ చేసింది. ఈ వేరియంట్ చాలా సరసమైన ధరలో వినియోగదారులకు అందుబాటులో ఉంటుంది. మార్కెట్‌లో లభిస్తున్న ఇతర డ్రమ్ మోటార్‌సైకిళ్ల మాదిరిగానే దీని ధరను రూ.84,869 (ఎక్స్-షోరూమ్ - న్యూఢిల్లీ)గా నిర్ణయించారు. ప్రస్తుంత ఉన్న వేరియంట్‌తో పోల్చితే ఇప్పుడు దీని బేస్ ధర రూ.11,000 తగ్గింది.

ఇక ఈ సరికొత్త టీవీఎస్ రైడర్ 125 డ్రమ్ బ్రేక్ వేరియంట్ డిజైన్‌లో పెద్దగా మార్పులు చేయలేదు. అయితే సింగిల్ పీస్ సీట్ ఆప్షన్‌తో మాత్రమే లభించే ఈ బైక్ సీట్ రెడ్, వికెడ్ బ్లాక్ అనే రెండు ఆకర్షణీయమైన కలర్ ఆప్షన్స్‌లో లభిస్తుంది. ఈ కలర్స్ బైక్‌కి అదనపు లుక్‌ని అందిస్తాయి. అల్లాయ్ వీల్స్, ఈ బైక్ స్పోర్టీ లుక్‌తో చూడగానే వినియోగదారులను ఆకట్టుకుంటుంది.
ఈ బైక్ ఫర్ఫామెన్స్ విషయానికి వస్తే ఇందులోని 124.8 సీసీ సింగిల్ సిలిండర్ ఎయిర్ కూల్డ్ పెట్రోల్ ఇంజిన్‌తో పనిచేస్తుంది. ఇది 11.12 ps హార్స్ పవర్, 11.2 nm టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఇది 5-స్పీడ్ గేర్ బాక్స్ ఆప్షన్స్‌తో లభిస్తుంది. అంతే కాకుండా ఇది లీటర్ పెట్రోల్‌కి దాదాపు 67 కిలోమీటర్ల భారీ మైలేజీని ఇస్తుంది.

కొత్త టీవీఎస్ రైడర్ 125 డ్రమ్ బ్రేక్ వేరియంట్ అనేక అద్భుతమైన ఫీచర్లను కలిగి ఉంది. ఇందులో ఎల్ఈడీ లైటింగ్, వివిధ రైడింగ్ మోడ్స్, LCD ఇన్‌స్ట్రూమెంట్ క్లస్టర్ ఉన్నాయి. హై వేరియంట్‌లో TFT డిస్ప్లే, స్టార్ట్ ఎక్సోకనెక్ట్ (SmartXonnect) వంటి ఫీచర్లు ఉంటాయి. ఈ బైక్ 123 కిలోల బరువుని కలిగి ఉంటుంది. దీని ఫ్యూయెల్ ట్యాంక్ కెపాసిటీ 10 లీటర్లుగా ఉంది.
దీనిలోని బ్రేకింగ్ సిస్టమ్, సస్పెన్షన్ సెటప్ వినియోగదారులను ఎటువంటి ఇబ్బందులకు గురిచేయదు. ముందు భాగంలో టెలిస్కోపిక్ ఫోర్క్, వెనుక 5-స్టెప్స్ ప్రీలోడ్ అడ్జస్టబుల్ మోనోషాక్ సస్పెన్షన్ సెటప్‌తో వస్తుంది. ఇది ఎకో అండ్ పవర్ అనే మోడ్స్‌తో వస్తుంది. ఈ రెండింట్లోనూ ఇది మంచి అవుట్‌పుట్‌ని అందిస్తుంది.

ఈ కొత్త టీవీఎస్ రైడర్ 125 బేస్ వేరియంట్ మార్కెట్‌లోని హోండా SP 125 (Honda SP 125) ప్రారంభ ధర రూ .86,467, హీరో ఎక్స్‌ట్రీమ్ 125ఆర్ (Hero Xtreme 125R), బజాజ్ ఫ్రీడమ్ 125 సీఎన్‌జీ (Bajaj Freedom 125) బైక్ ధర రూ.95,000 బైక్స్‌కి గట్టి పోటీని ఇస్తుంది. ఇవన్నీ ఎక్స్-షోరూమ్ ధరలే.
డ్రైవ్స్‌పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








