iGO టెక్నాలజీతో సరికొత్త టీవీఎస్‌ రైడర్‌ బైక్‌ లాంచ్.. ఇంతకీ అది ఏం చేస్తుందంటే!

టీవీఎస్‌ మోటార్‌ కంపెనీ నుంచి ప్రసిద్ధి చెందిన బైక్‌ ఏదైనా ఉందంటే ఠక్కున రైడర్ (TVS Raider 125) అని చెప్పేస్తారు. ఈ సంస్థ నుంచి వచ్చిన 2016 సెప్టెంబర్‌లో మార్కెట్‌లో అడుగుపెట్టిన ఈ బైక్ క్లిక్‌ అయ్యేందుకు చాలా నెలలు వేచి చూస్తుంది. ఇప్పుడు దేశంలో 125 సెగ్మెంట్‌లోనే అత్యధికంగా అమ్ముడవుతున్న మోటార్‌సైకిల్స్‌లో ఒకటిగా నిలిచింది. ఈ టీవీఎస్ బైక్‌ ఆ కంపెనీలోనే ఫ్లాగ్‌షిప్‌ మోడల్‌లో ఒకటిగా అవతరించింది. ప్రస్తుతం భారతదేశంలో అమ్ముడవుతున్న చౌకైన 125 సీసీ బైకులలో ఇది ఒకటి కావడం గమనార్హం. టీవీఎస్ మోటార్ కంపెనీ ఇప్పుడు ఈ బైక్‌ని కొత్త ఆప్షన్‌తో ప్రవేశపెట్టింది. దీనికి సంబంధించి వివరాలపై ఓ లుక్కేయండి.

టీవీఎస్ రైడర్‌కి భారత్‌లో మంచి ఆదరణ లభించింది. ఇటీవలే 10 లక్షల అమ్మకాలతో రికార్డు సృష్టించింది. తాజాగా టీవీఎస్‌ తీసుకువచ్చిన రైడర్‌ 125లో కొత్త ఐజీఓ అసిస్ట్‌తో (iGo Assist) అందుబాటులోకి తెచ్చింది. దీనిని కేవలం రూ 98,389 (ఎక్స్‌-షోరూమ్‌)గా నిర్ణయించారు. 125 సీసీ బైక్ సెగ్మెంట్‌లో ఈ ఫీచర్ పొందిన తొలి మోటార్ సైకిల్‌గా రైడర్‌ 125 నిలిచింది.

TVS Raider iGO Variant Launch

ఈ iGo అసిస్ట్ అనేది ఓ బూస్ట్ మోడ్‌ల పనిచేస్తుంది. దీనివల్ల ఇప్పుడున్న బైక్ కంటే ఇది కొంచెం ఎక్కువ ఎనర్జీ అవుట్‌పుట్‌ని విడుదల చేస్తుంది. ఈ ఐ-గో టెక్నాలజీ 6,000 rpm వద్ద 11.75 nm గరిష్ట టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఇది సాధారణ టీవీఎస్ రైడర్ కంటే 0.55 nm ఎక్కువ ఉంటుంది.

ఈ బూస్ట్‌ మోడ్‌ వల్ల ఇది కేవలం 5.8 సెకన్లలో 0 నుంచి 60 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. ఐ-గో మోడ్‌ని యాక్టివేట్ చేస్తేనే మనం ఈ ఫర్పామెన్స్‌ని పొందవచ్చు. అంతే కాదు ఈ రైడర్ 125 ఐ-గో వెర్షన్‌ని మరింత ఆకర్షణీయంగా కనిపించడానికి టీవీఎస్ కొత్త కలర్ ఆప్షన్‌లో కూడా ప్రవేశపెట్టింది. దీనిని నార్డో గ్రే (Nardo Grey) అనే కలర్ ఆప్షన్‌లో ప్రవేశపెట్టింది.

అంతే కాకుండా ఈ బైక్‌కి ప్రత్యేక స్టైలింగ్‌ ఉండటానికి అల్లాయ్ వీల్స్‌కి రెడ్‌ కలర్‌ని అందించారు. ఈ బైక్‌ మంచి శక్తిని ఉత్పత్తి చేయడమే కాకుండా ఇంధన పొదుపులోనూ ఉపయోగపడుతుంది. దీనివల్ల 10 శాతం వరకు ఇంధనం ఆదా అవుతుందని కంపెనీ పేర్కొంది. ఈ మోటార్ సైకిల్ 124.8 సీసీ శక్తిని ఉత్పత్తి చేసే ఎయిర్-ఆయిల్-కూల్డ్ ఇంజిన్‌తో పనిచేస్తుంది.

ఇది గరిష్టంగా 11.2 hp వరకు పవర్‌ని ఉత్పత్తి చేయగలదు. ఈ బైక్‌లో LCD కనెక్టెడ్ క్లస్టర్ కూడా ఉందని కంపెనీ పేర్కొంది. ఈ బైక్ 85 కి పైగా కనెక్టివిటీ సౌకర్యాలను కలిగి ఉండటం గమనార్హం. ఈ బైక్ ముందు భాగంలో టెలిస్కోపిక్ ఫోర్క్స్‌, వెనుక భాగంలో 5-స్టెప్స్‌ సర్దుబాటు మోనో-షాక్‌తో వస్తుంది.

వీటితో పాటు బ్లూటూత్ కనెక్టివిటీ, వాయిస్ అసిస్టెన్స్, టర్న్ బై టర్న్ రూట్ సమాచారాన్ని అందించే నావిగేషన్ సిస్టమ్, మెసేజ్‌ అలర్ట్స్‌ వంటివి టీవీఎస్ రైడర్‌లో ఉన్నాయి. చౌకైన స్పోర్ట్స్ బైక్ టూ వీలర్స్‌లో రైడర్ మోటార్‌సైకిల్‌ ఒకటి కాబట్టి దీనిని కస్టమర్లు కొనుగోలు చేయవచ్చు. ఈ రైడర్ ఐ-గోతో సేల్స్‌ మరింత పెరిగే అవకాశం ఉంది.

డ్రైవ్స్‌పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీ తోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

More from DriveSpark

Article Published On: Thursday, October 24, 2024, 16:47 [IST]
English summary
Tvs raider 125 igo variant launched at rs 98389 check all details in telugu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+