మహిళల కోసం బెస్ట్ స్కూటర్స్.. తక్కువ ధర & బెస్ట్ మైలేజ్!
దేశంలో కార్లు, బైకులు మాత్రమే కాకుండా రోజువారీ వినియోగానికి, తక్కువ దూరాలకు ప్రయాణించడానికి స్కూటర్‌లను విరివిగా ఉపయోగిస్తారని అందరికి తెలుసు. అయితే చాలా మంది తక్కువ ధరలో లభించే.. ఉత్తమ మైలేజ్ అందించే స్కూటర్లను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతారు. ఇది మాత్రమే కాకుండా మహిళల కోసం కొన్ని ప్రత్యేకమైన స్కూటర్లు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. మహిళలకు ఇష్టమైన స్కూటర్లు ఎన్నెన్ని ఉన్నా.. టీవీఎస్ కంపెనీ యొక్క స్కూటర్‌లకు మాత్రం ఓ ప్రత్యేకమైన ఆదరణ ఉంది.ఈ కథనంలో బడ్జెట్ ధరలో మంచి మైలేజ్ అందించే.. స్త్రీలకు ఇష్టమైన స్కూటీ గురించి తెలుసుకుందాం.
ముందుగా టీవీఎస్ మోటార్ యొక్క స్కూటీ పెప్ ప్లస్ విషయానికి వస్తే.. దీని ధర రూ. 63060 నుంచి రూ. 66160 మధ్య ఉంటుంది. సింపుల్ డిజైన్ కలిగిన ఈ స్కూటర్ 87.8 సీసీ పెట్రోల్ ఇంజిన్ పొందుతుంది. ఇది 5.43 పీఎస్ పవర్ మరియు 6.5 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఫీచర్స్ కూడా వినియోగదారులకు అవసరమైనవన్నీ ఉన్నాయని తెలుస్తోంది.

టీవీఎస్ స్కూటీ పెప్ ప్లస్ 50 కిమీ / లీ మైలేజ్ అందిస్తూ.. ఒకప్పటి నుంచి మార్కెట్లో అత్యద్భుతమైన అమ్మకాలను పొందూతూనే ఉంది. ఇది హాలోజన్ హెడ్‌లైట్, ఎల్ఈడీ డీఆర్ఎల్, అనలాగ్ ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్, యూఎస్‌బీ ఛార్జింగ్ పోర్ట్ మరియు సైడ్ స్టాండ్ అలారం వంటి అప్డేటెడ్ ఫీచర్లు ఉన్నాయి. ఇవన్నీ ఉత్తమ రైడింగ్ అనుభూతిని అందిస్తాయి.
మ్యాట్ బ్లాక్, మ్యాట్ బ్లూ వంటి మల్టిపుల్ కలర్ ఆప్షన్లలో లభించే ఈ స్కూటర్.. ముందు భాగంలో టెలిస్కోపిక్ ఫోర్క్, వెనుక మోనోషాక్ సస్పెన్షన్ సెటప్ ఉన్నాయి. డ్రమ్ బ్రేక్ ఆప్షన్స్ ఇందులో ఉన్నాయి. ఈ స్కూటర్ ఫ్యూయెల్ ట్యాంక్ కెపాసిటీ 4.2 లీటర్లు. దీని బరువు కేవలం 93 కేజీలు మాత్రమే. ఈ స్కూటర్ అన్ని విధాలా వినియోగానికి చాలా ఉపయోగకరంగా ఉంటాయని స్పష్టంగా తెలుస్తోంది.

ఇక టీవీఎస్ స్కూటీ జెస్ట్ విషయానికి వస్తే.. దీని ధర రూ. 72614 మరియు రూ. 73417 మధ్య (ఎక్స్ షోరూమ్) ఉంటాయి. ఇది 109.7 సీసీ ఎయిర్ కూల్డ్ సింగిల్ సిలిండర్ పెట్రోల్ ఇంజిన్ పొందుతుంది. ఇది 7.8 పీఎస్ పవర్ మరియు 8.8 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. 48 కిమీ/లీ మైలేజ్ అందిస్తుంది. కాబట్టి ఇది రోజువారీ వినియోగానికి కూడా చాలా ఉపయోగకరంగా ఉంటాయి.
టీవీఎస్ స్కూటీ జెస్ట్ మంచి డిజైన్ కలిగి అత్యధిక ఫీచర్స్ పొందుతాయి. ఇందులో అనలాగ్ ఇన్స్ట్రుమెంట్ కన్సోల్‌తో సహా వివిధ ఫీచర్స్ అందుబాటులో ఉన్నాయి. ఇది మ్యాట్ బ్లాక్, మ్యాట్ బ్లూ, మ్యాట్ పర్పుల్ మరియు మ్యాట్ రెడ్ వంటి అనేక రంగులలో అందుబాటులో ఉంది. 5 లీటర్ ఫ్యూయెల్ కెపాసిటీ కలిగిన ఈ స్కూటర్ 103 కేజీల బరువు పొందుతుంది.
స్కూటీ జెస్ట్ యొక్క ముందు భాగంలో టెలిస్కోపిక్ పోర్క్ మరియు వెనుక భాగంలో సింగిల్ షాక్ సస్పెన్షన్ ఉన్నాయి. ఈ స్కూటర్ డ్రమ్ బ్రేక్ పొందుతుంది. దీని ముందు వైవు 90/90 మరియు 90/100 సెక్షన్ ట్యూబ్‌లెస్ టైర్‌లతో కూడిన 10 ఇంచెస్ స్టీల్ వీల్స్ పొందుతుంది. ఇది కూడా రోజువారీ వినియోగానికి చాలా ఉపయోగకరంగా ఉంటుందని తెలుస్తోంది.
ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథనాలు తెలుసుకోవడంతో పాటు, దేశీయ మార్కెట్లో లాంచ్ అయ్యే కొత్త కార్లు మరియు బైకుల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి 'తెలుగు డ్రైవ్‌స్పార్క్' చూస్తూ ఉండండి. ఈ కథనంపై మీ అభిప్రాయాలను మరియు సందేహాలను తప్పకుండా మాతో పంచుకోండి. లేటెస్ట్ ఆటోమొబైల్ వార్తలు కోసం ఫేస్‌బుక్ (Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) మరియు యూట్యూబ్ (YouTube) ఛానల్స్ ఫాలో అవ్వండి.


Click it and Unblock the Notifications








