టీవీఎస్ నుంచి కొత్త ఇంజిన్ ఆవిష్కరణ.. హై ఫర్ఫామెన్స్, స్మార్ట్ కూలింగ్!
గోవాలో టీవీఎస్ మోటార్ కంపెనీ నిర్వహిస్తున్న టీవీఎస్ మోటోసోల్ అట్టహాసంగా కొనసాగుతోంది. ఈ మోటోసోల్ 4.0 తొలి రోజు కంపెనీ తన తదుపరి తరం టీవీఎస్ ఆర్‌టీఎక్స్‌డీ4 (RTXD4) ఇంజిన్‌ని ఆవిష్కరించింది. ఈ ఇంజిన్‌ని త్వరలో మార్కెట్‌లోకి తీసుకురానున్న అడ్వెంచర్ బైక్స్‌లో వినియోగించనున్నారు. ఈ ప్లాట్‌ఫామ్‌తో వచ్చే ఇంజిన్ హై ఫర్ఫామెన్స్, సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందిస్తుందని టీవీఎస్ మోటార్ కంపెనీ వెల్లడించింది.
ఈ టీవీఎస్ ఆర్‌టీఎక్స్‌డీ4 ఇంజిన్ సంస్థలోనే ఓ కీలక మైలురాయిగా నిలుస్తుందని టీవీఎస్ మోటార్ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ సుదర్శన్ వేణు తెలిపారు. ప్రత్యేక టెక్నాలజీ, ఇతర అడ్వాన్స్‌డ్ వెర్షన్స్‌తో ఇది వినియోగదారులను ఆకట్టుకుంటుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. టీవీఎస్ మోటార్‌సైకిల్స్ ద్వారా మంచి రైడింగ్ అనుభవాన్ని అందించే ఉద్దేశంతో తీసుకువస్తున్న ఈ ఇంజిన్ భవిష్యత్తులో కీలకంగా మారుతుందన్నారు.

హోసూరులోని రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ సెంటర్‌లో కాన్సెప్ట్, డిజైన్‌ని, అభివృద్ధి చేసిన ఈ సరికొత్త ఇంజిన్ మా ఇంజనీరింగ్, పరిశోధన సామర్థ్యానికి నిదర్శనంగా నిలుస్తుంది అన్నారు. ఈ ఇంజిన్స్‌ని బీఎండబ్ల్యూ మోటోరాడ్ భాగస్వామ్యంలో తీసుకువస్తున్న RR 310, RTR 310 మోటార్‌సైకిల్స్‌లో వినియోగించునున్నారు. ఇవి 6 స్పీడ్ గేర్‌బాక్స్ ఆప్షన్‌తో వస్తాయి. అంతే కాకుండా రైడ్ బై వైర్ టెక్నాలజీతో రానున్నాయి. ఇది ఢిఫరెంట్ రైడింగ్ మోడ్స్‌కి కలిగి ఉంటుంది.
ఈ RTX అడ్వెంచర్ మోటార్ సైకిల్స్ స్పోక్డ్ వీల్స్, టూబ్యూడ్ టైర్స్, అలాగే ముందు USD ఫోర్క్స్, వెనక మోనోషాక్‌తో వస్తాయి. ఈ బైక్స్‌లోని సస్పెన్షన్ సెటప్ అడ్వెంచర్ అవసరాలకు తగినట్లుగా అందించనున్నారు. వీటిలో స్మార్ట్‌ఎక్సోనెట్ యాప్ ద్వారా పనిచేసే ఫుల్లీ డిజిటల్ ఇన్‌స్ట్రూమెంట్ క్లస్టర్ కలదు. దీని ద్వారా బైక్‌కి సంబంధించిన పూర్తి ఫీచర్లను కంట్రోల్ చేయవచ్చు.

ఇక ఈ కొత్త ఇంజిన్‌లో ప్రాసెస్డ్ పెర్ఫార్మెన్స్, రైడర్ కంఫర్ట్ కోసం ప్లాస్మా స్ప్రే-కోటింగ్, హై హీట్ కంట్రోల్, క్రాంక్ షాఫ్ట్ కంట్రోల్ షెల్, హెలికల్ గేర్ బ్యాలెన్స్ సిస్టమ్ కలవు. ఈ కొత్త తరం ప్లాట్‌ఫామ్ భారీ మైలేజీ, ఇథనాల్ మిశ్రమ ఇంధనం ద్వారా తక్కువ కార్బన్ ఉద్గారాలను అందిస్తుంది. ఈ కొత్త ఇంజిన్ 299.1 సీసీ, సింగిల్ సిలిండర్, ఫార్వర్డ్-ఇన్-లైన్ ఇంజిన్‌తో వస్తుంది.
ఈ ఇంజిన్ 9,000 rpm వద్ద 35 ps పవర్‌ని, 7,000 rpm వద్ద 28.5 nm టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఇందులో డ్యూయల్ కూలింగ్, అసిస్ట్, స్లిప్పర్ క్లచ్‌తో లిక్విడ్ కూలింగ్ (వాటర్ మరియు ఆయిల్ జాకెట్లు)తో వస్తుంది. ఓవరాల్ టీవీఎస్ మోటోసౌల్ 4.0 మొదటి రోజు ఆ కంపెనీ ఇంజనీరింగ్ సంబంధించిన థ్రిల్లింగ్ ప్రదర్శనను అందించింది.

ఈ ఈవెంట్‌లో సరికొత్త ఉత్పత్తులతో పాటు భవిష్యత్తులో చేపట్టబోయే కార్యక్రమాలను టీవీఎస్ వెల్లడించనుంది. ఈ ఉత్పత్తుల ద్వారా సేల్స్‌ని పెంచుకునే ప్రయత్నం టీవీఎస్ చేయనుంది. భవిష్యత్తులో ఇతర కంపెనీ మోటార్‌సైకిళ్లకు పోటీగా మార్కెట్‌లో ట్రెండ్ సెట్ చేసేందుకు కొత్త బైక్స్‌ని ప్రవేశపెట్టనుంది. అంతే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా బీఎండబ్ల్యూ మోటోరాడ్ వంటి ప్రఖ్యాత కంపెనీలతో భాగస్వామ్యంతో బైక్స్‌ని ప్రవేశపెట్టడం కీలక మైలురాయిగా చెప్పవచ్చు.
డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








