టీవీఎస్‌ వాహనాలకు క్రేజ్‌ మామూలుగా లేదుగా.. ఫిబ్రవరిలో సేల్స్‌ పరంగా రికార్డుల మోత

ఫిబ్రవరి నెల ముగియడంతో ఆటో మేకర్లు తమ నెలవారీ సేల్స్‌ జాబితాను విడుదల చేశాయి. ఈ క్రమంలో ప్రముఖ దేశీ బ్రాండ్‌ టీవీఎస్‌ మోటార్స్‌ ఎప్పటిలాగే ఈ సారి మార్కెట్‌లో దూకుడు కొనసాగించింది. కాగా ఫిబ్రవరి నెలలో టీవీఎస్‌ మోటార్స్ ఎన్ని ద్విచక్ర వాహనాలను విక్రయించిందో ఈ కథనంలో తెలుసుకుందాం..

తమిళనాడులోని హోసూర్‌లో ఫ్యాక్టరీని కలిగి ఉన్న టీవీఎస్ ప్రతి నెలా సగటున 3 లక్షలకు పైగా వాహనాలను విక్రయిస్తోంది. అయితే, ఫిబ్రవరి 2024 లో, TVS మోటార్ దేశీయంగా, అంతర్జాతీయంగా కలిపి 3 లక్షల 68 వేల 424 వాహనాలను విక్రయించించి రికార్డు సృష్టించింది. వీటిలో ద్విచక్ర వాహనాలే కాకుండా త్రీ వీలర్లు కూడా ఉన్నాయి.

TVS-Sales-In-February-2024

గత నెలలో TVS మోటార్స్(TVS Sales In February 2024) విక్రయించిన 2-వీలర్లను మాత్రమే పరిగణనలోకి తీసుకుంటే, TVS గత నెలలో మొత్తం 3,57,810 ద్విచక్ర వాహనాలను సేల్స్‌ను నమోదు చేసింది. కాగా గతేడాది ఫిబ్రవరిలో TVS కేవలం 2,67,026 టూ వీలర్స్‌ను మాత్రమే విక్రయించడంతో ఈ సారి.. 34% వృద్ధిని నమోదు చేసింది.

3,57,810 టూ వీలర్లలో సంస్థ 2 లక్షల 67 వేల 502 వాహనాలను భారత్‌లో విక్రయించింది. అయితే జనవరి 2023 నాటికి దేశీయంగా కేవలం 2,21,402 టీవీఎస్‌ టూ-వీలర్లు మాత్రమే విక్రయించబడ్డాయి. గత ఫిబ్రవరిలో టీవీఎస్ మోటార్స్ 1 లక్షా 84 వేల 23 బైక్‌లతో సహా మొత్తం 3,57,810 టూ వీలర్‌ సేల్స్‌ను నమోదు చేసింది.

TVS-Sales-In-February-2024

కానీ ఫిబ్రవరి 2023లో, TVS దేశీయంగా(TVS Sales) మరియు అంతర్జాతీయంగా భారత్‌ నుంచి 1,26,243 బైక్‌లను మాత్రమే విక్రయించింది. ఈ విషయంలో గతేడాది ఫిబ్రవరితో పోలిస్తే టీవీఎస్ బైక్‌ల విక్రయాలు 46 శాతం పెరిగాయని నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఇక స్కూటర్ల విషయానికొస్తే, గత నెలలో ప్రపంచవ్యాప్తంగా మొత్తం లక్షా 32 వేల 152 టీవీఎస్ స్కూటర్లు సేల్‌ అయ్యాయి.

అయితే, ఫిబ్రవరి 2023 నెలలో కేవలం 1 లక్ష 4,825 టీవీఎస్‌ స్కూటర్లు మాత్రమే అమ్ముడయ్యాయి. ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్ ప్రస్తుతం టీవీఎస్ మోటార్స్ విక్రయిస్తున్న ఏకైక ఎలక్ట్రిక్ వాహనంగా ఉంది. ఫిబ్రవరి 2024లో టీవీఎస్‌ విక్రయించిన iQube(TVS iQube Sales) ఎలక్ట్రిక్ స్కూటర్ల సంఖ్య 10,614.

TVS-Sales-In-February-2024

అయితే, ఫిబ్రవరి 2023 నెలలో కేవలం 9,124 iQube స్కూటర్లను మాత్రమే సంస్థ విక్రయించింది. దీని ప్రకారం, iQube ఎలక్ట్రిక్ స్కూటర్ల అమ్మకాలు 16 శాతం పెరిగాయి. భారత్‌తో సహా మొత్తం 80 దేశాల్లో టీవీఎస్‌ మోటార్‌కు చెందిన వాహనాలు అమ్ముడవుతుండటం విశేషం.

TVS మోటార్ కంపెనీ మాత్రమే కాదు, అనేక ఆటోమొబైల్ కంపెనీలు ఇటీవలి నెలల్లో అమ్మకాలలో గణనీయమైన పెరుగుదలను చూడటం ఆటోమొబైల్‌ పరిశ్రమలో గణనీయమైన వృద్ధిని సూచిస్తోంది. ప్రపంచంలోనే అతిపెద్ద ఆటోమొబైల్ మార్కెట్‌గా భారత్‌ అవతరిస్తోందని దీని ద్వారా తెలుస్తోంది. అయితే, టీవీఎస్ ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్ల విక్రయాల పరంగా నెమ్మదిగా సత్తా చాటుతోంది.

TVS-Sales-In-February-2024

డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

More from DriveSpark

Article Published On: Saturday, March 2, 2024, 9:52 [IST]
English summary
Tvs registered record sales in february 2024 along with iqube electric scooter
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+