కార్గిల్‌ వీరులకు గుర్తుగా కొత్త బైక్‌ ఆవిష్కరణ.. డిజైన్‌ చూస్తే రోమాలు నిక్కపొడవడం ఖాయం!

1999 జూలై 26న జరిగిన కార్గిల్ యుద్ధంలో పాకిస్థాన్‌ సైన్యంపై విజయం సాధించడాన్ని పురస్కరించుకుని ప్రతి సంవత్సరం అదే రోజుని 'కార్గిల్ విజయ్ దివాస్‌'గా భారత్‌ సెలబ్రేట్‌ చేసుకుంటుంది. 2024 జూలై 26 నాటికి 25వ కార్గిల్ విజయ్ దివాస్‌ని జరుపుకుంటుండంతో టీవీఎస్ మోటార్ కంపెనీ సరికొత్త బైక్‌ని ఆవిష్కరించింది. ఈ మోడల్‌కి టీవీఎస్ రోనిన్ పరాక్రమ్ (TVS Ronin Parakram) అని నామకరణం చేసింది.

ఇతర రోనిన్‌ బైక్స్‌తో పోల్చితే ఇందులో అనేక డిజైన్‌ మార్పులు కలిగి ఉన్నాయి. ఈ రోనిన్ పరాక్రమ్ టీవీఎస్ మోటోసోల్‌ 2023లో ప్రదర్శించిన కస్టమ్-బిల్ట్ మోటార్‌ సైకిళ్లను పోలి ఉంటుంది. టీవీఎస్ రోనిన్‌ మోడళ్లతో పోల్చితే ఇది అనేక కస్టమైజేషన్‌లతో తీసుకువచ్చింది. కొత్త స్టైలింగ్ ఇండికేటర్లతో వచ్చిన పరాక్రమ్ ఎడిషన్‌ రోనిన్ బైక్‌లు అస్సలు అనిపించదు. దీని డిజైన్ రోనిన్ స్టాండర్డ్ బైక్ కంటే చాలా భిన్నంగా కనిపిస్తుంది.

TVS-Ronin-Parakram-Launched

రోనిన్‌ల మాదిరిగానే సర్యూలర్ హెడ్‌ల్యాంప్‌ నిలుపుకున్నప్పటికీ, బైక్ ముందు భాగంలో మెటాలిక్ విండ్ స్క్రీన్‌ని కలిగి ఉంది. ఈ మోటార్ సైకిల్ ప్రధానంగా ముదురు ఆకుపచ్చ రంగు, సిల్వర్‌ కలర్‌లో ఉంటుంది. భారత జెండాపై ఉండే కాషాయ, తెలుపు, ఆకుపచ్చ రంగులను మోటార్ సైకిల్ హెడ్‌ల్యాంప్, ట్యాంక్‌పై అమర్చారు. ఈ మోటార్ సైకిల్‌పై దేశంలోని వివిధ ప్రాంతాల్లో భారత సైన్యానికి చెందిన గ్రాఫిక్స్ కూడా ఉన్నాయి.

కొన్ని ప్యానెల్స్‌కి అల్యూమినియం ఫినిషింగ్ లభిస్తుంది. ఇదిలా ఉంటే ట్యాంక్, లోయర్ సైడ్ ప్యానెల్స్ ఆకుపచ్చ రంగులో ఉంటాయి. సీటు కొత్త గోధుమ కలర్‌ (Dark Brown) కవర్‌ని పొందుతుంది. పిలియన్ రైడర్‌ కూర్చునే చోట సింక్రనైజ్ కౌల్‌తో డిజైన్‌ చేశారు. టర్న్ ఇండికేటర్లు బుల్లెట్ ఆకారాన్ని పొందుతాయి. ఇది భారీ టైర్లను కలిగి ఉంటుంది. ఈ రోనిన్‌ పరాక్రమ్ కోసం డైమండ్ కట్ అల్లాయ్ వీల్స్‌ని అందించారు.

TVS-Ronin-Parakram-Price

ఇందులోని 225.9సీసీ సింగిల్ సిలిండర్ ఆయిల్ కూల్డ్ ఇంజిన్ గరిష్టంగా 7,750rpm వద్ద 20.12 bhp పవర్ మరియు 3,750 rpm వద్ద 19.93 nm గరిష్ట టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది ఈ ఇంజిన్ 5-స్పీడ్ గేర్ బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది. ముందు భాగంలో 41 mm అప్‌సైడ్ డౌన్ ఫోర్క్స్‌, వెనుక భాగంలో మోనోషాక్ సస్పెన్షన్ ఉన్నాయి. రెండు వైపులా బ్రేకింగ్ విధులను డిస్క్ బ్రేకులు నిర్వహిస్తాయి.

ఈ 225సీసీ నియో రెట్రో రోడ్‌స్టర్ బైకులో రెండు ఏబీఎస్ మోడ్స్ ( ఫుల్ ఎల్‌ఈడీ లైటింగ్ అండ్ రెయిన్ రోడ్ ), గ్లైడ్ త్రూ టెక్నాలజీ, ఎల్‌సీడీ ఇన్‌స్ట్రూమెంట్ క్లస్టర్ ఉన్నాయి. ఇందులో ఫ్యూయల్ ఇండికేటర్‌, గేర్ షిఫ్ట్ ఇండికేటర్, టర్న్‌-బై-టర్న్‌ నావిగేషన్స్‌ స్పీడ్ ఇతర సమాచారాన్ని క్లస్టర్ డిస్ప్లే చేస్తుంది. ఇన్‌కమింగ్ కాల్స్‌, మెసేజ్ అలర్ట్స్ కోసం బ్లూటూత్ ద్వారా స్మార్ట్‌ఫోన్‌కి కనెక్ట్ చేసుకోవచ్చు.

TVS-Ronin-Parakram-Fuel-Tank

ఇది రాయల్ ఎన్‌ఫీల్డ్‌ హంటర్ 350 మరియు హోండా సీబీ 350RS లకు గట్టి పోటీ ఇస్తుంది. వీటి ధరలు వరుసగా రూ .1.49 లక్షలు, రూ .2.38 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)గా ఉన్నాయి. అయితే పరాక్రమ్ స్పెషల్ ఎడిషన్ మాస్ ప్రొడక్షన్ లోకి వెళ్తుందా లేదా అనేది ప్రస్తుతానికి స్పష్టత లేదు. అయితే దీని ధర ఇతర వివరాలు అధికారికంగా వెల్లడి కావాల్సి ఉంది.

డ్రైవ్స్‌పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

More from DriveSpark

Article Published On: Wednesday, July 31, 2024, 15:45 [IST]
English summary
Tvs ronin parakram unveiled to honour the heroes of the kargil war
Read more on: #tvs #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+